ప్రధాన మంత్రి కార్యాలయం
అండమాన్ & నికోబార్ దీవుల లో పేరు లేనటువంటి 21 అతి పెద్ద దీవుల కు పరమ్ వీర్ చక్ర పురస్కార గ్రహీత లు 21 మంది యొక్క పేరుల ను పెట్టే కార్యక్రమం లోపాలుపంచుకొన్న ప్రధాన మంత్రి
నేతాజీ సుభాష్ చంద్ర బోస్ ద్వీప్ లో నిర్మించబోయే మరియు నేతాజీ కి అంకితం ఇవ్వబోయే జాతీయ స్మృతి చిహ్నం యొక్క నమూనా ను ఆవిష్కరించిన ప్రధాన మంత్రి
‘‘చరిత్ర ను లిఖించేక్రమం లో దాని ని భావి తరాలు స్మరించుకోవడం, మూల్యాంకనం చేయడం మాత్రమే కాకుండా, ఆ చరిత్ర నుండి నిరంతరం గా ప్రేరణ ను కూడా స్వీకరిస్తుంది’’
‘‘‘ఆజాదీ కా అమృత్కాల్’ లో ఒక ముఖ్యమైనఅధ్యాయం గా ఈ దినాన్ని భావి తరాలు స్మరించుకొంటాయి’’
‘‘సెల్యులర్ జైలులోని జైలు గదుల లో నుండి అంతులేని వేదన తో పాటు అపూర్వమైన ఉద్వేగం తాలూకు స్వరాలు ఈ నాటికి కూడా ను వినవస్తూనే ఉన్నాయి’’
‘‘బంగాల్ మొదలుకొనిదిల్లీ , ఇంకా అండమాన్వరకు, దేశం లోని ప్రతి ప్రాంతం నేతాజీ యొక్క వారసత్వాన్ని మది లో తలచుకొంటూ, వందనాన్ని ఆచరిస్తున్నది’’
‘‘మన ప్రజాస్వామికసంస్థలు మరియు కర్తవ్య పథ్ ఎదుట కొలువుదీరిన నేతాజీ యొక్క భవ్యమైన విగ్రహం మనలకుమన కర్తవ్యాల ను స్ఫురణ కు తీసుకువస్తున్నది’’
‘‘సముద్రం ఎలాగైతే వేరువేరు దీవుల ను కలుపుతూ ఉంటుందో, అదే విధం గా ‘ఏక్ భారత్, శ్రేష్ఠ భారత్’ భావన భరత మాత యొక్క ప్రతి శిశువు ను పరస్పరం జోడిస్తున్నది’’
‘‘ఏ జవానులు అయితేదేశ రక్షణ కోసం వారి ని వారు అంకితం చేసివేసుకొన్నారో వారి కి సైన్యం యొక్క తోడ్పాటు తో పాటే విస్తృతమైనటువంటి గుర్తింపు ను ఇవ్వవలసి ఉన్నది’’
‘‘ఇక ప్రజలు చరిత్ర ను తెలుసుకోవడం కోసం అండమాన్ & నికోబార్ దీవుల కు తరలి వస్తున్నారు’’
Posted On:
23 JAN 2023 2:12PM by PIB Hyderabad
అండమాన్ & నికోబార్ దీవుల లో పేరు లేనటువంటి 21 అతి పెద్ద దీవుల కు పరమ్ వీర్ చక్ర పురస్కార గ్రహీతల లో 21 మంది యొక్క పేరుల ను ‘పరాక్రమ్ దివస్’ సందర్భం లో పెట్టే కార్యక్రమం లో ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ వీడియో కాన్ఫరెన్సింగ్ మాధ్యం ద్వారా ఈ రోజు న పాలుపంచుకొన్నారు. ఈ కార్యక్రమం లో భాగం గా, నేతాజీ సుభాష్ చంద్ర బోస్ ద్వీపం లో నిర్మించబోయే మరియు నేతాజీ కి అంకితం ఇవ్వబోయే ఒక జాతీయ స్మృతి చిహ్నం తాలూకు నమూనా ను కూడా ప్రధాన మంత్రి ఆవిష్కరించారు.
