సమాచార, ప్రసార మంత్రిత్వ శాఖ

ఐటీ రూల్స్ 2021 ప్రకారం పిఐబి ఫ్యాక్ట్‌ చెక్‌ యూనిట్‌ను నోటిఫై చేసిన ప్రభుత్వం

Posted On: 20 MAR 2024 8:39PM by PIB Hyderabad


సమాచార మరియు ప్రసార మంత్రిత్వ శాఖ (ఎంఐబి)కి చెందిన ప్రెస్ ఇన్ఫర్మేషన్ బ్యూరో (పిఐబి) ఆధ్వర్యంలో ఉన్న ఫాక్ట్ చెక్ యూనిట్ (ఎఫ్‌సియు)ని కేంద్ర ప్రభుత్వ వాస్తవ తనిఖీ యూనిట్‌గా భారత ప్రభుత్వం ఈరోజు నోటిఫై చేసింది.

ఈరోజు విడుదల చేసిన గెజిట్ నోటిఫికేషన్‌లో ఎలక్ట్రానిక్స్ మరియు ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ మంత్రిత్వ శాఖ (ఎంఇఐటివై) సమాచార సాంకేతికత (v) సబ్‌రూల్‌(1) (మధ్యవర్తి మార్గదర్శకాలు మరియు డిజిటల్ మీడియా ఎథిక్స్ కోడ్) రూల్స్, 2021 ప్రకారం పిఐబికు చెందిన ఎఫ్‌సియుని నోటిఫై చేసింది. ఎంఐబి మరియు ఎంఇఐటివై సోషల్‌మీడియాలో తప్పుడు వార్తలను అరికట్టడానికి ఉమ్మడిగా పనిచేస్తాయి.

పిఐబి ఆధ్వర్యంలో ఫ్యాక్ట్‌ చెక్‌ యూనిట్‌  ఫేక్ న్యూస్ మరియు తప్పుడు సమాచారాన్ని సృష్టికర్తలు మరియు వ్యాప్తి చేసేవారిని నిరోధించే లక్ష్యంతో నవంబర్ 2019లో స్థాపించబడింది. ఇది భారత ప్రభుత్వానికి సంబంధించిన అనుమానాస్పద మరియు సందేహాస్పద సమాచారాన్ని నివేదించడానికి ప్రజలకు సులభమైన మార్గాన్ని కూడా అందిస్తుంది.

ప్రభుత్వ విధానాలు, కార్యక్రమాలు మరియు పథకాలపై తప్పుడు సమాచారాన్ని స్వయంగా లేదా ఫిర్యాదుల ద్వారా సూచించడానికి ఎఫ్‌సియు తప్పనిసరి. ఎఫ్‌సియు తప్పుడు సమాచార ప్రచారాలను చురుకుగా పర్యవేక్షిస్తుంది, గుర్తిస్తుంది మరియు కౌంటర్ చేస్తుంది. ప్రభుత్వం గురించి తప్పుడు సమాచారం తక్షణమే బహిర్గతం చేయబడిందని మరియు సరిదిద్దబడుతుందని నిర్ధారిస్తుంది.

పౌరులు వాట్సప్‌ (+918799711259), ఇమెయిల్ (pibfactcheck[at]gmail[dot]com), ట్విట్టర్‌ (@PIBFactCheck) మరియు పిఐబి వెబ్‌సైట్ ( https://factcheck.pib.gov.in/) ద్వారా పిఐబి ఫ్యాక్ట్‌ చెక్‌ యూనిట్‌ను చేరుకోవచ్చు. ఫాక్ట్ చెక్ యూనిట్ యొక్క వాట్సాప్ హాట్‌లైన్ నంబర్ అనుమానాస్పద సందేశాన్ని ఫార్వార్డ్ చేయడానికి క సులభమైన మార్గం.

వైకల్యం ఉన్న వ్యక్తులు కూడా వాస్తవ తనిఖీల సౌలభ్యాన్ని నిర్ధారించడానికి పిఐబి ఫ్యాక్ట్ చెక్ యూనిట్ చర్యలు తీసుకుంది. సోషల్ మీడియాలో ఇమేజ్‌లు ప్రధాన భాగం కాబట్టి కంటెంట్ విశ్వవ్యాప్తంగా ఉండేలా చూసేందుకు "ప్రత్యామ్నాయ టెక్ట్స్‌"ని అందించడం చాలా అవసరం. అందువల్ల పిఐబి ఫాక్ట్ చెక్ యూనిట్ తన ట్విట్టర్, ఫేస్‌బుక్ మరియు ఇన్‌స్టాగ్రామ్ హ్యాండిల్‌లో ప్రచారం చేయబడిన అన్ని పోస్ట్‌లతో పాటు ప్రత్యామ్నాయ టెక్ట్స్‌ను అందిస్తుంది.

 

****


(Release ID: 2015875) Visitor Counter : 119