ప్రధాన మంత్రి కార్యాలయం

జి-20 కి అధ్యక్ష బాధ్యతల ను భారతదేశం వహిస్తుండడం లో భాగం గా ఆర్థిక మంత్రులు మరియు సెంట్రల్ బ్యాంక్ గవర్నర్ లతో జరిగిన మొట్టమొదటి సమావేశం లో ప్రధాన మంత్రి ఇచ్చిన వీడియో సందేశం పూర్తి పాఠం

Posted On: 24 FEB 2023 9:41AM by PIB Hyderabad

శ్రేష్ఠులారా,

జి-20 సభ్యత్వ దేశాల ఆర్థిక మంత్రుల ను మరియు సెంట్రల్ బ్యాంక్ గవర్నర్ లను భారతదేశాని కి నేను హృదయపూర్వకం గా ఆహ్వానిస్తున్నాను. మీతో ఈ సమావేశం జి-20 కి భారతదేశం అధ్యక్ష బాధ్యతల ను నిర్వహిస్తున్న తరుణం లో జరుగుతున్న మొట్ట మొదటి మంత్రుల స్థాయి సంభాషణ కు ప్రతీక గా ఉంది. ఒక ఫలప్రదం కాగల సమావేశం లో మీరు పాలుపంచుకోవాలి అని నేను నా యొక్క శుభాకాంక్షల ను తెలియజేస్తూనే, మీకు ఎదురయ్యే సమస్యలు ఎలాంటివి అనే సంగతి ని సైతం పూర్తి స్థాయి లో ఎరుగుదును. ప్రపంచ దేశాలు గంభీరమైన ఆర్థిక ఇక్కట్టులను ఎదుర్కొంటూ ఉన్నటువంటి ఒక తరుణం లో ప్రపంచ ఆర్థిక వ్యవస్థ కు నాయకత్వ స్థానాల లో మీరు కొనసాగుతూ ఉన్నారు. కోవిడ్ మహమ్మారి ప్రపంచ ఆర్థిక వ్యవస్థ కు వంద సంవత్సరాల లో ఒకసారి ఎదురు పడేటటువంటి కుదుపు ను కలుగ జేసింది. ఎన్నో దేశాలు, ప్రత్యేకించి అభివృద్ధి చెందుతున్న దేశాలు ఇప్పటికీ కూడాను దీని తాలూకు ప్రభావాల కు లోనై సతమతం అవుతున్నాయి. ప్రపంచం లోని వివిధ ప్రాంతాల లో భౌగోళిక పరమైన ఉద్రిక్తత లు, రాజకీయ పరమైన ఉద్రిక్తత లు పెచ్చు పెరుగుతూ ఉండడాన్ని కూడా మనం గమనిస్తున్నాం. ప్రపంచం లోని సరఫరా వ్యవస్థల లో అంతరాయాలు ఏర్పడ్డాయి. ధర లు ఎగబాకుతూ అనేక సమాజాలు ఇబ్బందుల పాలవుతున్నాయి. ఆహార భద్రత మరియు శక్తి పరమైన భద్రత ప్రపంచం లో అనేక దేశాల లో ప్రధానమైన ఆందోళన కారకాలు గా మారాయి. అనేక దేశాల లో తల కు మించిన అప్పు ల సమస్య తలెత్తింది. అంతర్జాతీయ ఆర్థిక సహాయ సంస్థ ల పట్ల నమ్మకం తగ్గింది. దీనికి కొంతవరకు ఆయా సంస్థ లు తమ ను తాము సంస్కరించుకోవడం లో వెనుకపట్టు న ఉండిపోవడం కూడా కారణం. ప్రధానమైన ఆర్థిక వ్యవస్థ ల మరియు ద్రవ్య నిర్వహణ వ్యవస్థ ల సంరక్షకులు గా ఇక మీ మీద ఉన్న భాధ్యత ఏమిటి అంటే మీరు ప్రపంచ ఆర్థిక వ్యవస్థ లో స్థిరత్వాన్ని, విశ్వాసాన్ని మరియు అభివృద్ధి ని తిరిగి తీసుకు రావాలి అన్నదే. ఇదేమీ సులభతరం అయినటువంటి కార్యం కాదు.

 

 

ఏమైనా, మీరు భారతదేశ ఆర్థిక వ్యవస్థ యొక్క చైతన్య భరిత స్థితి నుండి ప్రేరణ ను పొందుతారన్న ఆశ నాలో ఉంది. భారతదేశం లో వినియోగదారులు మరియు ఉత్పత్తిదారులు భవిష్యత్తు పట్ల విశ్వాసం తోను, ఆశావాదం తోను మెలగుతున్నారు. మీరు ఇదే రకమైన సకారాత్మకమైన స్ఫూర్తి ని ప్రపంచ ఆర్థిక వ్యవస్థ లో నింపగలరన్న ఆశ ను మేం పెట్టుకొన్నాం. మీరు జరిపే చర్చల ను ప్రపంచం లో అత్యంత బలహీన పౌరుల ను గురించి కేంద్రీకృతం చేసి చర్చించాలి అని మీకు నేను విజ్ఞప్తి చేస్తున్నాను. అన్ని వర్గాల ను కలుపుకొని ముందుకు సాగిపోయేటటువంటి కార్యాచరణ ను అనుసరించడం ద్వారా మాత్రమే ప్రపంచ ఆర్థిక నాయకత్వం అన్ని దేశాల యొక్క విశ్వాసాన్ని తిరిగి పొందగలుగుతుంది. జి-20 కి అధ్యక్ష బాధ్యతల ను వహిస్తున్నటువంటి మా దేశం ఎంచుకొన్న ఇతివృత్తం సైతం ఒక భూమి, ఒక కుటుంబం, ఒక భవిష్యత్తు’’ అనేటటువంటి సమ్మిళిత దృష్టి కోణాన్ని ప్రోత్సహిస్తోంది.