ఈ కార్యక్రమం లో పాలుపంచుకొన్న సభికుల ను ఉద్దేశించి ప్రధాన మంత్రి ప్రసంగిస్తూ, అందరికి ‘పరాక్రమ్ దివస్’ శుభాకాంక్షల ను తెలియ జేస్తూ, ఈ ప్రేరణాత్మకమైనటువంటి దినాన్ని నేతాజీ సుభాష్ చంద్ర బోస్ యొక్క జయంతి సందర్భం లో దేశ వ్యాప్తం గా పాటించుకొంటున్నామన్నారు. ఈ రోజు ను అండమాన్ & నికోబార్ దీవుల కు ఒక చరిత్రాత్మకమైన దినం గా ప్రధాన మంత్రి అభివర్ణించారు. ‘‘చరిత్ర ను లిఖిస్తూ ఉన్నప్పుడు భావి తరాలు ఆ విషయాన్ని స్మరించుకోవడం, దాని ని మూల్యాంకనం చేయడం మాత్రమే కాకుండా ఆ చరిత్ర నుండి నిరంతరం ప్రేరణ ను కూడా పొందుతారు’’ అని ప్రధాన మంత్రి అన్నారు. అండమాన్ & నికోబార్ దీవుల లో 21 దీవుల కు పేరుల ను పెట్టే కార్యక్రమం ఈ రోజు న జరుగుతున్నది; మరి, వాటి ని ఇక మీదట పరమ్ వీర్ చక్ర పురస్కార గ్రహీతల లో 21 మంది తాలూకు పేరుల తో గుర్తించడం జరుగుతుందని ప్రధాన మంత్రి తెలియ జేశారు. నేతాజీ సుభాష్ చంద్ర బోస్ జీవనాన్ని గౌరవార్థం ఒక క్రొత్త స్మృతి చిహ్నాని కి శంకుస్థాపన ను ఆయన కొంత కాలం పాటు గడిపిన చోటనే జరుగుతోంది అని కూడా ప్రధాన మంత్రి వివరించారు. ఈ రోజు ను భవిష్యత్తు తరాల వారు ‘ఆజాదీ కా అమృత్ కాల్’ లో ఒక ముఖ్యమైన అధ్యాయం గా స్మరించుకొంటారు అని ప్రధాన మంత్రి అన్నారు. నేతాజీ స్మృతి చిహ్నం మరియు క్రొత్త గా పేరు ను పెట్టినటువంటి 21 దీవులు యువ తరానికి ఎల్లప్పటికీ ప్రేరణ ను అందిస్తూనే ఉంటాయి అని ప్రధాన మంత్రి స్పష్టం చేశారు.
అండమాన్ & నికోబార్ దీవుల యొక్క చరిత్ర ను గురించి ప్రధాన మంత్రి చెప్తూ, ఇక్కడ మొట్టమొదటిసారిగా మువ్వన్నెల జెండా ను ఎగరవేయడమైంది, అంతేకాదు భారతదేశం యొక్క ఒకటో స్వతంత్ర ప్రభుత్వాన్ని ఇక్కడ స్థాపించడమైందన్నారు. వీర్ సావర్ కర్ గారు మరియు ఆయన వంటి మరి ఎందరో ఇతర వీరులు కూడాను ఇదే భూమి మీద దేశం కోసం తపస్సు ను మరియు బలిదానం తాలూకు ఉన్నత శిఖరాల ను తాకారని కూడా ప్రధాన మంత్రి అన్నారు. ‘‘సెల్యులర్ జైలు లోని జైలు గదుల నుండి అంతు లేని వేదన తో పాటు గా అపూర్వమైనటువంటి ఉద్వేగం తాలూకు గళాలు ఈ రోజు కు కూడాను వినపడుతూ ఉన్నాయి’’ అని ఆయన అన్నారు. అండమాన్ యొక్క గుర్తింపు స్వాతంత్య్ర పోరాటం తాలూకు జ్ఞాపకాల కు బదులు బానిసత్వం యొక్క సంకేతాల తో ముడి పడి ఉండడం విచారకరం అని ప్రధాన మంత్రి అన్నారు. ‘‘చివరకు మన దీవుల