ప్రధాన మంత్రి కార్యాలయం

బడ్జెట్ అనంతరం ‘రీచింగ్ ద లాస్ట్ మైల్’ అంశం పై ఏర్పాటైన వెబినార్ లో ప్రధాన మంత్రి ప్రసంగం పాఠం

Posted On: 27 FEB 2023 11:08AM by PIB Hyderabad

బడ్జెటు ను ప్రవేశ పెట్టిన అనంతరం, పార్లమెంటు లో ఒక చర్చ ను నిర్వహించడం అనే సంప్రదాయం ఉన్నది. అది అవసరం, ప్రయోజనకరం కూడా ను. అయితే, మా ప్రభుత్వం బడ్జెటు పై చర్చను ఒక అడుగు ముందుకు తీసుకు పోయింది. బడ్జెటు తో సంబంధం ఉన్న అన్ని వర్గాల తోను మా ప్రభుత్వం గడచిన కొన్ని సంవత్సరాలు గా బడ్జెటు సమర్పణ కు ముందు మరియు బడ్జెటు సమర్పణ తరువాత తీవ్ర మేధో మథనాన్ని సాగించే ఒక క్రొత్త సంప్రదాయాన్ని మొదలు పెట్టింది. అమలు పరం గాను మరియు కాలబద్ధమైన ఆచరణ పరం గాను చూసుకొన్నప్పుడు, ఇది చాలా ముఖ్యమైనటువంటిది. అంతేకాదు, పన్నుల ను చెల్లిస్తున్న ప్రజల డబ్బు లో పైసా పైసా ను తగిన రీతి న వినియోగించేటందుకు కూడా ఈ చర్య పూచీ పడుతుంది. గత కొన్ని రోజుల లో నేను వివిధ రంగాల నిపుణుల తో మాట్లాడాను, ఈ రోజు న అంశం రీచింగ్ ద లాస్ట్ మైల్. ఇది గాంధీ మహాత్ముడు చెబుతూ ఉండే మాటలు.. మీ విధానాలు మరియు మీ ప్రణాళిక లు చిట్టచివరి వ్యక్తి కి ఎంత త్వరగా చేరుతాయి అన్నది చాలా ముఖ్యం.. అనే విషయాన్ని సూచిస్తున్నది. మరి, ఈ కారణం గా ఈ రోజు న ఈ విషయం పై స్టేక్ హోల్డర్స్ అందరి తో విస్తృత చర్చ ను చేపట్టడం జరుగుతోంది. ఇలా ఎందుకు అంటే, దీని ద్వారా మనం బడ్జెటు లో జన సంక్షేమ పథకాలు సమర్థం గా అమలు అయ్యేటట్లు, మరి లబ్ధిదారుల కు పూర్తి పారదర్శకమైన విధం గా అవి చేరేటట్లు చూడవచ్చును కాబట్టి.

 

 

