ప్రధాన మంత్రి కార్యాలయం
azadi ka amrit mahotsav

ఆర్‌బిఐ@90 ప్రారంభిక కార్యక్రమాన్ని ఉద్దేశించి ప్రసంగించిన ప్రధాన మంత్రి


ఆర్‌బిఐ కి 90 సంవత్సరాలు అయినందుకు గుర్తు గా తీసుకు వచ్చిన స్మారక నాణేన్ని ఆయన ఆవిష్కరించారు

‘‘మన దేశ వృద్ధి గతి ని వేగిర పరచడం లో ఆర్‌బిఐ ఒక కీలకమైన పాత్ర ను పోషిస్తున్నది’’

‘‘స్వాతంత్య్రాని కి ముందు కాలాన్ని మరియుస్వాతంత్య్రం వచ్చిన తరువాత కాలాన్ని ఆర్‌బిఐ చూసింది; తన వృత్తి నైపుణ్యం మరియు నిబద్ధతల పై ఆధారపడిప్రపంచవ్యాప్తం గా ఒక గుర్తింపు ను ఏర్పరచింది’’

‘‘ప్రస్తుతం మనం ఎటువంటి స్థానాని కి చేరాము అంటేఈ స్థితి లో భారతీయ బ్యాంకింగ్వ్యవస్థ ను ప్రపంచం లో ఒక బలమైన మరియు స్థిరమైన బ్యాంకింగ్ వ్యవస్థ గా చూడడంజరుగుతోంది’’

‘‘గుర్తింపు, సంకల్పం మరియు మూలధన వనరుల నుతిరిగి సమకూర్చే ఒక వ్యూహాన్ని ప్రభుత్వం ఆచరణలో పెట్టింది’’

‘‘ధరల క్రియాశీల పర్యవేక్షణ మరియు విత్త సంబంధిస్థిరీకరణ అనేటటువంటి చర్యలు కరోనా వంటి కష్టకాలాల్లో సైతం ద్రవ్యోల్బణాన్ని ఒకమోస్తరు స్థాయి లో నిలిపాయి’

‘‘ప్రపంచ జిడిపి వృద్ధి లో 15 శాతం వాటా తో ప్రస్తుతం ప్రపంచ వృద్ధి కి చోదక శక్తి గా భారతదేశం మారుతోంది’’

‘‘వికసిత్ భారత్ తాలూకు బ్యాంకింగ్ దృష్టి కోణం సమగ్రం గా అమలవ్వాలి అంటే గనక అందుకు ఆర్‌బిఐ యే ఒక సరి అయినటువంటి సంస్థ అని చెప్పాలి’’

Posted On: 01 APR 2024 12:49PM by PIB Hyderabad

భారతీయ రిజర్వు బ్యాంకు (ఆర్‌బిఐ) ఏర్పడి 90 సంవత్సరాలు అయినందుకు గుర్తు గా ఏర్పాటు చేసిన ఆర్‌బిఐ@90 ప్రారంభ కార్యక్రమం మహారాష్ట్ర లోని ముంబయి లో ఈ రోజు న జరగగా ఆ కార్యక్రమాన్ని ఉద్దేశించి ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ ప్రసంగించారు. ఆర్‌బిఐ కి 90 సంవత్సరాలు అయిన ఘట్టాని కి గుర్తు గా తీసుకు వచ్చిన ఒక స్మారక నాణేన్ని కూడా శ్రీ నరేంద్ర మోదీ ఆవిష్కరించారు. ఆర్‌బిఐ 1935 వ సంవత్సరం ఏప్రిల్ 1 వ తేదీ న తన కార్యకలాపాల ను మొదలుపెట్టింది. ఈ రోజు న ఆర్ బిఐ 90 వ సంవత్సరం లోకి అడుగు పెట్టింది.