యొక్క పేరుల లో సైతం దాస్యం యొక్క ముద్రలు ఉండేవి’’ అని ఆయన అన్నారు. నాలుగైదేళ్ళ క్రిందట పోర్ట్ బ్లేయర్ లో మూడు ముఖ్య దీవుల పేరుల ను మార్చడానికని నాలుగైదేళ్ళ క్రిందట పోర్ట్ బ్లేయర్ ను తాను సందర్శించి, న సంగతి ని ప్రధాన మంత్రి జ్ఞప్తి కి తెచ్చుకొంటూ, ‘‘ఈ రోజు న రాస్ ఐలండ్ నేతాజీ సుభాష్ చంద్ర బోస్ ఐలండ్ గాను, హేవ్‌లాక్ ఐలండ్ మరియు నీల్ ఐలండ్ లు స్వరాజ్ ఐలండ్, ఇంకా శహీద్ ఐలండ్ గాను మారిపాపోయాయి’’ అని వివరించారు. స్వరాజ్ మరియు శహీద్ అనే పేరుల ను స్వయం గా నేతాజీ యే ఇచ్చినప్పటికీ, స్వాతంత్య్రం తరువాత కూడాను వాటికి ఎటువంటి ప్రాముఖ్యాన్ని ఇవ్వలేదు అని ప్రధాన మంత్రి ప్రస్తావించారు. ‘‘ఆజాద్ హింద్ ఫౌజ్ యొక్క ప్రభుత్వం 75 సంవత్సరాల ను పూర్తి చేసుకొన్నప్పుడు మా ప్రభుత్వమే ఈ పేరుల ను తిరిగి ప్రచారం లోకి తీసుకు వచ్చింది’’ అని ప్రధాన మంత్రి చెప్పారు.
భారతదేశాని కి స్వాతంత్య్రం వచ్చిన తరువాత చరిత్ర పుటల లో ఎక్కడో మరుగు న పడిపోయినటువంటి అదే నేతాజీ ని 21 వ శతాబ్ధి లో భారతదేశం స్మరించుకొంటోంది అని ప్రధాన మంత్రి అన్నారు. అండమాన్ లో తొలిసారి గా త్రివర్ణ పతాకాన్ని నేతాజీ ఎగురవేసిన స్థలం లోనే ఈ రోజు న సమున్నత భారత జాతీయ పతాకాన్ని ఆవిష్కరించడమైంది అని ప్రధాన మంత్రి అన్నారు. ఈ ప్రదేశాన్ని చూడడాని కి వచ్చే దేశ ప్రజలందరి హృదయాల లో దేశభక్తి భావన ను ఈ జెండా నింపుతుంది అని ఆయన అన్నారు. నేతాజీ యొక్క స్మృతి లో నిర్మించబోయేటటువంటి క్రొత్త మ్యూజియమ్ మరియు స్మృతి చిహ్నం లు అండమాన్ యాత్ర ను మరింత గుర్తు పెట్టుకోదగ్గవి గా మార్చి వేస్తాయి అని ప్రధాన మంత్రి అన్నారు. నేతాజీ మ్యూజియమ్ 2019 వ సంవత్సరం లో దిల్లీ లోని ఎర్ర కోట లో ప్రారంభమైంది అనే విషయాన్ని ప్రధాన మంత్రి ప్రముఖం గా ప్రకటిస్తూ, ఆ స్థలం ప్రజల కు ప్రేరణ సాధనం గా ఉందన్నారు. నేతాజీ యొక్క 125 వ జయంతి సందర్భం లో బంగాల్ లో ప్రత్యేకమైన కార్యక్రమాల ను నిర్వహించిన సంగతి ని కూడా ప్రధాన మంత్రి వివరిస్తూ, ‘పరాక్రమ్ దివస్’ గా ఆ దినాన్ని ప్రకటించినట్లు పేర్కొన్నారు. ‘‘బంగాల్ నుండి దిల్లీ, ఇంకా అండమాన్ ల వరకు చూసుకొంటే, దేశం లోని ప్రతి ప్రాంతం నేతాజీ యొక్క వారసత్వాన్ని మదిలో పదిలపరచుకోవడం తో పాటు గా వందనాన్ని కూడాను ఆచరిస్తున్నది’’ అని ప్రధాన మంత్రి అన్నారు.
