మంత్రిమండలి

ఆహార భద్రత రంగం లో భారతదేశాని కి మరియు భూటాన్ కుమధ్య ఒప్పందం పై సంతకాలు చేసేందుకు ఆమోదాన్ని తెలియజేసిన మంత్రిమండలి

Posted On: 13 MAR 2024 3:28PM by PIB Hyderabad

ఆహార భద్రత రంగం లో సహకారాని కి సంబంధించి రాయల్ గవర్నమెంట్ ఆఫ్ భూటాన్ ఆరోగ్య మంత్రిత్వ శాఖ ఆధ్వర్యం లో పని చేస్తున్న భూటాన్ ఫూడ్ ఎండ్ డ్రగ్ ఆథారిటి (బిఎఫ్‌డిఎ) కి మరియు ఫూడ్ సేఫ్టీ ఎండ్ స్టాండర్డ్స్ ఆథారిటి ఆఫ్ ఇండియా (ఎఫ్ఎస్ఎస్ఎఐ) కి మధ్య ఒక ఒప్పందం పై సంతకాల కు ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ అధ్యక్షత న జరిగిన కేంద్ర మంత్రివర్గ సమావేశం ఆమోదాన్ని తెలియ జేసింది.

 

 

రాయల్ గవర్నమెంట్ ఆఫ్ భూటాన్ యొక్క ఆరోగ్య మంత్రిత్వ శాఖ ఆధ్వర్యం లో పని చేస్తున్న భూటాన్ ఫూడ్ ఎండ్ డ్రగ్ ఆథారిటి (బిఎఫ్ డిఎ) కు మరియు భారతదేశం ప్రభుత్వం యొక్క ఆరోగ్యం & కుటుంబ సంక్షేమం మంత్రిత్వ శాఖ లోని ఫూడ్ సేఫ్టీ ఎండ్ స్టాండర్డ్స్ ఆథారిటి ఆఫ్ ఇండియా (ఎఫ్ఎస్ఎస్ఎఐ) కి మధ్య ఈ ఒప్పందం పై సంతకాలు కావడం వల్ల రెండు ఇరుగు పొరుగు దేశాల మధ్య వ్యాపారాని కి మార్గం సుగమం అవుతుంది. భారతదేశం నుండి ఉత్పత్తుల ను ఎగుమతుల కోసం ఎఫ్ఎస్ఎస్ఎఐ నిర్ధారించిన మేరకు షరతుల పాలన కు సంబంధించిన రుజువు గా ఒక ఆరోగ్య ధ్రువ పత్రాన్ని బిఎఫ్‌డిఎ జారీ చేస్తుంది. ఇది వ్యాపార నిర్వహణ లో సౌలభ్యాన్ని పెంపొందింప చేయడం తో పాటు ఇరు పక్షాల కు నియమ పాలన తాలూకు ఖర్చు తగ్గుతుంది.

 

***



(Release ID: 2014330) Visitor Counter : 76