ఈ సందర్భం లో ప్రధాన మంత్రి ప్రసంగిస్తూ, భారతీయ రిజర్వు బ్యాంకు ఉనికి లోకి వచ్చిన తరువాత 90 సంవత్సరాల కాలాన్ని పూర్తి చేసుకొని, ఈ రోజు న ఒక చరిత్రాత్మకమైన మైలురాయి ని చేరుకొందన్నారు. ఆర్‌బిఐ స్వాతంత్య్రాని కి పూర్వపు కాలాన్ని మరియు స్వాతంత్య్రం వచ్చిన తరువాతి కాలాన్ని కూడా చూసింది; మరి అది తన వృత్తి నైపుణ్యాన్ని, ఇంకా నిబద్ధత ను ఆధారం చేసుకొని ప్రపంచ దేశాల లో ఒక గుర్తింపు ను తెచ్చునకొంది అని ఆయన స్పష్టం చేశారు. ఆర్‌బిఐ కి 90 సంవత్సరాలు పూర్తి అయిన సందర్భం లో ఆ సంస్థ సిబ్బంది అందరికి అభినందనల ను ప్రధాన మంత్రి తెలియ జేశారు. ఆర్‌బిఐ లో ప్రస్తుతం ఉన్న సిబ్బంది అదృష్టవంతులు అని ప్రధాన మంత్రి తలపోశారు. దీనికి కారణం ఏమిటి అంటే ప్రస్తుతం రూపొందించే విధానాలు ఆర్‌బిఐ యొక్క రాబోయే దశాబ్దాని కి రూపు ను రేఖల ను ఏర్పరుస్తాయి అని ఆయన అన్నారు. అంతేకాకుండా, భావి పది సంవత్సరాలు ఆర్‌బిఐ ని దాని యొక్క వందో సంవత్సరం లోకి తీసుకు పోతాయి అని ఆయన అన్నారు. ‘‘వికసిత్ భారత్ యొక్క సంకల్పాల పరం గా చూసినప్పుడు భవిష్యత్తు లోని పది సంవత్సరాల కాలం అత్యంత ముఖ్యమైంది’’ అని ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ అన్నారు. శరవేగం గా సాధించవలసిన వృద్ధి, విశ్వాసం మరియు స్థిరత్వం లపై శ్రద్ధ వహించడం అనేవి ఆర్‌బిఐ కి ప్రాథమ్యాలు గా ఉండాలి’’ అని ఆయన నొక్కి చెప్పారు. ఆర్‌బిఐ యొక్క లక్ష్యాలు మరియు సంకల్పాలు నెరవేరాలి అంటూ ప్రధాన మంత్రి తన శుభాకాంక్షల ను కూడా తెలియ జేశారు.

దేశం యొక్క ఆర్థిక వ్యవస్థ లో స్థూల దేశీయోత్పత్తి జిడిపి లో ద్రవ్యపరమైన విధానాలు మరియు ఖజానా పరమైన విధానాల మధ్య సమన్వయం ముఖ్యం అని ప్రధాన మంత్రి అన్నారు. 2014 వ సంవత్సరం లో ఆర్‌బిఐ 80 సంవత్సరాల కాలాన్ని ఒక ఉత్సవం వలె జరుపుకొన్న సంగతి ని ఆయన గుర్తు కు తీసుకు వస్తూ, ఆ కాలం లో దేశ బ్యాంకింగ్ వ్యవస్థ వసూలు కాని రుణాలు (ఎన్‌పిఎ స్) మరియు స్థిరత్వం పరమైనటువంటి సమస్యల ను, సవాళ్ళ ను ఎదుర్కొన్నట్లు చెప్పారు. అక్కడి నుండి ప్రస్తుతం మనం ఏ స్థాయి కి చేరుకొన్నాము అంటే ఇవాళ భారతీయ బ్యాంకింగ్ వ్యవస్థ ను ప్రపంచం లో ఒక బలమైన మరియు స్థిరమైన బ్యాంకింగ్ వ్యవస్థ గా చూడడం జరుగుతోంది; మరి ఇది వరకు గాడి తప్పినటువంటి బ్యాంకింగ్ వ్యవస్థ ఇప్పుడు లాభాల లోకి వచ్చి, మునుపు ఎరుగనంత రుణ మంజూరుల ను నమోదు చేస్తోంది అని ఆయన అన్నారు.

