i
|
అన్ని నియోజక వర్గాల్లో ముందుగా పోలింగ్‌కు సంసిద్ధత సహా భాగస్వాములందరికీ... అంటే- అభ్యర్థులు, రాజకీయ పార్టీలన్నిటికీ సమాన అవకాశాలు కల్పించాలి.
|
ii
|
ఎన్నికల ప్రక్రియ ఆద్యంతం తమకు కేటాయించబడిన పార్లమెంటరీ నియోజకవర్గాల్లో ప్రత్యక్షంగా అందుబాటులో ఉండాలి.
|
|
III
|
నిర్దేశిత నియోజకవర్గాల పరిధిలో పరిశీలకుల రోజువారీ బస చిరునామా సహా మొబైల్/ ల్యాండ్‌లైన్/ఇమెయిల్ తదితర వివరాలను విస్తృత స్థాయిలో ప్రచురణ, ప్రచారం ద్వారా అభ్యర్థులు, రాజకీయ పార్టీలు/సాధారణ ప్రజానీకం సౌలభ్యం కోసం అందుబాటులో ఉంచాలి.
|
|
IV
|
బలగాల నియామకం తమ సమక్షంలో యాదృచ్ఛికీకరణ ప్రాతిపదికన చేపట్టేలా చూడాలి.
|
v
|
కేంద్ర/రాష్ట్ర పోలీసు బలగాలను సముచిత/తటస్థ రీతిలో మోహరించాలి. ఈ ప్రక్రియ ఏదో ఒక రాజకీయ పార్టీ/అభ్యర్థికి అనుకూలం కాకుండా జాగ్రత్త వహించాలి
|
|
VI
|
ఎలక్ట్రానిక్ ఓటింగ్ యంత్రాలు (ఇవిఎం)/వివిప్యాట్ (వివిపిఎటి)లు, పోలింగ్ సిబ్బంది తమ సమక్షంలో యాదృచ్ఛికీకరణ ప్రాతిపదికన చేపట్టేలా చూడాలి.
|
vii
|
ఓటర్లలో 85 ఏళ్లు పైబడినవారికి, దివ్యాంగులకు ఇంటి వద్దనుంచే ఓటు వేసే ప్రక్రియను సుగమం చేయడంతోపాటు ఎన్నికలతోపాటు సర్వీసు, అత్యవసర విధుల్లోగల సిబ్బందికి పోస్టల్ బ్యాలెట్ ప్రక్రియ సజావుగా సాగేలా చూడాలి.
|
viii
|
రాజకీయ పార్టీలకు, పోటీలోగల అభ్యర్థులకు ఓటర్ల జాబితాలు సరఫరా చేయబడాలి.
|
|
IX
|
సమస్యాత్మక ప్రాంతాల గుర్తింపును జిల్లా యంత్రాంగం పారదర్శకంగా చేపట్టే విధంగానూ, దానికి తగినట్లు రవాణా, సమాచార ప్రదానం తదితరాలకు పటిష్ట ఏర్పాట్లు చేసేలా చూడాలి.
|
x
|
సూక్ష్మ పరిశీలకులను నియమించాలి
|
|
XI
|
ఇవిఎం/వివిప్యాట్ యంత్రాలను అభ్యర్థులు/ప్రతినిధులందరి సమక్షంలో ప్రారంభించాలి.
|
xii
|
ఇవిఎం స్ట్రాంగ్ రూమ్‌ల వద్ద పటిష్ట భద్రత ఏర్పాట్ల పర్యవేక్షణతోపాటు ఆ సమయంలో అభ్యర్థులందరి అధీకృత ఏజెంట్లు కూడా ఉండేలా చూడాలి.
|
xiii
|
అన్నిరకాల ఫిర్యాదుల పరిష్కారం కోసం తగిన యంత్రాంగాలు సిద్ధంగా ఉండేలా చూడాలి.
|
xiv
|
సకాలంలో దిద్దుబాటు చర్యల కోసం అధీకృత అధికారి పూర్తి పర్యవేక్షణలో జిల్లాల్లో సమీకృత కంట్రోల్ రూములు ఏర్పాటు చేసేలా చూడాలి.
|
xv
|
పోలింగ్ రోజుకు ముందే ఓటర్లకు చీటీల పంపిణీ 100 శాతం పూర్తయ్యేలా చూడాలి.
|
xvi
|
సి-విజిల్, ఓటర్ హెల్ప్ లైన్ అనువర్తనం, సక్షం అనువర్తనం, ఎన్‌కోర్, సువిధ అనువర్తనం వంటి అన్ని సమాచార సాంకేతిక అనువర్తనాల ఎన్నికల సిబ్బంది ఉపయోగిస్తారు కాబట్టి, ఈ ప్రక్రియలో వారందరికీ సరైన శిక్షణ ఇవ్వబడిందని నిర్ధారించుకోవాలి.
|
xvii
|
కౌంటింగ్ సిబ్బంది, సూక్ష్మ పరిశీలకులు సహా పోలింగ్ సిబ్బంది మొత్తానికీ శిక్షణ సరైన రీతిలో, సముచితంగా నిర్వహించబడింది/ఇవ్వబడిందని నిర్ధారించుకోవాలి.
|
xviii
|
తమతమ నియోజకవర్గాల పరిధిలోని పోలింగ్ కేంద్రాల సందర్శన, అన్ని కేంద్రాల్లో నిర్దేశిత కనీస సౌకర్యాల కల్పనను నిర్ధారించుకోవాలి.
|
xix
|
ఓటర్ల సౌకర్యార్థం అన్ని పోలింగ్ కేంద్రాల వద్ద సహాయ శిబిరం ఏర్పాటుసహా దివ్యాంగులు, శారీరకంగా బలహీనులు, మహిళలు, వృద్ధులు, కుష్టువ్యాధి పీడిత ఓటర్లకు ప్రత్యేక సౌకర్యాలు కల్పించేలా చూడాలి.
|
xx
|
తమ వంతు కోసం వరుసలో వేచి ఉండే ఓటర్లకు తాగునీరు, షెడ్లు/షామియానాలు సహా పోలింగ్ సమయంలో కేంద్రాల వెలుపల సముచిత విరామ ఏర్పాట్లు చేయాలి.
|
xxi
|
ఆకస్మిక తనిఖీ బృందాలు, గణాంక నిఘా బృందాలు, వీడియో పర్యవేక్షణ బృందాలు, సరిహద్దు తనిఖీ కేంద్రాలు, రహదారి తనిఖీ తదితరాలు 24 గంటలూ నిర్వహిస్తూ నగదు, మద్యం, ఉచితాల పంపిణీతోపాటు మత్తుపదార్థాలు/మాదక ద్రవ్యాల తరలింపు నిరోధానికి తగిన జాగ్రత్తలు తీసుకోవాలి.
|
xxii
|
రాజకీయ ప్రకటనలు, చెల్లింపు వార్తల ముందస్తు నిర్ధారణ కోసం మీడియా ధ్రువీకరణ, పర్యవేక్షణ కమిటీలు సరైన రీతిలో పనిచేసేలా చూడాలి.
|
xxiii
|
బూటకపు వార్తలు/తప్పుడు సమాచారాన్ని సకాలంలో అరికట్టడంతోపాటు సానుకూల కథనాలు వెలువడేలా సమాచారాన్ని చురుగ్గా ప్రదానం చేసేలా చూడాలి
|