 

 

శ్రేష్ఠులారా,

ప్రపంచ జనాభా 8 బిలియన్ ను అధిగమించిన వేళ, సుస్థిర అభివృద్ధి లక్ష్యాల సాధన తాలూకు పురోగమనం నెమ్మదించినట్లుగా అనిపిస్తోంది. జలవాయు పరివర్తన మరియు అధిక రుణ స్థాయి ల వంటి ప్రపంచ వ్యాప్త సవాళ్ళ ను తట్టుకొని నిలబడడం లో బహుళ పార్శ్విక అభివృద్ధి బ్యాంకుల ను బలపరచేటందుకు మనం అందరం ఉమ్మడి గా కృషి చేయవలసిన అవసరం ఉంది.

 

శ్రేష్ఠులారా,

ఆర్థిక జగతి లో సాంకేతిక విజ్ఞానం పై చేయిని సాధిస్తుండడం అంతకంతకు హెచ్చుతూ పోతున్నది. కరోనా కాలం లో, డిజిటల్ పేమెంట్స్ ఒకరి కి మరొకరు సన్నిహితం గా ఉండ వలసిన అవసరం లేకుండా మరి నిరంతరాయం గా లావాదేవీల ను జరుపుకొనేటటువంటి వీలు ను కల్పించాయి. ఏమైనప్పటికీ, డిజిటల్ ఫైనాన్స్ రంగం లో ఇటీవల చోటుచేసుకొన్న కొన్ని నూతన ఆవిష్కరణ ల తో అస్థిరత్వం మరియు దుర్వినియోగం వంటి అపాయాలు కూడా ఉన్నాయి సుమా. సాంకేతిక విజ్ఞానం తాలూకు శక్తి ని మంచి చేయడం కోసం ఏ విధం గా ఉపయోగించవచ్చో మీరు అన్వేషిస్తూనే తత్సంబంధి అపాయాల ను నియంత్రించేందుకు కొన్ని ప్రమాణాల ను కూడా ను తయారు చేస్తారు అని నేను ఆశిస్తున్నాను. భారతదేశాని కి ఎదురైన అనుభవం ఒక ఆదర్శం గా మారవచ్చును. గత కొన్నేళ్ళ లో, మేం ఒక అత్యధిక సురక్షిత తో కూడుకొన్నటువంటి, అత్యధికం గా నమ్మదగినటువంటి మరియు అత్యంత కుశలమైనటువంటి పబ్లిక్ డిజిటల్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ ను తయారు చేశాం. మా డిజిటల్ పేమెంట్స్ ఇకోసిస్టమ్ ను ఒక స్వేచ్ఛాయుక్తమైన సార్వజనిక హితం లక్ష్యం తో అభివృద్ధి పరచడమైంది. ఇది భారతదేశం లో పరిపాలన ను, అందరికీ సేవల అందుబాటు ను, జీవన సౌలభ్యాన్ని మౌలికం గా బోలెడంత గా మార్చివేసింది. మీరు భారతదేశ సాంకేతిక విజ్ఞాన రంగ రాజధాని అనే ప్రసిద్ధిని గాంచినటువంటి బెంగళూరు నగరం లో సమావేశాన్ని నిర్వహించుకొంటున్నారు, మీరు భారతదేశం లో వినియోగదారులు డిజిటల్ పేమెంట్స్ ను ఏ విధం గా అక్కున చేర్చుకొన్నదీ స్వయం గా చూసి తెలుసుకోవచ్చును. నిజానికి, మేం జి-20 కి అధ్యక్షత వహించిన కాలం లో ఒక క్రొత్త వ్యవస్థ ను తీర్చిదిద్దాం. ఈ ప్రణాళిక మా యొక్క జి-20 అతిథుల కు భారతదేశం ఆవిష్కరించినటువంటి పథప్రదర్శక డిజిటల్ పేమెంట్స్ ప్లాట్ ఫార్మ్ ‘యుపిఐ’ ని వినియోగించుకొనేందుకు అవకాశాన్ని ఇస్తోంది. మీరు దీనిని వినియోగించారా అంటే దీనిని వాడడం ఎంత సులభమో అవగాహన చేసుకొంటారు. అప్పుడు భారతదేశం లో వినియోగదారులు దీనిని ఇంత స్వేచ్ఛ గా ఎందుకు స్వీకరంచారో మీరు అర్థం చేసుకోగలుగుతారు. యుపిఐ వంటి ఉదాహరణ లు అనేక ఇతర దేశాల కు కూడాను ఆదర్శం గా నిరూపణ కావచ్చును. మా అనుభవాన్ని ప్రపంచానికి వెల్లడించడం మాకు ఆనందదాయకం కాగలదు. మరి, జి-20 దీనికి ఒక మాధ్యం అవుతుంది.

 

 

శ్రేష్ఠులారా,

ఈ ముఖ్యమైనటువంటి సమావేశం లో మీరు అందరు పాలుపంచుకొన్నందుకు మరొక్కసారి మీకు నేను ధన్యవాదాల ను పలుకుతున్నాను. మీ యొక్క చర్చ లు సఫలం కావాలి మరియు సార్థకం కావాలి అంటూ మీకు శుభాకాంక్షల ను తెలియ జేస్తున్నాను.

 

 

 

**

 



(Release ID: 2016335) Visitor Counter : 24