ప్రధాన మంత్రి కార్యాలయం
azadi ka amrit mahotsav

గుజరాత్ లోని రాజ్ కోట్ లో రూ.48,100 కోట్లకు పైగా విలువైన పలు అభివృద్ధి ప్రాజెక్టులను జాతికి అంకితం, శంకుస్థాపన చేసిన ప్రధానమంత్రి


రాజ్ కోట్, బటిండా, రాయబరేలీ, కళ్యాణి, మంగళగిరిలో ఐదు ఎయిమ్స్ లను అంకితం

23 రాష్ట్రాలు/కేంద్రపాలిత ప్రాంతాల్లో రూ.11,500 కోట్లకు పైగా విలువైన 200కు పైగా హెల్త్ కేర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్రాజెక్టులకు శంకుస్థాపన, జాతికి అంకితం చేసిన ప్రధాని

పుణెలో 'నిసర్గ్ గ్రామ్' పేరుతో నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ నేచురోపతికి ప్రారంభోత్సవం

సుమారు రూ.2280 కోట్ల విలువైన ఎంప్లాయీస్ స్టేట్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ కు చెందిన 21 ప్రాజెక్టులను ప్రారంభించి జాతికి అంకితం చేసిన ప్రధాని

వివిధ పునరుత్పాదక ఇంధన ప్రాజెక్టులకు శంకుస్థాపన

రూ.9 వేల కోట్లకు పైగా విలువైన ముంద్రా-పానిపట్ పైప్లైన్ ప్రాజెక్టుకు శంకుస్థాపన

మేము ప్రభుత్వాన్ని ఢిల్లీ నుంచి బయటకు తీసుకువెడుతున్నాము: ఢిల్లీ వెలుపల ముఖ్యమైన జాతీయ కార్యక్రమాలను నిర్వహించే ధోరణి పెరుగుతోంది:

"న్యూ ఇండియా శరవేగంగా లక్ష్యాలు పూర్తి చేస్తోంది"

“తరాల మార్పును నేను చూస్తున్నాను; కానీ మోదీపై అభిమానం ఏ వయసు పరిమితి కైనా మించి ఉంది:

“మునిగిన ద్వారక దర్శనంతో వికాస్, విరాసత్ కోసం నా సంకల్పం కొత్త బలాన్ని సంతరించుకుంది. వికసిత్ భా

Posted On: 25 FEB 2024 6:40PM by PIB Hyderabad

 

 

ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఆదివారం గుజరాత్ లోని రాజ్ కోట్ లో రూ.48,100 కోట్ల కు పైగా విలువ చేసే పలు అభివృద్ధి పథకాలకు జాతికి అంకితం, శంకుస్థాపన చేశారు. ఆరోగ్యం, రోడ్డు, రైలు, ఇంధనం, పెట్రోలియం- సహజవాయువు, పర్యాటకం వంటి ముఖ్యమైన రంగాలకు సంబంధించి ప్రాజెక్టులు  ఉన్నాయి.

