నూతన మరియు పునరుత్పాదక శక్తి మంత్రిత్వ శాఖ
azadi ka amrit mahotsav

గ్రీన్ హైడ్రోజన్ ను ప్రోత్సహించడానికి అమలు చేయాల్సిన వ్యాపార నమూనాలు, నిబంధనలు, మౌలిక సదుపాయాలపై చర్చించిన ఇంటర్నేషనల్ పార్టనర్‌షిప్ ఫర్ హైడ్రోజన్ అండ్ ఫ్యూయల్ సెల్స్ ఇన్ ది ఎకానమీ 41వ స్థాయి సమావేశం యూరోపియన్ హైడ్రోజన్ వీక్‌లో 42 వ ఐపిహెచ్ఈ సమావేశాన్ని నిర్వహించనున్న యూరోపియన్ కమిషన్

Posted On: 21 MAR 2024 10:53AM by PIB Hyderabad

ఇంటర్నేషనల్ పార్టనర్‌షిప్ ఫర్ హైడ్రోజన్ అండ్ ఫ్యూయల్ సెల్స్  ఇన్ ది ఎకానమీ (ఐపిహెచ్) 41వ స్థాయి సమావేశం  ఈ నెల 18న న్యూ ఢిల్లీలో ప్రారంభమయ్యింది. భారతదేశం ఆతిధ్యం ఇస్తున్న సమావేశం 22 వ తేదీ వరకు జరుగుతుంది. సమావేశంలో భాగంగా 2024 మార్చి 20న వివిధ అంశాలపై చర్చలు జరిపింది. 

 

సమావేశంలో  ఆస్ట్రియా, చిలీ, ఫ్రాన్స్, యూరోపియన్ కమిషన్, జపాన్, జర్మనీ, నెదర్లాండ్స్,యూఏఈ, యూకే, అమెరికా, సింగపూర్, దక్షిణ కొరియా తో సహా వివిధ దేశాలకు చెందిన ప్రతినిధులు పాల్గొన్నారు. హైడ్రోజన్ వినియోగాన్ని ఎక్కువ చేయడానికి తమ దేశాలు అమలు చేస్తున్న పరిశోధన, అభివృద్ధి,  కీలక విధాన పరిణామాలు, కార్యక్రమాలను ప్రతినిధులు సమావేశంలో వివరించారు.తమ దేశాల జాతీయ  హైడ్రోజన్ విధానం, హైడ్రోజన్ ఉత్పత్తి, నిల్వ,   రవాణా అంశాలకు సంబంధించి అమలు జరుగుతున్న  పరిశోధన, అభివృద్ధి కార్యక్రమాలు; డిమాండ్ ,మౌలిక సదుపాయాల అభివృద్ధి,మానవ వనరుల అభివృద్ధి తదితర అంశాలను వివిధ దేశాల ప్రతినిధులు సమావేశం దృష్టికి తీసుకు వచ్చారు. 

హైడ్రోజన్ రవాణా, ఉత్పత్తి,  నిల్వ కోసం అమలు చేయాల్సిన  వ్యాపార నమూనాలు, అంతర్జాతీయ సహకారం, ఆర్థిక రంగాల్లో భాగస్వామ్యాలు, విధానం, నిబంధనలు, బలమైన హైడ్రోజన్ ఆర్థిక వ్యవస్థను రూపొందించడానికి అవసరమైన  స్థిరమైన వాణిజ్య, ఆర్థిక నమూనాలు తదితర అంశాలు సమావేశంలో చర్చకు వచ్చాయి.  కమిటీ చర్చించింది.  

నియంత్రణ వ్యవస్థ, ఉద్గార పొదుపులు గుర్తించే పద్ధతి,  హైడ్రోజన్ రంగానికి అవసరమైన  మౌలిక సదుపాయాలు, మార్కెట్ అవకాశాలు,  హైడ్రోజన్ బ్యాంకులు, దిగుమతి-ఎగుమతి కారిడార్‌లపై కూడా ప్రతినిధులు చర్చించారు. ప్రజలకు  అవగాహన కల్పించడం, సులభతర వ్యాపార నిర్వహణ,  అధిక సామర్థ్యం తో తక్కువ ఖర్చుతో  విధానాలు అమలు చేయడం కూడా సమావేశంలో చర్చకు వచ్చాయి. 

40వ స్టీరింగ్ కమిటీ నిర్ణయాలు, చర్యలను కూడా కమిటీ సమీక్షించింది.  ఐపిహెచ్ సభ్యత్వంపై కూడా చర్చించారు. గ్లోబల్ సౌత్‌లోని దేశాలతో సహా అంతర్జాతీయ సమాజం విస్తృత భాగస్వామ్యాన్ని నిర్ధారించడానికి సభ్యత్వాన్ని ప్రోత్సహించాలని సమావేశం నిర్ణయించింది. 

ఈ ఏడాది  నవంబర్‌లో జరగనున్న  యూరోపియన్ హైడ్రోజన్ వీక్  సందర్భంగా యూరోపియన్ కమిషన్ ఆధ్వర్యంలో  42వ స్టీరింగ్ కమిటీ సమావేశం నిర్వహించాలని నిర్ణయించారు. 

ప్రాధాన్యతా ప్రాతిపదికన ఆర్థిక వ్యవస్థలోని అన్ని రంగాల్లో గ్రీన్ హైడ్రోజన్ విస్తరణను వేగవంతం చేయడానికి  చర్యలు అమలు చేయాలని  కమిటీ చైర్ సభ్య దేశాలకు సూచించారు.

ఇది కూడా చదవండి:

 

 రెండో రోజు సమావేశాలు ముగిసిన  తర్వాత ఐపిహెచ్ ప్రతినిధుల కోసం సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించారు. 

 

 

****


(Release ID: 2015944) Visitor Counter : 254