ప్రధాన మంత్రి కార్యాలయం
జర్మనీ కి చెందిన గాయని కైసేండ్రా మాయీ స్పిట్‌మైన్ గారి తో భేటీ అయిన ప్రధాన మంత్రి
Posted On:
27 FEB 2024 10:23PM by PIB Hyderabad
జర్మనీ కి చెందిన గాయని కైసేండ్రా మాయీ స్పిట్‌మైన్ గారు తో మరియు ఆమె తల్లి గారు తో ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఈ రోజు న పల్లదమ్ లో సమావేశమయ్యారు.
ప్రధాన మంత్రి తన ‘మన్ కీ బాత్’ (‘మనసు లో మాట’) కార్యక్రమాల లో భాగం అయిన ఒక కార్యక్రమం లో కైసేండ్రా మాయీ స్పిట్‌మైన్ గారి ని గురించి ప్రస్తావించారు. ఆమె పాటలు పాడతారు; ప్రత్యేకించి అనేక భారతీయ భాషల లో భక్తి గీతాల ను ఆమె గానం చేస్తున్నారు.
ఈ రోజు న ఆమె ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ సమక్షం లో ‘అచ్యుతమ్ కేశవమ్’ అనే ఒక పాట ను మరియు ఒక తమిళ గీతాన్ని పాడారు.
ఎక్స్ మాధ్యం లో ప్రధాన మంత్రి ఒక సందేశాన్ని నమోదు చేస్తూ, ఆ సందేశం లో -
‘‘భారతదేశం అంటే కైసేండ్రా మాయీ స్పిట్‌మైన్ గారి కి ఉన్న ప్రేమ మార్గదర్శక ప్రాయమైనటువంటిది గా ఉంది; ఈ సంగతి ని మా సంభాషణ సాగిన క్రమం లో నేను గమనించాను. ఆమె భావి ప్రయాసల లోనూ రాణించాలి అని నేను ఆకాంక్షిస్తున్నాను.’’ అని పేర్కొన్నారు.
***
DS
(Release ID: 2009956)
Visitor Counter : 112
Read this release in:
Kannada
,
English
,
Urdu
,
Marathi
,
Hindi
,
Bengali
,
Manipuri
,
Assamese
,
Punjabi
,
Gujarati
,
Odia
,
Tamil
,
Malayalam