సమాచార, ప్రసార మంత్రిత్వ శాఖ
పత్రికా సమాచార కార్యాలయం ప్రిన్సిపల్ డైరెక్టర్ జనరల్‌గా బాధ్యతలు చేపట్టిన శ్రీమతి షెఫాలీ శరణ్
प्रविष्टि तिथि:
01 APR 2024 11:20AM by PIB Hyderabad
పత్రికా సమాచార కార్యాలయం ప్రిన్సిపల్ డైరెక్టర్ జనరల్‌గా ఈరోజు శ్రీమతి షెఫాలీ బి శరణ్ బాధ్యతలు చేపట్టారు. శ్రీ మనీష్ దేశాయ్ పదవీ విరమణ చేయడంతో ఆయన స్థానంలో శ్రీమతి షెఫాలీ శరణ్ ప్రెస్ పత్రికా సమాచార కార్యాలయం ప్రిన్సిపల్ డైరెక్టర్ జనరల్‌గా బాధ్యతలు స్వీకరించారు. శ్రీమతి శరణ్ ఇండియన్ ఇన్ఫర్మేషన్ సర్వీస్ 1990 బ్యాచ్ కి చెందిన అధికారిణి.
మూడు దశాబ్దాలకు పైగా సాగిన అద్భుతమైన కెరీర్‌లో శ్రీమతి షెఫాలీ శరణ్ పత్రికా సమాచార కార్యాలయ అధికారిణిగా ఆర్థిక, ఆరోగ్యం, కుటుంబ సంక్షేమం, సమాచార మరియు ప్రసార మంత్రిత్వ శాఖలకు సేవలు అందించారు. ఆయా శాఖల మీడియా ప్రచార కార్యక్రమాలను నిర్వహించారు. భారత ఎన్నికల సంఘం అధికార ప్రతినిధిగా కూడా శ్రీమతి షెఫాలీ శరణ్ పనిచేశారు.
ఆరోగ్య మంత్రిత్వ శాఖ డైరెక్టర్ (సాంప్రదాయ ఔషధాల విభాగం/ఆయుష్ (2002-2007)), ఆర్థిక మంత్రిత్వ శాఖలో డైరెక్టర్ (ఆర్థిక వ్యవహారాల విభాగం 2013-2017)గా శ్రీమతి షెఫాలీ శరణ్ పనిచేశారు. సమాచార, ప్రసార మంత్రిత్వ శాఖ (ఇన్ఫర్మేషన్ పాలసీ, 2000-2002)లో ఆఫీసర్ ఆన్ స్పెషల్ డ్యూటీ (OSD)గా 2007 నుంచి 2008 వరకు లోక్‌సభ సెక్రటేరియట్, లోక్‌సభ టెలివిజన్‌లకు అడ్మినిస్ట్రేషన్ అండ్ ఫైనాన్స్ డైరెక్టర్‌గా శ్రీమతి షెఫాలీ శరణ్ విధులు నిర్వర్తించారు.
పదవీ బాధ్యతలు స్వీకరించిన శ్రీమతి శరణ్‌కి పత్రికా సమాచార కార్యాలయ సీనియర్ అధికారులు స్వాగతం పలికారు.
****
(रिलीज़ आईडी: 2016832)
आगंतुक पटल : 318
इस विज्ञप्ति को इन भाषाओं में पढ़ें:
English
,
Urdu
,
Marathi
,
हिन्दी
,
Hindi_MP
,
Assamese
,
Manipuri
,
Bengali
,
Bengali-TR
,
Punjabi
,
Gujarati
,
Odia
,
Tamil
,
Malayalam