ప్రధాన మంత్రి కార్యాలయం

నార్వే యొక్క ప్రధాని ఆధికారిక పర్యటన సందర్భం లోప్రధాన మంత్రి పత్రికా ప్రకటన కు అనువాదం

Posted On: 09 JAN 2019 2:18PM by PIB Hyderabad

యార్ ఇక్సెలన్సి,

నార్వే యొక్క ప్రధాని ఎర్నా సోల్బర్గ్ గారు,

నార్వే నుండి భారతదేశాని కి విచ్చేసినటువంటి అందరు విశిష్ట అతిథులు,



మిత్రులారా,
క్రిందటి సంవత్సరం లో స్టాక్ హోమ్ లో ప్రధాని ఎర్నా సోల్బర్గ్ గారి తో నేను భేటీ అయిన సందర్భం లో ఆమె ను భారతదేశాని కి రావలసిందంటూ ఆహ్వానించాను. మరి ఈ రోజు న భారతదేశం లో ఆమె కు స్వాగతం పలికే అవకాశం నాకు దక్కినందుకు నేను సంతోషిస్తున్నాను.



నార్వే యొక్క ప్రధాని భారతదేశాని కి రావడం ఇదే మొట్టమొదటిసారి. రాయ్ సీనా డైలాగ్ యొక్క ప్రారంభిక సమావేశం లో ఆమె ప్రసంగించనుండడం వల్ల కూడా ఇది విశిష్టమైనటువంటిది గా ఉంది. దీనికి గాను ఆమె కు నేను హృదయ పూర్వకమైన కృతజ్ఞత ను వ్యక్తం చేస్తున్నాను.



మిత్రులారా,
జి-20 సమిట్ సందర్భం లో 2017 వ సంవత్సరం లో నార్వే ప్రధాని ఎర్నా సోల్బర్గ్ గారి తో నేను భేటీ అయినప్పుడు, ఆమె నాకు ఒక ఫుట్ బాల్ ను బహుమతి గా అందజేశారు. క్రిందటి సంవత్సరం లో గోల్డెన్ బాల్ పురస్కారాన్ని నార్వే కు చెందిన ఆదా హెగర్‌బర్గ్ కు ఇవ్వడమైంది; దీనికి గాను నేను నార్వే కు హార్థిక అభినందనల ను తెలియ జేస్తున్నాను.



అయితే, ప్రధాని నాకు కానుక గా ఇచ్చిన ఫుట్ బాల్ నిజాని కి చాలా భిన్నమైన సందర్భాన్ని కలిగివుంది. ఆ ఫుట్ బాల్ సాకర్ క్రీడ లో కొట్టే గోల్ ను సూచించదు, నిజానికి అది స్థిరమైనటువంటి అభివృద్ధి లక్ష్యాల (ఎస్ డిజి స్) కు ప్రతినిధిత్వాన్ని వహిస్తుంది.

 



స్థిరాభివృద్ధి లక్ష్యాల సాధన దిశ లో జరుగుతున్నటువంటి ప్రపంచ ప్రయాసల కు ప్రధాని ఎర్నా సోల్బర్గ్ గారు చాలా ప్రోత్సాహాన్ని ఇచ్చారు.

 



ఈ సందర్శన లో, ప్రధాని ఎర్నా సోల్బర్గ్ గారు భారతదేశం లో నార్వే కు చెందిన క్రొత్తదైన గ్రీన్ ఎంబసి ని కూడా ప్రారంభించారు. మరి, ఈ కారణం గా ఆమె యొక్క ప్రపంచ ప్రయాసల ను గురించి మనం మాట్లాడుకొన్నట్లయితే ఈ విషయం లో ఎంతగా ప్రశంసించినప్పటికీ ఆ ప్రశంస చిన్నదే అవుతుంది సుమా.



స్థిరాభివృద్ధి లక్ష్యాలు అనేవి భారతదేశం యొక్క అభివృద్ధి లక్ష్యాల తో పూర్తి గా తుల తూగుతూ ఉన్నాయి. ‘‘నార్వే-ఇండియా పార్ట్ నర్ శిప్ ఇనిశియేటివ్’’ ద్వారా తల్లి మరియు బిడ్డ ల ఆరోగ్యం అనే అంశం లో ఇరు దేశాలు ఫలప్రదమైనటువంటి సహకారాన్ని కొనసాగిస్తూ ఉండడం హర్షదాయకమైనటువంటి విషయం గా ఉంది.



మిత్రులారా,
భారతదేశాని కి మరియు నార్వే కు మధ్య సంబంధాల లో వ్యాపారాని కి, పెట్టుబడి కి ఎనలేని ప్రాముఖ్యం ఉంది. నార్వే కు చెందిన గవర్నమెంట్ పెన్శన్ ఫండ్ గ్లోబల్ అనేది భారతదేశం లో దాదాపు గా 12 బిలియన్ యుఎస్ డాలర్ మేరకు పోర్ట్‌ ఫోలియో ఇన్వెస్ట్ మెంట్ ను తీసుకు వచ్చింది. ప్రధాని ఎర్నా సోల్బర్గ్ గారి వెంట నార్వే కు చెందిన వంద కు పైగా కంపెనీ ల ప్రతినిధులు ఇక్కడ కు తరలి రావడం నాకు సంతోషాన్ని కలిగించింది.