నేతాజీ సుభాస్ చంద్ర బోస్ కు సంబంధించిన కార్యాల ను స్వాతంత్య్రం వచ్చిన వెనువెంటనే పూర్తి చేయవలసి ఉండగా, ఆ కార్యాల ను గడచిన 8, 9 సంవత్సరాల లో చేపట్టడమైంది అని ప్రధాన మంత్రి తెలియ జేశారు. స్వతంత్ర భారతదేశం లో ఒకటో ప్రభుత్వాన్ని 1943 వ సంవత్సరం లో దేశం లోని ఇదే ప్రాంతం లో ఏర్పాటు చేసిన సంగతి ని ప్రధాన మంత్రి వెల్లడిస్తూ, దేశం ఈ విషయాన్ని మరింత గర్వం తో స్వీకరిస్తోంది అన్నారు. ఆజాద్ హింద్ ప్రభుత్వం స్థాపన కు 75 సంవత్సరాలు పూర్తి అయిన సందర్భం లో దేశం ఎర్ర కోట లో జెండా ను ఎగురవేసి నేతాజీ కి శ్రద్ధాంజలి ని సమర్పించిన విషయాన్ని ప్రధాన మంత్రి ప్రస్తావించారు. నేతాజీ యొక్క జీవనాని కి సంబంధించిన ఫైళ్ళ ను బహిరంగ పరచాలనే డిమాండు దశాబ్దాల తరబడి ఉంటూ వచ్చింది అని ప్రధాన మంత్రి చెప్తూ, ఈ యొక్క కార్యాన్ని పూర్తి నిష్ఠ తో నెరవేర్చడమైంది అన్నారు. ‘‘ప్రస్తుతం, మన ప్రజాస్వామిక సంస్థ లు మరియు కర్తవ్య పథ్ సమక్షం లో కొలువైన నేతాజీ యొక్క భవ్యమైన విగ్రహం మనలకు మన కర్తవ్యాల ను గురించి గుర్తు కు తీసుకు వస్తున్నది’’ అని ప్రధాన మంత్రి అన్నారు.
ఏ దేశాలైతే వాటి సన్నిహిత వ్యక్తుల మరియు స్వాతంత్య్ర యోధుల ను సకాలం లో ప్రజల తో మమేకం చేశాయో మరి ఏ దేశాలైతే సమర్ధమైన ఆదర్శాల ను నిర్మించుకొని వాటిని జాతి కి వెల్లడించాయో అవే అభివృద్ధి మరియు దేశ నిర్మాణం అనే పరుగు లో చాలా ముందుకు సాగిపోయాయి అని ప్రధాన మంత్రి అన్నారు. భారతదేశం ‘ఆజాదీ కా అమృత్ కాల్’ లో ఇదే తరహా అడుగులను వేస్తూ పురోగమిస్తున్నది అని ఆయన స్పష్టం చేశారు.
మొత్తం 21 ద్వీపాలకు నామకరణం వెనుకగల ‘ఒకే భారతం-శ్రేష్ఠ భారతం’ అనే విశిష్ట సందేశాన్ని ప్రధానమంత్రి ప్రముఖంగా ప్రస్తావించారు. దేశం కోసం జీవితాలు త్యాగం చేసిన అమరుల, భారత సైనికుల శౌర్యపరాక్రమాలకు సంబంధించిన సందేశమని ఆయన పేర్కొన్నారు. ఈ 21 మంది పరమవీర చక్ర విజేతలు భరతమాత రక్షణ కోసం తమ సర్వస్వం త్యాగం చేశారని గుర్తుచేశారు. ఈ వీర సైనికులు వివిధ రాష్ట్రాలు, భాషలు, మాండలికాలకు చెందినవారని పేర్కొన్నారు. అలాగే వారందరి జీవనశైలి కూడా విభిన్నమైనదని, అయినప్పటికీ భరతమాత పుత్రులుగా దేశ సేవలో వారు అమలరులయ్యారని నివాళి అర్పించారు. మాతృభూమిపై అచంచల భక్తివిశ్వాసాలే వారిని ఒక్కటి చేశాయంటూ- ‘‘సముద్రం వివిధ ద్వీపాలను కలిపే తరహాలోనే ‘ఒకే భారతం-శ్రేష్ఠ భారతం’ భావన కూడా భరతమాత బిడ్డలందర్నీ ఏకం చేస్తుంది’’ అని ప్రధానమంత్రి వ్యాఖ్యానించారు. ‘‘మేజర్ సోమనాథ్ శర్మ, పీరు సింగ్, మేజర్ షైతాన్ సింగ్ నుంచి కెప్టెన్ మనోజ్ పాండే, సుబేదార్ జోగీందర్ సింగ్, లాన్స్ నాయక్ ఆల్బర్ట్ ఎక్కా వరకూ; వీర అబ్దుల్ హమీద్, మేజర్ రామస్వామి పరమేశ్వరన్ వంటివారిదాకా ‘దేశమే ప్రథమం!’ అన్నది మొత్తం 21 మంది ‘పరమవీర చక్ర’ గ్రహీతల ఉమ్మడి సంకల్పం. అంతటి బలమైన సంకల్పం ఇప్పుడీ దీవులకు నామకరణంతో శాశ్వతంగా నిలిచి ఉంటుంది. అండమాన్‌లోని ఒక కొండను కార్గిల్ యుద్ధ వీరుడైన కెప్టెన్ విక్రమ్ బాత్రాకు అంకితం చేశాం’’ అని ఆయన వెల్లడించారు.