ఈ యొక్క పరివర్తన కు ఖ్యాతి అంతాను విధానం లో, ఉద్దేశ్యాల లో మరియు నిర్ణయాల లో స్పష్టత దే అని ప్రధాన మంత్రి అన్నారు. ‘‘ఉద్దేశ్యాలు సరి అయినవి గా ఉంటే, ఫలితాలు కూడా సరి అయినవి గా ఉంటాయి’’ అని ప్రధాన మంత్రి అన్నారు. సంస్కరణ ల యొక్క సమగ్ర స్వభావాన్ని గురించి ప్రధాన మంత్రి మాట్లాడుతూ, ప్రభుత్వం గుర్తింపు, సంకల్పం, ఇంకా మూలధన వనరుల ను తిరిగి సర్దుబాటు చేయడం వంటి వ్యూహం తో పాటుపడింది అని తెలియ జేశారు. ప్రభుత్వాని కి సంబంధించిన అనేక సంస్కరణల తో పాటు పబ్లిక్ సెక్టర్ బ్యాంకుల కు సాయపడడం కోసమని 3.5 లక్షల కోట్ల రూపాయల వరకు మూలధనాన్ని అందించడమైంది అని ఆయన అన్నారు. ఒక్క ఇన్‌సాల్వన్సి ఎండ్ బ్యాంక్ రప్టసి కోడ్ యే 3.25 లక్షల రూపాయల వరకు ఉండే రుణాల ను పరిష్కరించింది అని ప్రధాన మంత్రి తెలిపారు. 9 లక్షల కోట్ల రూపాయల కు పైచిలుకు ఎగవేతల తో కూడిన 27,000 కు పైచిలుకు దరఖాస్తుల ను ఐబిసి పరిధి లో చేర్చడాని కంటే ముందుగానే పరిష్కరించడమైంది అని కూడా ఆయన వెల్లడించారు. 2018 వ సంవత్సరం లో 11.25 శాతం స్థాయి లో నిలచిన బ్యాంకుల యొక్క స్థూల నిరర్థక ఆస్తులు (ఎన్ పిఎ స్) 2023 వ సంవత్సరం సెప్టెంబరు కు వచ్చే సరికల్లా 3 శాతం కంటే తక్కువ స్థాయి కి పరిమితం అయ్యాయి అని ఆయన వివరించారు. గతం లో జంట బ్యాలెన్స్ శీట్ స్ సమస్య తలెత్తింది అని ఆయన అన్నారు. ఈ మార్పునకు దోహదం చేసినందుకు ఆర్‌బిఐ కి అభినందనల ను ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ తెలియ జేశారు.