ప్రధానమంత్రి మాట్లాడుతూ, కార్యక్రమానికి వర్చువల్ గా హాజరైన గౌరవ గవర్నర్లు, రాష్ట్రాల ముఖ్యమంత్రులు, పార్లమెంటు, శాసనసభల సభ్యులు, కేంద్రమంత్రులకు అభినందనలు తెలిపారు. అన్ని కీలక అభివృద్ధి కార్యక్రమాలను ఒక్క న్యూఢిల్లీలోనే నిర్వహించే రోజులను ప్రధాన మంత్రి గుర్తు చేశారు. ప్రస్తుత ప్రభుత్వం ధోరణిని మార్చివేసి భారత ప్రభుత్వాన్ని దేశంలోని ప్రతి మూలకు తీసుకెళ్లిందని చెప్పారు. "రాజ్ కోట్ లో రోజు జరిగిన కార్యక్రమం ఇందుకు నమ్మదగిన  నిదర్శనం" అని ప్రధాని మోదీ అన్నారు, ఇది కొత్త సంప్రదాయాన్ని ముందుకు తీసుకువెళుతున్నందున దేశంలోని అనేక ప్రదేశాలలో అంకితం, శంకుస్థాపన కార్యక్రమం జరుగుతోందని చెప్పారు. ఐఐటీ భిలాయ్, ఐఐటీ తిరుపతి, ఐఐఐటీ కర్నూలు, ఐఐఎం బుద్ధగయ, ఐఐఎం జమ్మూ, ఐఐఎం విశాఖపట్నం, ఐఐఎస్ కాన్పూర్ విద్యా సంస్థలను జమ్మూలో జరిగిన కార్యక్రమం నుంచి ప్రారంభించిన విషయాన్ని గుర్తు చేసిన ప్రధాని మోదీ రోజు ఎయిమ్స్ రాజ్ కోట్, ఎయిమ్స్ రాయ్ బరేలీ, ఎయిమ్స్ మంగళగిరి, ఎయిమ్స్ బటిండా, ఎయిమ్స్ కళ్యాణిలను ప్రారంభించారు. "అభివృద్ధి చెందుతున్న భారతదేశం వేగంగా పనులు పూర్తి చేస్తోంది, ప్రత్యేకించి మీరు 5 ఎఐఐఎంఎస్ లను చూసినప్పుడు", అని శ్రీ మోదీ అన్నారు.

రాజ్ కోట్ తో తనకున్న సుదీర్ఘ అనుబంధాన్ని గుర్తు చేసుకున్న ప్రధాన మంత్రి 22 ఏళ్ల క్రితం తాను ఇక్కడి నుంచి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యానని చెప్పారు. 22 ఏళ్ల క్రితం ఫిబ్రవరి 25 ఎమ్మెల్యేగా ఆయన ప్రమాణ స్వీకారం చేశారు. రాజ్ కోట్ ప్రజల నమ్మకాన్ని నిలబెట్టేందుకు తన వంతు కృషి చేశానని చెప్పారు. "తరాలు మారడం నిజమే, అయినా మోదీ పట్ల అభిమానం వయస్సు జైనా పరిమితికి మించి ఉంది" అని కృతజ్ఞతా పూర్వకంగా ప్రధాన మంత్రి అన్నారు.

నేటి కార్యక్రమం ఆలస్యమైనందుకు క్షమాపణలు చెబుతూ, అంతకుముందు ద్వారకాలో సుదర్శన్ సేతుతో సహా పలు అభివృద్ధి పనులకు ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనలు చేసిన కార్యక్రమాల గురించి సభికులకు వివరించారు. మునిగిపోయిన పవిత్ర నగరమైన ద్వారకాలో ప్రార్థన చేసిన తన దివ్యానుభూతిని మరోసారి వివరించారు. "పురావస్తు, మత గ్రంథాలను చదవడం వల్ల ద్వారకా గురించి ఆశ్చర్యం కలుగుతుంది. రోజు నాకు పవిత్ర దృశ్యాన్ని నా కళ్ళతో చూసే అవకాశం లభించింది. ఇంకా నేను పవిత్ర అవశేషాలను తాకగలిగాను. అక్కడ ప్రార్థనలు చేసి మోర్-పంక్ చేశాను. అనుభూతిని వర్ణించడం కష్టం" అని ప్రధాన మంత్రి తన అనుభవం నుండి ఇంకా వదలని భావోద్వేగాలను వ్యక్తపరిచారు.  " లోతుల్లో, భారతదేశ  అద్భుతమైన గతం గురించి నేను ఆలోచిస్తున్నాను. నేను బయటకు వచ్చినప్పుడు, భగవాన్ కృష్ణుడి ఆశీర్వాదంతో పాటు ద్వారక ప్రేరణతో బయటకు వచ్చాను" అని ప్రధాన మంత్రి పేర్కొన్నారు. 'వికాస్ ఔర్ విరాసత్' అనే నా సంకల్పానికి ఇది కొత్త బలాన్ని, శక్తిని ఇచ్చింది. వికసిత్ భారత్ కోసం నా లక్ష్యంతో ఒక దివ్య విశ్వాసం ముడిపడి ఉంది" అని ఆయన అన్నారు.