అండమాన్-నికోబార్ దీవులకు నామకరణం పరమవీర చక్ర పురస్కార గ్రహీతలకు మాత్రమే పరిమితం కాదని, భారత సాయుధ దళాలకూ అంకితం చేయబడిందని ప్రధానమంత్రి నొక్కిచెప్పారు. స్వాతంత్య్రం సిద్ధించిన నాటి నుంచే మన సైన్యం యుద్ధాలు చేయాల్సి వచ్చిందని గుర్తుచేస్తూ- ప్రతి యుద్ధంలోకూ మన సైనిక బలగాలు అన్నివిధాలా తమ శౌర్యప్రతాపాలను రుజువు చేసుకుకున్నాయని ప్రధాని చెప్పారు. ‘‘జాతి రక్షణ కర్తవ్యానికి తమనుతాము అంకితం చేసుకున్న వీర సైనికులతోపాటు సైనికబలగాల దేశభక్తికి విస్తృత గుర్తింపునివ్వడం దేశ పౌరులందరి కర్తవ్యం’’ అని ఆయన స్పష్టం చేశారు. ఆ మేరు ‘‘దేశం నేడు తన బాధ్యతను నిర్వర్తిస్తుండగా, వీర సైనికులు, సైనిక బలగాల పేరిట దానికి విశిష్ట గుర్తింపు ఇవ్వబడుతోంది’’ అన్నారు.
అండమాన్-నికోబార్ దీవుల సామర్థ్యాన్ని ప్రస్తావిస్తూ- ఇది నీరు, ప్రకృతి, పర్యావరణం, కృషి, సాహసం, సంప్రదాయం, పర్యాటకం, జ్ఞాన వికాసం, స్ఫూర్తితో ముడిపడిన నేల అని ప్రధానమంత్రి ప్రస్తుతించారు. అందుకే ఈ నేలకుగల సామర్థ్యాన్ని, ఇక్కడగల అవకాశాలను గుర్తించడం ఎంతయినా అవసరమని నొక్కిచెప్పారు. ప్రభుత్వం గత 8 సంవత్సరాలుగా చేసిన కృషిని వివరిస్తూ- 2014తో పోలిస్తే 2022లో అండమాన్‌కు వచ్చే పర్యాటకుల సంఖ్య రెట్టింపైందని ప్రధాని పేర్కొన్నారు. అలాగే పర్యాటకరంగ సంబంధిత ఉపాధి, ఆదాయాల్లోనూ వృద్ధిని గుర్తుచేశారు. అండమాన్ సంబంధిత స్వాతంత్య్రోద్యమ చరిత్రపైనా సందర్శకులలో ఉత్సుకత పెరుగుతున్నదని పేర్కొన్నారు. దీనివల్ల ఈ ప్రదేశానికి వైవిధ్యభరిత గుర్తింపు కూడా లభిస్తున్నదనే వాస్తవాన్ని గమనించాలని సూచించారు. ‘‘ఇవాళ ప్రజలు చరిత్రను తెలుసుకోవడానికే కాకుండా దానితో మమేకం కావడం కోసం కూడా ఇక్కడికి వస్తున్నారు’’ అని ప్రధాని వ్యాఖ్యానించారు. అండమాన్-నికోబార్ దీవులలోని సుసంపన్న గిరిజన సంప్రదాయాలను కూడా ఆయన ప్రస్తావించారు. అంతేకాకుండా నేతాజీ సుభాష్ చంద్రబోస్ సంబంధిత స్మారక చిహ్నాన్ని గుర్తించడం, ఆయన నేతృత్వంలోని సైన్యం ధైర్యసాహసాలను గౌరవించడంపైనా భారతీయులలో ఆసక్తి కలుగుతున్నదని అన్నారు.