ఆర్‌బిఐ కి సంబంధించిన చర్చలు అనేవి ద్రవ్యపరమైన నిర్వచనాలు మరియు సంక్లిష్టమైన పదజాలాల కే చాలా వరకు పరిమితం అవుతూ వచ్చినప్పటికీ కూడా ఆర్‌బిఐ భుజస్కందాల పై ఉన్న కార్యభారం నేరు గా సామాన్య పౌరుల జీవనం పైన ప్రభావాన్ని ప్రసరింప జేస్తుంది అని ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ అన్నారు. గడచిన 10 సంవత్సరాల లో కేంద్రీయ బ్యాంకు లు, బ్యాంకింగ్ వ్యవస్థ లు మరియు వరుస లోని చిట్టచివరి లబ్ధిదారు కు మధ్య ఉన్న బంధాన్ని గురించి ప్రభుత్వం ప్రముఖం గా ప్రకటించింది అని ప్రధాన మంత్రి చెప్తూ, ఆర్థిక సేవల రంగం పరిధి లోకి పేద ప్రజానీకాన్ని తీసుకు రావడాన్ని ఒక ఉదాహరణ గా పేరర్కొన్నారు. దేశం లో 52 కోట్ల జన్ ధన్ ఖాతాల లో 55 శాతం ఖాతా లు మహిళల ఖాతాలు అని ఆయన అన్నారు. వ్యవసాయం లో, మత్స్య పరిశ్రమ రంగం లో ఆర్థిక సేవల ను భాగం చేయడం తాలూకు ప్రభావాన్ని గురించి కూడా ఆయన ప్రస్తావిస్తూ, రైతులు, మత్స్యకారులు మరియు పశుగణం యజమానులు కలుపుకొని 7 కోట్ల మంది పిఎమ్ కిసాన్ క్రెడిట్ కార్డుల ను పొందారు, తత్ఫలితం గా గ్రామీణ ఆర్థిక వ్యవస్థ కు ముఖ్యమైన ఊతం అందింది అని ఆయన వివరించారు. గడచిన పది సంవత్సరాల లో సహకార రంగాని కి అందించిన ఉత్తేజాన్ని గురించి ప్రధాన మంత్రి మాట్లాడుతూ, సహకార బ్యాంకుల విషయం లో భారతీయ రిజర్వు బ్యాంకు యొక్క నియమ నిబంధనల కు ఉన్న ప్రాముఖ్యాన్ని గురించి తెలియ జేశారు. యుపిఐ ద్వారా నెల నెలా 1200 కోట్ల కు పైచిలుకు లావాదేవీ లు చోటు చేసుకొని, ఆ వ్యవస్థ ను ప్రపంచవ్యాప్తం గా గుర్తింపున కు నోచుకొన్న ఒక వేదిక గా మలచాయి అని కూడా ఆయన అన్నారు. సెంట్రల్ బ్యాంక్ డిజిటల్ కరెన్సీ పరం గా ప్రస్తుతం జరుగుతున్న కృషి ని గురించి కూడా ప్రధాన మంత్రి చెప్తూ, గడచిన పది సంవత్సరాల లో చోటు చేసుకొన్న మార్పులు ఒక క్రొత్త బ్యాంకింగ్ వ్యవస్థ, ఆర్థిక వ్యవస్థ మరియు కరెన్సీ సంబంధి అనుభూతు ల ఏర్పాటు కు బాట ను పరచాయి అన్నారు.

వచ్చే పది సంవత్సరాల కు గాను పెట్టుకొనే లక్ష్యాల లో స్పష్టత కు ప్రాముఖ్యాన్ని ఇవ్వాలని ప్రధాన మంత్రి నొక్కిపలికారు. డిజిటల్ ట్రాన్సాక్శన్స్ ను ప్రోత్సహిస్తూనే, నగదు కు తావు ఉండనటువంటి ఆర్థిక వ్యవస్థ వల్ల ఉత్పన్నమైన మార్పుల పైన దృష్టి ని సారించడం ముఖ్యం అని ఆయన చెప్పారు. సమాజం లో అన్ని వర్గాల వారి కి ఆర్థిక సేవల అందజేత పరిధి ని విస్తరింప చేయవలసిన మరియు సశక్తీకరణ ప్రక్రియల ను చేపట్టవలసిన అవసరం ఎంతైనా ఉంది అని ఆయన స్పష్టం చేశారు.

భారతదేశం వంటి ఒక పెద్ద దేశం లో బ్యాంకింగ్ అవసరాలు ఎంత వైవిధ్యభరితం గా ఉండాలో ప్రధాన మంత్రి చెప్తూ, బ్యాంకింగ్ ప్రక్రియ లో సౌలభ్యాన్ని మెరుగు పరచవలసిన అవసరం ఉంది; అలాగే పౌరుల కు వారి వారి అవసరాల కు తగినట్లు గా సులభతరం అయినటువంటి సేవల ను అందించవలసి ఉంది అని నొక్కి చెప్పారు. ఆర్టిఫిశల్ ఇంటెలిజెన్స్ (ఎఐ) మరియు మశీన్ లర్నింగ్ ల పాత్ర ను గురించి ఆయన ఈ సందర్భం లో వివరించారు.