మిత్రులారా,

ప్రజల యొక్క సంక్షేమం మరియు దేశం యొక్క అభివృద్ధి డబ్బు ద్వారానే సాధ్యమన్న ఒక గ్రహణ శక్తి అంటూ మన దేశం లో ఉంటూ వచ్చింది; అలా ఏమీ కాదు, డబ్బు దేశాభివృద్ధి కి మరియు దేశ ప్రజల కు అవసరమే. కానీ, డబ్బు తో పాటు గా సద్భావన కూడా కావాలి; ప్రభుత్వ పథకాల యొక్క సాఫల్యాని కి ప్రాణాధారమైన షరతు ఏది అంటే అది సుపరిపాలన. ప్రజల బాధల ను అర్థం చేసుకొనేటటువంటి పాలన, మరి అంతేకాకుండా, సామాన్య మానవుడి సేవ కు సమర్పణం అయినటువంటి పాలనానూ. ప్రభుత్వం చేపట్టే పనులు నిర్దిష్టమూ, నిరంతర పర్యవేక్షణ లో జరుగుతున్నవీ అయినప్పుడు అనుకున్న కాలం లోపల లక్ష్యాల ను సాధించడం, ఆశించిన ఫలితాన్ని పొందడం సాధ్యాలు అవుతాయి. అందువల్ల సుపరిపాలన కు మనం శ్రద్ధ తీసుకొన్న కొద్దీ రీచింగ్ ద లాస్ట్ మైల్’ (చివరి వ్యక్తి వరకు చేరుకోవడం) అనేటటువంటి మన నిర్దేశిత లక్ష్యాన్ని అంత సులభం గానూ చేరుకోవచ్చును. మీరు ఒక సారి గుర్తు కు తెచ్చుకోండి.. ఇదివరకు టీకామందు మనదేశం లో మారుమూల ప్రాంతాల కు చేరుకొనేందుకు అనేక దశాబ్దాల కాలం పట్టింది. టీకా ల వంద శాతం ప్రాప్తి పరం గా చూసుకొంటే భారతదేశం చాలా వెనుకపట్టు న ఉండిపోయింది. దేశం లో కోట్ల కొద్దీ బాలలు ప్రత్యేకించి గ్రామాల లో, ఆదివాసీ ప్రాంతాల లో మనుగడ సాగిస్తున్న పిల్లలు టీకామందు కోసం ఏళ్ళ తరబడి వేచి ఉండవలసి వచ్చింది. పాత విధానాన్నే మనం అనుసరించవలసి వచ్చిన పక్షం లో, భారతదేశం లో ప్రతి ఒక్కరి కి టీకామందు అనేటటువంటి లక్ష్యాన్ని సాధించడానికి మరెన్నో దశాబ్దులు పట్టేది. మేం ఒక క్రొత్త విధానం తో మిశన్ ఇంద్రధనుష్ను ప్రారంభించాం; మరి దేశవ్యాప్తం గా వేక్సీనేశన్ సిస్టమ్ మెరుగైంది. కరోనా ప్రపంచ మహమ్మారి కాలం లో టీకామందు ను దరిదాపుల కు తీసుకు పోవడం లో ఈ క్రొత్త వ్యవస్థ తాలూకు ప్రయోజనాన్ని మనం అందుకొన్నాం. వేక్సీన్ లను చివరి అంచె వరకు చేరేటట్లు చూడడం లో సుపరిపాలన ఒక ప్రధానమైన పాత్ర ను తప్పక పోషించింది అని నాకు అనిపిస్తోంది.

 

 

మిత్రులారా,

చిట్టచివరి మైలు వరకు పోవాలిఅనేటటువంటి వైఖరి, మరి అలాగే అందరికీ ప్రయోజనాలు దక్కాలిఅనే ధోరణి ఒక దాని కి మరొకటి పూరకాలు గా ఉంటాయి. పేద ప్రజానీకం మౌలిక సదుపాయాల కోసం ప్రభుత్వ కార్యాలయాల చుట్టూ అనేక సారులు తిరిగే కాలం అంటూ ఒకటి ఉండింది, లేదా వారు ఎవరైనా మధ్యవర్తుల కేసి చూస్తూ ఉండే వారు. వీటివల్ల అవినీతి విచ్చలవిడి అయిపోయింది. ప్రజల హక్కు ల అతిక్రమణ చోటు చేసుకొంది. ప్రస్తుతం ప్రభుత్వం సదుపాయాల ను బీదల ఇంటి ముంగిట కే చేరవేస్తున్నది. ప్రతి ఒక్క మౌలిక సదుపాయాన్ని ఎటువంటి వివక్ష కు తావు ఇవ్వకుండా, దేశం లో ప్రతి ఒక్కరికి అందించాలి అనే నిర్ణయాన్ని మనం తీసుకొన్న రోజు న స్థానిక స్థాయి లో పని సంస్కృతి లో ఒక పెద్ద మార్పు చోటు చేసుకొంటుంది. ప్రభుత్వ పథకాల యొక్క ప్రయోజనాలు అందరికీ చేరాలి అంటే, అందుకు కావలసిందల్లా ఈ భావన యే. ప్రతి ఒక్క స్టేక్ హోల్డర్ దగ్గర కు చేరుకోవాలి అన్నదే మన ధ్యేయం అయినప్పుడు, వివక్ష కు, అవినీతి కి, ఆశ్రిత పక్షపాతాని కి చోటు ఉండదు. మరి అటువంటి అప్పుడే మీరు రీచింగ్ ద లాస్ట్ మైల్లక్ష్యాన్ని అందుకో గలుగుతారు. మీరు చూడండి.. ప్రస్తుతం వీధి వీధి కి తిరుగుతూ సరుకుల ను అమ్ముకొనే వర్గాల వారిని దేశం లో మొట్టమొదటి సారిగా ‘పిఎమ్ స్వనిధి యోజన’ ద్వారా బ్యాంకింగ్ వ్యవస్థ లోకి తీసుకు రావడమైంది. ప్రస్తుతం దేశం లో మొట్టమొదటి సారిగా సంచార జాతి ప్రజల కోసం ఒక సంక్షేమ మండలి ని ఏర్పాటు చేయడమైంది. గ్రామాల లో ఏర్పాటు చేసినటువంటి 5 లక్షల పైచిలుకు కామన్ సర్వీస్ సెంటర్ లు ప్రభుత్వ సేవల ను పల్లె ల వద్ద కు తీసుకు పోయాయి. నిన్నటి రోజు న నా మన్ కీ బాత్’ (‘మనసు లో మాట’) కార్యక్రమం లో దేశం లో పది కోట్ల టెలిమెడిసిన్ కేసుల కు సంబంధించి నేను పూసగుచ్చినట్లు వివరించాను. ఇది ఆరోగ్యాని కి సంబంధించినంత వరకు రీచింగ్ ద లాస్ట్ మైల్భావన కు అద్దం పట్టేదే.