నిన్నటి రోజు న జరిగిన ఇండియా-నార్వే బిజినెస్ సమిట్ లో భాగం గా వారు భారతదేశాని కి చెందిన వ్యాపార రంగ ప్రముఖుల తో ఒక ఉపయోగకరమైనటువంటి సంభాషణ లో పాలుపంచుకొన్నారు. రాబోయే సంవత్సరాల లో పోర్ట్‌ ఫోలియో ఇన్వెస్ట్‌ మెంట్, ఇంకా ఫారిన్ డైరెక్ట్ ఇన్వెస్ట్‌ మెంట్ లు రెండిటి లో భారతదేశం లో అందుబాటు లో ఉన్న విస్తృతమైన సామర్థ్యం తాలూకు లాభాన్ని నార్వే కు చెందిన కంపెనీ లు అందుకొంటాయన్న విశ్వాసం నాలో ఉంది. మరీ ముఖ్యం గా ‘సాగర్ మాల’ కార్యక్రమం లో భాగం గా నౌకా నిర్మాణం, నౌకాశ్రయాలు మరియు జరప తలపెట్టిన నౌకాశ్రయ ప్రధానమైనటువంటి అభివృద్ధిల లో నార్వే కు చెందిన కంపెనీల కు అనేక అవకాశాలు ఎదురు పడనున్నాయి.



మిత్రులారా,

ఓశన్ ఇకానమీ అనే అంశం దీనితో ముడిపడినటువంటిదే. భారతదేశం యొక్క అభివృద్ధి కి మరియు సమృద్ధి కి ఈ రంగం ఎంతో ముఖ్యమైంది అని చెప్పాలి. భారతదేశం జనాభా లో సుమారు గా 15 శాతం జనాభా కోస్తా తీరప్రాంత జిల్లాల లో ఉంటున్నారు. ఒక విధం గా చూస్తే, వారి జీవనాని కి ఓశన్ ఇకానమీ తో ప్రత్యక్ష సంబంధం ఉన్నది; మరి మనం ఇదే విషయాన్ని పరోక్షం గా గనుక గమనించిన పక్షం లో భారతదేశం లోని కోస్తాతీర ప్రాంత రాష్ట్రాల జనాభా 500 మిలియన్ కు పైచిలుకు గా తేలుతుంది. నార్వే యొక్క ఎగుమతుల లో 70 శాతం ఎగుమతులు నార్వే సముద్ర సంబంధి పరిశ్రమ నుండే నమోదు అవుతూ ఉన్న యదార్థాన్ని గమనించారా అంటే, మరి ఓశన్ ఇకానమీ విషయం లో నార్వే కు ఉన్న ప్రావీణ్యం ఎంతటిదో మీరు ఊహించ గలుగుతారు. ఈ కారణం గా ఈ యొక్క ముఖ్యమైనటువంటి రంగం లో ఈ రోజు న మనం మన సంబంధాల లో సహకారం తాలూకు ఒక క్రొత్త పార్శ్వాన్ని జత పరచుకొన్నందుకు నేను సంతోషిస్తున్నాను. మన మధ్య చోటుచేసుకొనేటటువంటి ద్వైపాక్షిక ఓశన్ డైలాగ్ ఈ అంశాని కి చెందినటువంటి అన్ని రంగాల లో మన సహకారాని కి దిశ ను నిర్దేశించనున్నది.


మిత్రులారా,

అంతర్జాతీయ వేదికల లో కూడా భారతదేశం మరియు నార్వే ల పరస్పర సహకారం చాలా బలం గా ఉంది. ఐరాస భద్రత మండలి సంబంధి సంస్కరణ లు, మల్టి- లేటరల్ ఎక్స్ పోర్ట్ కంట్రోల్ రెజీమ్స్, ఇంకా ఉగ్రవాదం వంటి అనేక అంశాల లో మనం చాలా సన్నిహితమైనటువంటి సహకారాన్ని, సమన్వయాన్ని ఏర్పరచుకొని కృషి చేస్తున్నాం. ఈ రోజు న మనం మన సహకారాని కి సంబంధించిన అన్ని రంగాల ను సమీక్షించి, మరి వాటి కి క్రొత్త శక్తి ని, దిశ ను ఇచ్చే విషయాలపైన కూడా విస్తృతం గా చర్చించాం.



ఇక్సెలన్సి,


భారతదేశాని కి రావాలన్న నా యొక్క ఆహ్వానాన్ని మీరు స్వీకరించినందుకు నేను మరోసారి మీకు హృదయ పూర్వకమైన కృతజ్ఞత ను తెలియ జేస్తున్నాను. ఈ రోజు న సాయంత్రం పూట జరిగే రాయ్ సీనా డైలాగ్ లో మీ యొక్క ప్రసంగాన్ని వినడం కోసం మేం అందరం చాలా ఉత్సాహంతో ఉన్నాం. మీ భారతదేశ యాత్ర చాలా సుఖప్రదమైంది గాను, ఫలప్రదం అయింది గాను ఉండగలదని నేను ఆశపడుతున్నాను.

మీకు ఇవే ధన్యవాదాలు.

 

***


(Release ID: 2017396) Visitor Counter : 37