దేశం వేగవంతమైనటువంటి వృద్ధి ని మరియు స్థిరమైనటువంటి వృద్ధి ని సాధించడం లో ఆర్‌బిఐ యొక్క పాత్ర ఏమిటో ప్రధాన మంత్రి ప్రముఖం గా వివరించారు. నియమాల పై ఆధారపడినటువంటి క్రమశిక్షణ ను అలవరచడం, వ్యయం సంబంధి యుక్తాయుక్త విచక్షణ సహిత విధానాల ను రూపొందించడం అనే అంశాల లో ఆర్‌బిఐ కార్యసాధన ను గురించి ప్రధాన మంత్రి చెప్తూ, ఏదైనా ఒక పరిణామం జరిగే లోపే ఆ విషయాన్ని గురించి ఆలోచించి తగిన జాగ్రత చర్యల ను వివిధ రంగాల వారీ గా ముందస్తు అంచనాల ను రూపొందించుకోవాలి అని సూచించారు. దీనిలో బ్యాంకుల కు ప్రభుత్వం తరఫు నుండి సమర్థన లభిస్తుంది అంటూ బరోసా ను ఇచ్చారు. ద్రవ్యోల్బణం నియంత్రణ చర్యల ను గురించి కూడా ప్రధాన మంత్రి ప్రస్తావించారు. ద్రవ్యోల్బణాన్ని ఒక నిర్దిష్ట స్థాయి లో ఉంచే హక్కు ను ఆర్‌బిఐ కి ఇవ్వడాన్ని గురించి ఆయన మాట్లాడుతూ, ఈ విషయం లో మానిటరీ పాలిసీ కమిటీ యొక్క పనితీరు ను ప్రశంసించారు. ధర ల పర్యవేక్షణ లో క్రియాశీలత్వం మరియు కోశ సంబంధి సమన్వయం ల వంటి చర్య లు కరోనా తాలూకు కఠిన కాలాల్లో సైతం ద్రవ్యోల్బణాన్ని ఒక మోస్తరు స్థాయి లోనే ఉంచాయి అని ఆయన అన్నారు.

‘‘ఏదైనా ఒక దేశం యొక్క ప్రాథమ్యాలు స్పష్టం గా ఉన్న పక్షం లో ఆ దేశం పురోగమించడాన్ని ఎవ్వరూ అడ్డుకో జాలరు’’ అని ప్రధాన మంత్రి స్పష్టం చేశారు. ప్రభుత్వ వ్యయం సంబంధి యుక్తాయుక్త విచక్షణ ను ప్రభుత్వం పట్టించుకొంటోంది; మరి అలాగే, కోవిడ్ మహమ్మారి విజృంభించిన కాలం లో సామాన్య పౌరుల జీవనాని కి పెద్దపీట ను వేసింది; తత్ఫలితం గా పేదలు మరియు మధ్య తరగతి వర్గాల వారు ప్రతికూల పరిస్థితుల నుండి బయటపడి, ప్రస్తుతం దేశ వృద్ధి కి వేగ గతి ని జోడిస్తున్నారు అని ప్రధాన మంత్రి ఉదాహరణ పూర్వకం గా వివరించారు. ‘‘మహమ్మారి వల్ల ఎదురైన ఆర్థిక ఆఘాతం నుండి కోలుకోవడాని కి ప్రపంచం లో అనేక దేశాలు ఇప్పటికీ ఇంకా వాటి యొక్క ప్రయత్నాల ను కొనసాగిస్తూనే ఉన్న కాలం లో, భారతదేశ ఆర్థిక వ్యవస్థ క్రొత్త రికార్డుల ను సృష్టిస్తోంది’’ అని ప్రధాన మంత్రి అన్నారు. భారతదేశం యొక్క సాఫల్యాల ను ప్రపంచ స్థాయి కి తీసుకు పోవడం లో ఆర్‌బిఐ యొక్క పాత్ర ను ఆయన నొక్కి చెప్పారు. అభివృద్ధి చెందుతున్నటువంటి ఏ దేశం లో అయినా సరే ద్రవ్యోల్బణం నియంత్రణ కు మరియు వృద్ధి కి మధ్య ఒక సమతుల్య స్థితి ని ఏర్పరచడాని కి ఎంతో ప్రాముఖ్యం ఉంటుంది అనే విషయాన్ని ప్రధాన మంత్రి చెప్తూ, ఈ అంశం లో ఆర్‌బిఐ ఒక ఆదర్శవంతమైన పాత్ర ను పోషించగలుగుతుందన్న విశ్వాసాన్ని వ్యక్తం చేశారు. ఆర్‌బిఐ ఈ పని ని చేయడం ద్వారా వికాసశీల (గ్లోబల్ సౌథ్) దేశాలు అన్నింటికీ అండగా నిలబడగలదని ఆయన ఆశించారు.