 

 

మిత్రులారా,

  • లో ఆదివాసీ ప్రజలు నివసించే ప్రాంతాల కు మరియు పల్లె ప్రాంతాల కు రీచింగ్ ద లాస్ట్ మైల్మంత్రాన్ని తీసుకు పోవలసిన అవసరం ఉంది. ఈ సంవత్సరం బడ్జెటు లో దీని విషయం లో కూడాను ప్రత్యేక శ్రద్ధ ను తీసుకోవడమైంది. రీచింగ్ ద లాస్ట్ మైల్లక్ష్యాన్ని సాధించడం కోసం ‘జల్ జీవన్ మిశన్’ కు బడ్జెటు లో వేల కోట్ల రూపాయల ప్రతిపాదన ను చేర్చడమైంది. 2019 వ సంవత్సరం వరకు చూసుకొంటే మన దేశం లో గ్రామీణ ప్రాంతాల లోని మూడు కోట్ల గృహాల కే నల్లా నీరు లభిస్తూ వచ్చింది. ప్రస్తుతం ఈ సంఖ్య 11 కోట్ల కు పైబడింది, అది కూడా ను చాలా తక్కువ కాలం లో సుమా. కేవలం ఒక ఏడాది లోపల, దేశం లో సుమారు 60,000 అమృత సరోవరాల సంబంధి పనులు మొదలయ్యాయి. మరి, ఇప్పటి వరకు 30,000 కు పైచిలుకు అమృత సరోవరాల నిర్మాణం పూర్తి అయిందని నా తో చెప్పారు. లో ఈ తరహా ఏర్పాటు ల కోసం దశాబ్దాల తరబడి వేచి ఉన్న వర్గాల ప్రజల జీవన ప్రమాణాల ను ఈ ప్రచార కార్యక్రమాలు మెరుగు పరుస్తున్నాయి.

 

 

అయితే, మిత్రులారా,

మనం కాసేపు ఆగుదాం అనుకోవడానికి వీలు లేదు. మనం ఎటువంటి యంత్రాంగాన్ని తప్పక తయారు చేయాలి అంటే దాని వల్ల క్రొత్త నీటి కనెక్శన్ ల పరం గా జల వినియోగం తాలూకు ప్రతిరూపాన్ని మనం గమనించడాని కి వీలు పడాలన్న మాట. ‘పానీ సమితియాఁ (జల సమితులు) ను మరింత బలపరచడాని కి ఏమి చేయాలో కూడా మనం సమీక్షించుకోవలసి ఉంది. వేసవి కాలం ఈ సరికే వచ్చేసింది. జల సంఘాల ను ఇక మీదట జల సంరక్షణ కోసం మనం ఏ విధం గా ఉపయోగించుకోవచ్చునో అనే విషయాన్ని కూడా మనం ఆలోచించక తప్పదు. కేచ్ ద రెయిన్(వర్షపు నీటిని వడిసి పట్టండి) ఉద్యమాన్ని వాన లు కురిసే కంటే ముందుగానే రూపొందించి, ఆ ఉద్యమం పట్ల ప్రజల లో చైతన్యాన్ని రగుల్కొల్పాలి. అలా చేసినందువల్ల వర్ష కాలం మొదలయ్యే లోపే తత్సంబంధిత కార్యాల ను ఆరంభించడాని కి వీలవుతుంది.

