ప్రధాన మంత్రి కార్యాలయం

ఏప్రిల్ 21 వ తేదీ నాడు భగవాన్ మహావీరుని 2550 వ నిర్వాణమహోత్సవాన్ని ప్రారంభించనున్న ప్రధాన మంత్రి


ఈ సందర్భం లో స్మారక తపాలా బిళ్ళ ను మరియు నాణేన్ని ప్రధాన మంత్రి విడుదల చేయనున్నారు

జైన సముదాయాని కి చెందిన సాధువులు ఈ కార్యక్రమం లోపాలుపంచుకొని, జన సమూహానికిఆశీర్వాదాలను ఇవ్వనున్నారు  

Posted On: 20 APR 2024 7:47PM by PIB Hyderabad

పవిత్రమైనటువంటి మహావీర్ జయంతి ని పురస్కరించుకొని ఏప్రిల్ 21 వ తేదీ నాడు ఉదయం పది గంటల కు న్యూ ఢిల్లీ లోని భారత్ మండపం లో భగవాన్ మహావీరుని 2550 వ నిర్వాణ మహోత్సవాన్ని ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ ప్రారంభించనున్నారు. ఈ సందర్భం లో ఒక స్మారక తపాలా బిళ్ళ ను మరియు నాణేన్ని కూడా ప్రధాన మంత్రి ఆవిష్కరించనున్నారు; సభికుల ను ఉద్దేశించి ఆయన ప్రసంగిస్తారు కూడాను.

 

 

అహింస, సత్యం, అస్తేయం (దొంగతనం జోలికి వెళ్లక పోవడం), బ్రహ్మచర్యం, ఇంకా అపరిగ్రహ (అనాసక్తి) ల వంటి జైన సిద్ధాంతాల మాధ్యం ద్వారా శాంతిపూర్ణ సహ అస్తిత్వం మరియు సార్వజనిక సోదర భావం ల బాట ను 24 వ తీర్థంకరుడు భగవాన్ మహావీర్ ప్రకాశవంతం చేసి వేశారు.

 

 

జైన్ మహావీర్ స్వామి జీ సహా ప్రతి ఒక్క తీర్థంకరుని యొక్క అయిదు కల్యాణక్ (ప్రముఖ కార్యక్రమం)ల ను జైనులు జరుపుకొంటూ ఉంటారు: వాటిలో చ్యవన్ / గర్భ కల్యాణక్ (గర్భాదానం) ; జన్మ కల్యాణక్; దీక్ష కల్యాణక్, కేవల్ జ్ఞాన కల్యాణక్ లతో పాటు నిర్వాణ కల్యాణక్ అనే కార్యక్రమాలు భాగం గా ఉంటాయి. 2024 వ సంవత్సరం లో ఏప్రిల్ 21 వ తేదీ న భగవాన్ శ్రీ మహావీర్ స్వామి యొక్క జన్మ కల్యాణ తిథి కాగా ఈ సందర్భం లో జైన సముదాయం తో ప్రభుత్వం కలసి భారత్ మండపమ్ లో ఒక సాంస్కృతిక కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం ద్వారా ఈ ఉత్సవాన్ని నిర్వహిస్తున్నది. జైన సముదాయం యొక్క సాధువులు ఈ కార్యక్రమం లో పాలుపంచుకొని, వారి యొక్క ఆశీర్వాదాల ను సభికుల కు అందజేయనున్నారు.

 

 

 

***



(Release ID: 2018440) Visitor Counter : 52