ప్రపంచం లో ప్రస్తుతం యువజనులు అత్యంత అధిక స్థాయి లో ఉన్న దేశం గా భారతదేశం ఉంది అని ప్రధాన మంత్రి చెప్తూ, యువత యొక్క ఆకాంక్షల ను నెరవేర్చడం లో ఒక కీలకమైన పాత్ర ను ఆర్‌బిఐ పోషించవలసి ఉంది అని పేర్కొన్నారు. దేశం లో క్రొత్త క్రొత్త రంగాల ను తెర ముందుకు తీసుకు రావడం లో ఖ్యాతి ప్రభుత్వం అనుసరిస్తున్న విధానాల దే అని ఆయన పేర్కొంటూ, ఈ పరిణామం ప్రస్తుతం యువతీ యువకుల కు లెక్కలేనన్ని అవకాశాల ను అందిస్తోంది అని చెప్పారు. గ్రీన్ ఎనర్జీ సెక్టర్ ల విస్తరణ ను ఒక ఉదాహరణ గా ఆయన పేర్కొన్నారు. ఇదే సందర్భం లో సౌర శక్తి ని గురించి, గ్రీన్ హైడ్రోజన్ ను గురించి మరియు ఇథెనాల్ మిశ్రణం ను గురించి కూడా ఆయన చెప్పారు. దేశీయం గా 5జి సాంకేతికత ను ఆవిష్కరించడం, రక్షణ రంగం లో ఎగుమతుల ను పెంచడం గురించి కూడా ఆయన మాట్లాడారు. భారతదేశం లో తయారీ రంగాని కి వెన్నెముక గా స్థూల, సూక్ష్మ మధ్యతరహా వాణిజ్య వ్యవస్థ (ఎమ్ఎస్ఎమ్ఇ స్) మారాయి అనే సంగతి ని ప్రధాన మంత్రి చెప్తూ, ఎమ్ఎస్ఎమ్ఇ స్ కు కోవిడ్ మహమ్మారి కాలం లో పరపతి హామీ పథకాన్ని అమలు పరచడం ద్వారా సమర్థన ను ఇవ్వడమైంది అని వెల్లడించారు. క్రొత్త రంగాల తో అనుబంధం కలిగి ఉన్న యువత కు పరపతి లభ్యత కు పూచీ పడడం కోసం ఆర్‌బిఐ సంప్రదాయేతర విధానాల కు నడుం బిగించింది అని ఆయన స్పష్టం చేశారు.