 

 

మిత్రులారా,

ఈ సంవత్సరం బడ్జెటు లో పేదల ఇళ్ళ కోసం దాదాపు గా 80,000 కోట్ల రూపాయల ఏర్పాటు ను మేం చేశాం. అందరికీ గృహ నిర్మాణం’ (‘హౌసింగ్ ఫార్ ఆల్’) ప్రచార ఉద్యమాన్ని మనం వేగవంతం చేయవలసిన అవసరం ఉంది. గృహ నిర్మాణాన్ని సాంకేతిక విజ్ఞానం తో ఏ విధం గా ముడిపెట్టవచ్చో, తక్కువ ఖర్చుతో మరింత మన్నికైన, బలమైన గృహాన్ని ఏ విధం గా నిర్మించవచ్చో, సౌర విద్యుత్తు వంటి కాలుష్య రహిత శక్తి తాలూకు ప్రయోజనాన్ని ఏ విధం గా పొందవచ్చో, సాముదాయిక గృహ నిర్మాణాని కి సరిక్రొత్త నమూనా గా దేని ని అనుసరించవచ్చో అనే అంశాల పై విస్తృత చర్చ జరగవలసిన అవసరం ఉంది. ఈ తరహా చర్చ ల నుండి మీ యొక్క అనుభవాల సారం పెల్లుబుకాలి.

 

 

మిత్రులారా,

ఆదివాసీ సమాజం యొక్క భారీ సత్తా ను వినియోగించుకోవడం కోసం మొట్టమొదటి సారిగా పెద్ద ఎత్తున కృషి జరుగుతూ ఉన్నది. ఆదివాసీల అభివృద్ధి కి ఈ సంవత్సరం బడ్జెటు లో ప్రాముఖ్యాన్ని ఇవ్వడమైంది. ఏకలవ్య ఆదర్శ ఆశ్రమ పాఠశాలల లో గురువుల ను మరియు సిబ్బంది ని భర్తీ చేసుకోవడం కోసం భారీ ప్రతిపాదన కు స్థానాన్ని కల్పించడమైంది. ఏకలవ్య ఆదర్శ పాఠశాల లలో విద్యార్థులు మరియు గురువులు ఏ అభిప్రాయాల తో ఉన్నారో అనేది కూడా మనం తెలుసుకోవాలి. ఈ పాఠశాల లలో విద్య ను అభ్యసిస్తున్న బాల లు దేశం లో పెద్ద నగరాల లో ఎలా నడచుకోగలరు ? అనేది మరియు అటల్ టింకరింగ్ లేబ్స్ ను పెద్ద సంఖ్య లో ఏ విధం గా ఏర్పాటు చేయాలి అనేది మనం ఆలోచించవలసి ఉన్నది. ఒకవేళ ఇప్పటికిప్పుడే ఈ పాఠశాల లలో డిజిటల్ మార్కెటింగ్, ఇంకా స్టార్ట్-అప్స్ కోసం మనం వర్క్ శాపుల ను ప్రారంభించామా అంటే గనుక, వాటి వల్ల మన ఆదివాసీ సముదాయం ఏ మేరకు లాభపడుతుంది అనేది మీరు ఇట్టే ఊహించగలరు. ఏకలవ్య ఆదర్శ పాఠశాలల నుండి ఉత్తీర్ణులు అయిన ఈ బాలలు వారి ప్రాంతం లో తయారు అయ్యేటటువంటి ఆదివాసీ ఉత్పత్తుల ను ఏవిధం గా ప్రోత్సహించాలో అనే విషయం తో పాటు గా వాటి ని ఆన్ లైన్ లో ఏ విధం గా ప్రచారం చేసుకోవాలో అనే విషయాన్ని ఇప్పటికే తెలుసుకో గలుగుతారు.

 

 

మిత్రులారా,

మొట్టమొదటి సారిగా, మేం ఆదివాసీ సముదాయాల లో అత్యంత నిరాదరణ కు లోనైన వర్గాల కోసం ఒక స్పెశల్ మిశన్ ను ప్రారంభిస్తున్నాం. దేశం లో సుమారు గా 200 జిల్లాల లో 22,000 కు పైగా పల్లెల లో మన ఆదివాసీ మిత్రుల కు త్వరిత గతి న సదుపాయాల ను మనం అందించవలసి ఉంది. ఇదే మాదిరి గా, స్వాతంత్య్రం తరువాత ఎన్నో సంవత్సరాలు గడచినప్పటికీ ఎంతో వెనుకపట్టున ఉండిపోతున్న మన అల్పసంఖ్యక సముదాయం, ప్రత్యేకించి మన ముస్లిమ్ సముదాయాని కి ప్రయోజనాలు ఏ విధం గా అందుతాయి? అనేది కూడా పరిశీలించాలి. సికిల్ సెల్ ను పూర్తి గా తరిమికొట్టడం కోసం ఈ సంవత్సరం బడ్జెటు లో ఒక లక్ష్యాన్ని సైతం పెట్టుకోవడమైంది. ఈ విషయం లో ‘యావత్తు దేశం’ అనేటటువంటి వైఖరి ని అవలంభించవలసిన అవసరం ఉంది. కాబట్టి, ఆరోగ్య రంగం లో ప్రతి ఒక్క స్టేక్ హోల్డర్ చాలా వేగం గా కృషి చేయవలసిన స్థితి ఉంది.