ముఖ్యంగా వక్రీకరించబడిన సైద్ధాంతిక రాజకీయాలతోపాటు దశాబ్దాల తరబడి కొనసాగిన న్యూనతాభావం, ఆత్మవిశ్వాస లేమి ఫలితంగా దేశ సామర్థ్యాన్ని గుర్తించడంలో గత ప్రభుత్వం విఫలమైందంటూ ప్రధానమంత్రి విచారం వ్యక్తం చేశారు. ‘‘హిమాలయ రాష్ట్రాలు సహా... ముఖ్యంగా ఈశాన్య భారతం లేదా అండమాన్-నికోబార్ వంటి సముద్ర ద్వీప ప్రాంతాలలో అభివృద్ధి దశాబ్దాలుగా విస్మరణకు గురైంది. ఇవి మారుమూల, దుర్గమ, ప్రాధాన్యరహిత ప్రాంతాలుగా పరిగణించబడటమే ఇందుకు కారణం’’ అని ఆయన వ్యాఖ్యానించారు. ద్వీపాలు, లంకలు సంఖ్య గురించి లోగడ పట్టించుకున్న దాఖలాలు లేవన్నారు. ఈ నేపథ్యంలో సింగపూర్, మాల్దీవ్స్, సీషెల్స్ వంటి అభివృద్ధి చెందిన ద్వీప దేశాలను ఉదాహరిస్తూ- ఈ దేశాల భౌగోళిక విస్తీర్ణం అండమాన్-నికోబార్ దీవులతో పోలిస్తే చాలా తక్కువన్నారు. అయినప్పటికీ, ఆ దేశాలు తమ వనరుల సద్వినియోగంతో కొత్త శిఖరాలకు చేరుతున్నాయని ప్రధానమంత్రి నొక్కిచెప్పారు. మన దేశంలోని ద్వీపాలకూ అంతటి సామర్థ్యం ఉందని, ఆ దిశగా భారత్ ముందంజ వేస్తున్నదని చెప్పారు. ఈ మేరకు ‘సముద్రాంతర ఆప్టికల్ ఫైబర్ లైన’ ద్వారా అండమాన్‌ను వేగవంతమైన ఇంటర్నెట్‌తో అనుసంధానించడాన్ని ఆయన ప్రస్తావించారు. దీనివల్ల డిజిటల్ చెల్లింపులతోపాటు ఇతర సంక్లిష్ట సేవలకు మార్గం సుగమమై, పర్యాటకులకు ప్రయోజనం చేకూర్చగలదని మంత్రి ఉదాహరించారు. ‘‘ఇప్పుడు దేశంలో సహజ సమతౌల్యం, ఆధునిక వనరులు కలిసి ముందడుగు వేస్తున్నాయి’’ అని ప్రధాని వివరించారు.
చివరగా- స్వాతంత్య్ర పోరాటానికి కొత్త దశ, దిశలను నిర్దేశించిన అండమాన్-నికోబార్ దీవులు అదే తరహాలో భవిష్యత్ దేశాభివృద్ధికీ కొత్త ఉత్తేజం ఇవ్వగలవని ప్రధాని వ్యాఖ్యానించారు. ఈ మేరకు ‘‘మనం సమర్థ భారతదేశాన్ని నిర్మించగలం.. ఆధునిక ప్రగతి పయనంలో కొత్త శిఖరాలను అందుకోగలం.. ఈ విషయంలో నాకు సంపూర్ణ విశ్వాసం ఉంది’’ అంటూ ప్రధానమంత్రి తన ప్రసంగం ముగించారు. ఈ కార్యక్రమంలో కేంద్ర హోంశాఖ మంత్రి శ్రీ అమిత్ షా, అండమాన్-నికోబార్ దీవుల లెఫ్టినెంట్ గవర్నర్ అడ్మిరల్ డి.కె.జోషి, సాయుధ బలగాల ప్రధానాధికారి జనరల్ అనిల్ చౌహాన్ తదితరులు పాల్గొన్నారు.