ఇరవై ఒకటో శతాబ్దం లో నూతన ఆవిష్కరణల కు ఎంత ప్రాముఖ్యం ఉన్నదీ అనే విషయాన్ని ప్రధాన మంత్రి చెప్తూ, అత్యాధునికమైన సాంకేతికత లను గురించి బృందాల తో ఆలోచనల ను చేసేందుకు మరియు ఆ కోవ కు చెందిన కార్యభారాన్ని వహించగల సిబ్బంది ని గుర్తించేందుకు సన్నద్ధులు కావలసింది గా ప్రధాన మంత్రి కోరారు. అంతరిక్షం మరియు పర్యటన ల వంటి నవీన మరియు సాంప్రదాయిక రంగాల యొక్క అవసరాల ను దృష్టి లో పెట్టుకొని, వాటిని తీర్చేందుకు ముందుకు రావాలంటూ బ్యాంకర్ లకు మరియు నియంత్రణ సంస్థల కు ప్రధాన మంత్రి విజ్ఞప్తి చేశారు. రాబోయే సంవత్సరాల లో అయోధ్య ప్రపంచం లో అతి పెద్ద ధార్మిక పర్యటన కేంద్రం గా మారుతుంది అంటూ నిపుణులు వెలిబుచ్చినటువంటి అభిప్రాయాన్ని ప్రధాన మంత్రి ఈ సందర్భం లో ప్రస్తావించారు.

ఆర్థిక సేవల ను సమాజం లో అన్నివర్గాల వారి కి అందేటట్లుగా చూడటం కోసం మరియు డిజిటల్ పేమెంట్స్ కోసం ప్రభుత్వం పడిన శ్రమ కు ప్రధాన మంత్రి ఖ్యాతి ని కట్టబెడుతూ, ఇది చిన్న వ్యాపార సంస్థల తో పాటు వీధి వీధికి తోపుడు బండ్ల లో తిరుగుతూ వస్తువుల ను విక్రయించేటటువంటి వారి యొక్క ఆర్థిక పరమైన సామర్థ్యం లో పారదర్శకత్వాని కి తావు ను ఇచ్చింది అన్నారు. ‘‘ఈ యొక్క సమాచారాన్ని తప్పక వినియోగించుకొంటూ, ఈ వర్గాల కు ఆర్థిక సాధికారిత ను కల్పించాలి’’ అని ప్రధాన మంత్రి నొక్కి చెప్పారు.

రాబోయే పది సంవత్సరాల లో భారతదేశం యొక్క ఆర్థిక ఆత్మనిర్భరత ను అధికం చేయవలసిన అవసరం ఎంతైనా ఉంది అని ప్రధాన మంత్రి అన్నారు. అదే జరిగితే ప్రపంచ అంశాల ప్రభావం తగ్గ గలదన్నారు. ‘‘ప్రస్తుతం భారతదేశం ప్రపంచ వ్యాప్త జిడిపి వృద్ధి లో 15 శాతం వాటా తో ప్రపంచ వృద్ధి కి చోదక శక్తి గా మారుతోంది’’ అని శ్రీ నరేంద్ర మోదీ వ్యాఖ్యానించారు. ప్రపంచం అంతటా రూపాయి కి మరింత లభ్యత ను, ఆమోద యోగ్యత ను సంతరించే దిశ లో ప్రయాస లు సాగుతూ ఉన్నాయి అని ఆయన స్పష్టం చేశారు. ఆర్థిక రంగం లో మితిమీరిన విస్తరణ ధోరణులు హెచ్చడాన్ని గురించి, రుణం అధికం అవుతూ ఉండడాన్ని గురించి కూడా ఆయన ప్రస్తావించారు. అనేక దేశాల లో ప్రైవేటు రంగం యొక్క రుణాలు ఆ యా దేశాల జిడిపి కంటే రెట్టింపు స్థాయి లో ఉన్నాయి అని ప్రధాన మంత్రి అన్నారు. చాలా దేశాల రుణం స్థాయిలు సైతం ప్రపంచం పై ఒక వ్యతిరేక ప్రభావాన్ని కలుగ జేస్తున్నాయి అని ఆయన అన్నారు. భారతదేశం యొక్క వృద్ధి సామర్థ్యాన్ని మరియు అవకాశాల ను దృష్టి లో పెట్టుకొని ఆర్‌బిఐ ఒక అధ్యయనాన్ని నిర్వహించాలి అని ప్రధాన మంత్రి సూచన ను చేశారు.