 

 

మిత్రులారా,

మహత్వాకాంక్షయుక్త జిల్లా కార్యక్రమం (యాస్పైరేశనల్ డిస్ట్రిక్ట్ ప్రోగ్రామ్) అనేది రీచింగ్ ద లాస్ట్ మైల్పరం గా చూసుకొన్నప్పుడు ఒక విజయవంతమైన నమూనా గా వెలుగు లోకి వచ్చింది. ప్రస్తుతం ఒక ఆకాంక్షయుక్త బ్లాక్ (యాస్పైరేశనల్ బ్లాక్) అనే కార్యక్రమాన్ని దేశం లో 500 బ్లాకుల లో ప్రారంభించడం జరుగుతోంది. ఆకాంక్షయుక్త బ్లాక్ కార్యక్రమం కోసమని మనం ఆకాంక్షయుక్త జిల్లాల కోవ లో ఏయే తులనాత్మక పరామితుల ను పెట్టుకొన్నామో అటువంటి వాటిని రూపొందించవలసి ఉన్నది. ప్రతి ఒక్క బ్లాకు లో స్పర్థయుక్త వాతావరణాన్ని మనం ఏర్పరచే తీరాలి. ఈ మేధో మథన సమావేశం లో ద లాస్ట్ మైల్ డెలివరీకి సంబంధించి క్రొత్త క్రొత్త ఆలోచన లు మరియు సూచన లు తప్పక దొరుకుతాయని నేను అనుకొంటున్నాను. ఇవి సుదూర ప్రాంతాల లోని మన సోదరీమణుల మరియు సోదరుల జీవనం లో సకారాత్మక మార్పుల ను తీసుకు రాగలవు. మనం దూరాలోచనల ను చేయాలి, ఆచరణ పైన శ్రద్ధ వహించాలి, సాంకేతిక విజ్ఞానాన్ని గరిష్ఠ స్థాయి లో ఉపయోగించుకోవడం ద్వారా పారదర్శకత్వాని కి పూచీ పడాలి. లబ్ధిదారు నికార్సైన వ్యక్తి గా ఉండాలి, అతని కి లేదా ఆమె కు కలిగే ప్రయోజనాలు సార్థకం కావాలి. ఆ ప్రయోజనాలు ఒక ఫలానా అవధి లోపల వారికి అందాలి. అదే జరిగితే, వారు పేదరికం తో పోరాడడం కోసం ఒక క్రొత్త విశ్వాసాన్ని సంతరించుకోగలుగుతారు. మన పేదల సైన్యం పేదరికాన్ని ఓడించేటంత గా బలమైందై ఉండాలి. మనం పేదల లో శక్తియుక్తుల ను పెంచితే, వారు పేదరికాన్ని వారంతట వారే ఓడించ గలుగుతారు. ప్రతి ఒక్క పేద వ్యక్తి తాను మరియు తన కుటుంబం ఇక ఎంతమాత్రం బీదరికం లో ఉండిపో కూడదు; ప్రభుత్వం యొక్క ప్రయాస ల ద్వారా మేం పురోగమిస్తాం అనే సంకల్పాన్ని చెప్పుకోవాలి. ఈ తరహా వాతావరణాన్ని మనం తప్పక ఏర్పరచాలి. ఈ విషయం లో సంబంధి వర్గాల వారు అందరూ చురుకు గా సహకరిస్తారు అని నేను తలుస్తున్నాను. ఈ రోజు న నిర్వహించుకొంటున్న వెబినార్ సర్వజన హితాయ సర్వజన సుఖాయ’ (‘అందరికీ సంతోషం మరియు సంక్షేమం కోసం’) అనే ఒక సంకల్పాని కి బాట ను పరుస్తుంది అని నేను నమ్ముతున్నాను. మీకు అందరికి శుభాకాంక్షలు. మీకు ఇవే ధన్యవాదాలు.

 

 

అస్వీకరణ: ఇది ప్రధాన మంత్రి ప్రసంగానికి భావానువాదం. సిసలు ఉపన్యాసం హిందీ భాష‌ లో సాగింది.

 

 

***

 



(Release ID: 2016403) Visitor Counter : 25