భారత ఎన్నికల సంఘం

21 రాష్ట్రాలు/యూటీలలో 102 పీ సి లు మరియు అరుణాచల్, సిక్కింలో 92 అసెంబ్లీ నియోజకవర్గాలు 19 ఏప్రిల్ 2024న పోలింగ్‌కు సిద్ధంగా ఉన్నాయి


19 ఏప్రిల్ 2024న సాఫీగా, స్వేచ్ఛగా మరియు నిష్పక్షపాతంగా పోలింగ్ జరిగేలా చూడడానికి 350 మంది పరిశీలకులను ఈ సి ఐ ఆదేశించింది

ముఖ్యంగా వేసవి వేడిని ఎదుర్కోవడానికి పోలింగ్ స్టేషన్‌లలో అన్ని సౌకర్యాల కోసం నిర్దేశిస్తుంది

Posted On: 12 APR 2024 5:50PM by PIB Hyderabad

21 రాష్ట్రాల్లోని 102 పార్లమెంటరీ నియోజకవర్గాలకు ఏప్రిల్ 19, 2024న పోలింగ్ జరగనుంది, ఇందుకోసం  127 మంది సాధారణ పరిశీలకులు, 67 మంది పోలీసు పరిశీలకులు మరియు 167 మంది వ్యయ పరిశీలకులు నియమించబడ్డారు. నామినేషన్ యొక్క చివరి తేదీ అంటే 26 మార్చి, 2024 కంటే ముందు అందరూ నియోజకవర్గాల్లో నివేదించారు. ప్రధాన ఎన్నికల కమిషనర్ రాజీవ్ కుమార్, మరియు ఎన్నికల కమిషనర్ఎస్. జ్ఞానేష్ కుమార్, ఎన్నికల కమిషనర్ సుఖ్‌బీర్ సింగ్ సంధు  పోలింగ్  స్టేషన్‌లలో ఓటర్లకు వేసవి వేడిని ఎదుర్కోవడానికి అన్ని సౌకర్యాలఉండేలా చూడాలని, ముఖ్యంగా మొదటి దశ ఓటింగ్‌కు దగ్గరలో ఉన్నందున ఎలాంటి బహుమతులు  పంచకుండా చూడాలని , బలగాలను సక్రమంగా వినియోగించుకోవాలని, శాంతిభద్రతలను పటిష్టంగా పర్యవేక్షించాలని  పరిశీలకులను కోరారు.

కేంద్ర పరిశీలకులు ఈ క్రింది విధంగా నిర్ధారించడానికి నిర్దేశించబడ్డారు:

అన్ని నియోజక వర్గాల్లో ముందస్తుగా పోలింగ్‌కు సంసిద్ధత మరియు వాటాదారులకు అంటే అభ్యర్థులు మరియు రాజకీయ పార్టీలకు  సమ స్థాయి పోటి నియమాలను నిర్ధారించడం
మొత్తం ఎన్నికల ప్రక్రియ వరకు  వారికి కేటాయించబడిన పార్లమెంటరీ నియోజకవర్గంలో వారు  భౌతికంగా అందుబాటులో ఉండేందుకు
వారి  మొబైల్/ల్యాండ్‌లైన్/ఇమెయిల్/ బస మరియు సర్క్యులేషన్ యొక్క సమాచారాన్ని విస్తృత ప్రచురణ, తద్వారా వారు సాధారణ ప్రజలకు/అభ్యర్థి మరియు రాజకీయ పార్టీలకు రోజువారీగా వారు  నిర్దేశించిన నంబర్‌లు/చిరునామాలలో అందుబాటులో ఉంటారు,
వారి సమక్షంలో బలగాల విస్తరణ
కేంద్ర బలగాలు/రాష్ట్ర పోలీసు బలగాలు మోహరింపు ఏ రాజకీయ పార్టీ/అభ్యర్థికి అనుకూలంగా కాకుండా తటస్థంగా
 ఉపయోగించబదేవిధంగా
 ఈ వీ ఎం లు/ వీ వీ పాట్లు  వారి సమక్షంలో పోలింగ్ సిబ్బందిని ర్యాండమైజేషన్ చేయడం
85+ వయస్సు వృద్దులు మరియు దివ్యాంగులకు  ఎన్నికల విధులు, అవసరమైన విధులు మరియు సేవా ఓటర్లకు పోస్టల్ బ్యాలెట్ ఇంటి ఓటింగ్  ప్రక్రియ సులభతరం  చేయడం
ఎలక్టోరల్ రోల్స్ రాజకీయ పార్టీలకు మరియు పోటీలో ఉన్న అభ్యర్థులకు సరఫరా చేయబడతాయి
వల్నరబిలిటీ మ్యాపింగ్‌ను జిల్లా యంత్రాంగం న్యాయంగా పూర్తి చేసి మరియు తదనుగుణంగా  రవాణా మరియు కమ్యూనికేషన్ ప్రణాళిక
మైక్రో అబ్జర్వర్‌ల విస్తరణ
అభ్యర్థులు / వారి ప్రతినిధులందరి ముందుఈ వీ ఎం లు/ వీ వీ పాట్లు ని కమీషన్ చేయడం
ఈ వీ ఎంస్ట్రాంగ్ రూమ్‌ల వద్ద పటిష్టమైన భద్రతా ఏర్పాట్లను పర్యవేక్షించండం  మరియు అభ్యర్థులందరి అధీకృత ఏజెంట్ల ఉనికిని నిర్ధారించడం
అన్ని ఫిర్యాదుల పరిష్కార విధానాలు అమలులో ఉండేలా నిర్ధారించడం
సకాలంలో దిద్దుబాటు చర్యలు తీసుకోవడానికి అధికారం ఉన్న అధికారి యొక్క మొత్తం బాధ్యతతో జిల్లాల్లో ఏకీకృత కంట్రోల్ రూమ్‌లు ఏర్పాటు చేయబడేవిధంగా నిర్ధారించడం .
100% ఓటరు సమాచార స్లిప్పుల పంపిణీ పోలింగ్ రోజుకు ముందే జరిగేలా నిర్ధారించడం
సి-విజిల్, ఓటర్ హెల్ప్‌లైన్ యాప్, సక్షం యాప్, ఎన్‌కోర్, సువిధ యాప్ వంటి అన్నిఐ టి  అప్లికేషన్‌లు,ఎన్నికల సిబ్బంది  ఉపయోగించడానికి వారికి సరైన శిక్షణ ఇవ్వబడేలా నిర్ధారించడం

