ప్రధాన మంత్రి కార్యాలయం

ఫ్రాన్స్అధ్యక్షుడు శ్రీ ఇమేనుయెల్ మేక్రోన్ కు స్వాగతం పలికిన ప్రధాన మంత్రి

Posted On: 25 JAN 2024 10:41PM by PIB Hyderabad

ఫ్రాన్స్ అధ్యక్షుడు శ్రీ ఇమేనుయెల్ మేక్రోన్ కు ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఈ రోజు న స్వాగతం పలికారు.

 

రేపటి రోజున జరుగనున్న మా గణతంత్ర దినోత్సవాల లో ఆయన పాలుపంచుకోనుండడం మాకు ఎంతో గర్వకారణమైన విషయం అని ప్రధాన మంత్రి అన్నారు.

 

ఎక్స్ మాధ్యం లో ఒక సందేశాన్ని ప్రధాన మంత్రి నమోదు చేస్తూ, ఆ సందేశం లో -

‘‘నా మిత్రుడు శ్రీ ఇమేనుయెల్ మేక్రోన్, మీకు భారతదేశం లోకి ఇదే స్వాగతం.

అధ్యక్షుడు శ్రీ మేక్రోన్ భారతదేశం లో తన పర్యటన ను సంపన్న సంస్కృతి ని, వారసత్వాన్ని మరియు ప్రతిభావంతులు అయిన ప్రజల నిలయం అయినటువంటి రాజస్థాన్ లోని జయ్ పుర్ నుండి మొదలుపెడుతున్నందుకు నేను సంతోషం గా ఉన్నాను.

 

ఆయన రేపటి రోజు న, అంటే జనవరి 26వ తేదీ నాడు, దిల్లీ లో జరుగనున్న మా గణతంత్ర దినోత్సవాల లో పాలుపంచుకోనుండడం అనేది ఎంతో గర్వకారణమైనటువంటి అంశం. ఆయన హాజరు మన దేశాల మధ్య సంబంధాల ను బలపరచడం ఒక్కటే కాకుండా మైత్రి ని మరియు సహకారాన్ని కలిగివున్న మన ఉమ్మడి చరిత్ర కు మహత్వపూర్ణమైన అధ్యాయాన్ని కూడా జోడిస్తోంది.’’ అని పేర్కొన్నారు.

 



(Release ID: 2015974) Visitor Counter : 57