నేపథ్యం
అండమాన్-నికోబార్ దీవుల చారిత్రక ప్రాముఖ్యం దృష్ట్యా 2018లో ద్వీపాన్ని సందర్శించిన సందర్భంలో ప్రధానమంత్రి రాస్ దీవులకు నేతాజీ జ్ఞాపకార్థం ‘నేతాజీ సుభాష్ చంద్రబోస్’ ద్వీపంగా పేరు మార్చారు. అలాగే ‘నీల్ ఐలాండ్, హేవ్‌లాక్’ దీవులకు ‘షాహిద్ ద్వీప్, స్వరాజ్ ద్వీప్’ అని పేరు పెట్టారు.
దేశంలోని నిజ జీవిత వీరులకు సముచిత గౌరవం కల్పనలో ప్రధానమంత్రి సదా అత్యంత ప్రాధాన్యమిస్తారు. ఈ స్ఫూర్తితో ముందడుగు వేస్తూ- ఇప్పుడు ద్వీప సమూహంలోని 21 పెద్ద పేరులేని దీవులకు 21 మంది పరమవీర చక్ర పురస్కార గ్రహీతల పేరు పెట్టాలని నిర్ణయించారు. ఇందులో భాగంగా పేరులేని అతిపెద్ద ద్వీపానికి తొలి ‘పరమవీర చక్ర’ గ్రహీత పేరు పెడతారు. అలాటే రెండో అతిపెద్ద పేరులేని ద్వీపానికి రెండో పరమవీర చక్ర అవార్డు గ్రహీత పేరు పెట్టబడుతుంది. ఆ విధంగా దేశ సార్వభౌమాధికారం, సమగ్రతలను కాపాడటంలో సర్వస్వం త్యాగం చేసిన మన వీరులకు ఇది శాశ్వత నివాళి కాగలదు.
ఈ దీవులకు నామకరణం చేసిన 21 మంది పరమవీర చక్ర అవార్డు గ్రహీతల పేర్లు ఇవే: మేజర్ సోమనాథ్ శర్మ; సుబేదార్-హోనీ కెప్టెన్ (అప్పటి లాన్స్ నాయక్) ఎం.ఎం.కరమ్ సింగ్; సెకండ్ లెఫ్టినెంట్ రామ రఘోబా రాణే; నాయక్ జాదునాథ్ సింగ్; కంపెనీ హవల్దార్ మేజర్ పీరు సింగ్; కెప్టెన్ జి.ఎస్.సలారియా; లెఫ్టినెంట్ కల్నల్ (అప్పటి మేజర్) ధన్ సింగ్ థాపా; సుబేదార్ జోగీందర్ సింగ్; మేజర్ షైతాన్ సింగ్; సిక్యుహెచ్ఎం అబ్దుల్ హమీద్; లెఫ్టినెంట్ కర్నల్ అర్దేషిర్ బుర్జోర్జీ తారాపూర్; లాన్స్ నాయక్ ఆల్బర్ట్ ఎక్కా; మేజర్ హోషియార్ సింగ్; సెకండ్ లెఫ్టినెంట్ అరుణ్ ఖేత్రపాల్; ఫ్లయింగ్ ఆఫీసర్ నిర్మల్‌జిత్ సింగ్ సెఖోన్; మేజర్ రామస్వామి పరమేశ్వరన్; నాయబ్ సుబేదార్ బనా సింగ్; కెప్టెన్ విక్రమ్ బాత్రా; లెఫ్టినెంట్ మనోజ్ కుమార్ పాండే; సుబేదార్ మేజర్ (అప్పటి రైఫిల్‌మ్యాన్) సంజయ్ కుమార్; సుబేదార్ మేజర్ రిటైర్డ్ (హోనీ కెప్టెన్) గ్రెనేడియర్ యోగేంద్ర సింగ్ యాదవ్.
(Release ID: 2016470)
Visitor Counter : 114
Read this release in:
Assamese
,
Punjabi
,
Odia
,
English
,
Urdu
,
Marathi
,
Hindi
,
Manipuri
,
Bengali
,
Gujarati
,
Tamil
,
Kannada
,
Malayalam