దేశం లో ప్రాజెక్టుల కు అవసరమైన నిధుల ను సమకూర్చడం కోసం ఒక బలమైనటువంటి బ్యాంకింగ్ పరిశ్రమ ఎంతైనా ముఖ్యం అని ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ అన్నారు. ఆర్టిఫిశల్ ఇంటెలిజెన్స్ (ఎఐ) మరియు బ్లాక్ చైన్ ల వంటి సాంకేతికత లు తీసుకు వచ్చిన మార్పుల ను గురించి ఆయన ప్రస్తావించి, అంతకంతకు వృద్ధి చెందుతున్నటువంటి డిజిటల్ బ్యాంకింగ్ సిస్టమ్ లో సైబర్ సెక్యూరిటీ కి ప్రాముఖ్యం పెరుగుతూ పోతోంది అన్నారు. సరిక్రొత్త ఆర్థిక సహాయ నమూనాలు, ఆర్థిక కార్యకలాపాల నిర్వహణ నమూనా లు మరియు వ్యాపార నమూనాలు అవసరపడే సందర్భాల లో ఫిన్-టెక్ ఇనొవేశన్ ను గమనిస్తూ, బ్యాంకింగ్ వ్యవస్థ యొక్క స్వరూపం లో చేయవలసిన మార్పుల ను గురించి ఆలోచించండి అంటూ శ్రోతల కు ప్రధాన మంత్రి విజ్ఞప్తి చేశారు. ‘‘ప్రపంచం లో విజేతలు గా ఉన్న సంస్థ ల మొదలు, వీధుల లో తిరుగుతూ సరకుల ను అమ్మే వ్యాపారుల వరకు చూసుకొంటే వారి యొక్క పరపతి అవసరాల ను నెరవేర్చడం, మరి అలాగే అత్యాధునిక రంగాలు మొదలుకొని సాంప్రదాయిక రంగాల పరపతి అవసరాల ను నెరవేర్చడం వికసిత్ భారత్ ఆవిష్కారం లో కీలకం అని, మరి వికసిత్ భారత్ కు సంబంధించినంత వరకు బ్యాంకింగ్ దార్శనికత సాకారం కావడం లో ఆర్‌బిఐ యే సముచితమైనటువంటి సంస్థ అని చెప్తూ ప్రధాన మంత్రి తన ప్రసంగాన్ని ముగించారు.

ఈ కార్యక్రమం లో మహారాష్ట్ర యొక్క గవర్నర్ శ్రీ రమేశ్ బైస్, మహారాష్ట్ర యొక్క ముఖ్యమంత్రి శ్రీ ఏక్ నాథ్ శిందే, ఉప ముఖ్యమంత్రులు శ్రీ దేవేంద్ర ఫడ్‌ణవీస్ మరియు శ్రీ అజిత్ పవార్, కేంద్ర ఆర్థిక మంత్రి శ్రీమతి నిర్మల సీతారమణ్, ఆర్థిక శాఖ సహాయ మంత్రులు శ్రీ భాగవత్ కిశన్‌రావ్ కరాడ్ మరియు శ్రీ పంకజ్ చౌధరీ లతో పాటు ఆర్‌బిఐ గవర్నర్ శ్రీ శక్తికాంత్ దాస్ కూడా పాలుపంచుకొన్నారు.

The @RBI plays pivotal role in advancing our nation's growth trajectory. Speaking at its 90th year celebrations in Mumbai.https://t.co/95JoqaDy0U

— Narendra Modi (@narendramodi) April 1, 2024

***


(Release ID: 2016930) Visitor Counter : 363