కౌంటింగ్ సిబ్బంది, మైక్రో అబ్జర్వర్లు మొదలైన వారితో సహా పోలింగ్ సిబ్బంది అందరికీ శిక్షణ సక్రమంగా నిర్వహించబడింది/ఇవ్వ బడిందని నిర్ధారించడం
నియోజకవర్గంలోని పోలింగ్ కేంద్రాలను సందర్శించడం మరియు అన్ని పోలింగ్ స్టేషన్‌లలో హామీ ఇవ్వబడిన కనీస సౌకర్యాలు ఉండేలా చూసుకోవడం
ఓటర్ల సౌకర్యార్థం అన్ని పోలింగ్‌ కేంద్రాల వద్ద ఓటరు సహాయ బూత్‌ ఏర్పాటు, వికలాంగులు, శారీరక వికలాంగులు, మహిళలు, వృద్ధులు, కుష్టువ్యాధి పీడిత ఓటర్లకు ప్రత్యేక సౌకర్యాలు కల్పించడం.
క్యూలో వేచి ఉన్న ఓటర్లకు తాగునీరు, షెడ్లు/షామ్యానాలు మరియు పోలింగ్ సమయంలో పోలింగ్ స్టేషన్ల వెలుపల కూర్చోవడానికి  సరైన సిట్టింగ్ ఏర్పాట్లు
ఫ్లయింగ్ స్క్వాడ్‌లు, స్టాటిస్టిక్స్ నిఘా బృందాలు, వీడియో వీక్షణ బృందాలు, సరిహద్దు చెక్‌పోస్టులు, నాకాస్ మొదలైనవి తమ పనిని 24 గంటలూ నిర్వహిస్తూ నగదు, మద్యం, ఉచితబీడీలు, పొగాకు ఉత్పత్తులు డ్రగ్స్/మాదక ద్రవ్యాల తరలింపు, పంపిణీ జరగకుండా కృషి చేస్తున్నారని నిర్ధారించడం
రాజకీయ ప్రకటనలు మరియు చెల్లింపు వార్తల ముందస్తు ధృవీకరణ కోసం మీడియా సర్టిఫికేషన్ మరియు మానిటరింగ్ కమిటీల ద్వారా సరైన నిఘాను  నిర్ధారించడం
అబద్దపు  వార్తలు /తప్పుడు సమాచారాన్ని సకాలంలో అరికట్టడం మరియు సానుకూల సమాచారాన్ని వ్యాప్తి చేయడం వంటి వాటిని  నిర్ధారించడానికి కేంద్ర పరిశీలకులునిర్దేశించబడ్డారు. 

***



(Release ID: 2017922) Visitor Counter : 77