రూ.48,000 కోట్లకు పైగా విలువైన అభివృద్ధి ప్రాజెక్టులను ప్రస్తావించిన ప్రధాన మంత్రి, గుజరాత్ తీరం నుంచి హర్యానాలోని పానిపట్ లోని ఇండియన్ ఆయిల్ రిఫైనరీకి ముడిచమురును రవాణా చేయడానికి ఏర్పాటు చేసిన ముంద్రా-పానిపట్ పైప్ లైన్ గురించి ప్రస్తావించారు. రోడ్లు, రైల్వేలు, విద్యుత్, ఆరోగ్యం, విద్యకు సంబంధించిన ప్రాజెక్టులను ప్రస్తావించారు. "అంతర్జాతీయ విమానాశ్రయ ప్రారంభోత్సవం తరువాత రాజ్ కోట్ ఎయిమ్స్ ఇప్పుడు జాతికి అంకితం చేయబడింది" అని చెబుతూ రాజ్ కోట్సౌరాష్ట్ర ప్రజలకు ప్రధాన మంత్రి అభినందనలు తెలిపారు. రోజు ఎయిమ్స్ ను ప్రారంభిస్తున్న అన్ని నగరాల ప్రజలకు ఆయన శుభాకాంక్షలు తెలిపారు.

" రోజు రాజ్ కోట్ కు మాత్రమే కాకుండా యావత్ దేశానికి ఒక చారిత్రాత్మక సందర్భం" అని ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ అన్నారు, రాజ్ కోట్ రోజు వికసిత్ భారత్ లో ఆశించిన స్థాయిలో ఆరోగ్య సౌకర్యాలను అందిస్తుంది అని పేర్కొన్నారు. దేశానికి స్వాతంత్య్రం వచ్చిన 50 ఏళ్లలో ఒకే ఒక ఎయిమ్స్ ఉండేదని, అది కూడా ఢిల్లీలోనేనని గుర్తు చేశారు. స్వాతంత్య్రం వచ్చిన ఏడు దశాబ్దాల కాలంలో కేవలం ఏడు ఎయిమ్స్ లు మాత్రమే ప్రారంభించినప్పటికీ వాటిలో కొన్నింటిని పూర్తి చేయలేకపోయారని ఆయన అన్నారు. గత 10 రోజుల్లో దేశం ఏడు కొత్త ఎయిమ్స్ లకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలను చూసిందని, గత 70 ఏళ్లలో చేసిన దానికంటే ప్రస్తుత ప్రభుత్వం వేగంగా పనులు పూర్తి చేసిందని, తద్వారా దేశాన్ని అభివృద్ధి పథంలో నడిపించిందని ప్రధాన మంత్రి పేర్కొన్నారు. మెడికల్ కాలేజీలు, మల్టీ స్పెషాలిటీ ఆస్పత్రుల శాటిలైట్ సెంటర్లు, ఆందోళనకర వ్యాధుల చికిత్స కోసం కేంద్రాలు సహా 200కు పైగా ఆరోగ్య మౌలిక సదుపాయాల ప్రాజెక్టులకు శంకుస్థాపన చేసి అంకితం చేసినట్లు తెలిపారు.

'మోదీ కీ గ్యారంటీ అంటే హామీ నెరవేరే గ్యారంటీ' అనే వాగ్దానాన్ని పునరుద్ఘాటించిన ప్రధాన మంత్రి రాజ్ కోట్ ఎయిమ్స్ కు తాను మూడేళ్ల క్రితం శంకుస్థాపన చేశానని, నేడు ఆ హామీ నెరవేరిందని అన్నారు. అదేవిధంగా పంజాబ్ కు ఎయిమ్స్ కు గ్యారంటీ ఇచ్చి శంకుస్థాపన, ప్రారంభోత్సవం ప్రధాని మోదీ చేశారు. రాయబరేలీ, మంగళగిరి, కళ్యాణి, రేవారీ ఎయిమ్స్ లలో ఇదే జరిగింది. గత పదేళ్లలో వివిధ రాష్ట్రాల్లో 10 కొత్త ఎయిమ్స్ లు మంజూరయ్యాయి. 'ఇతరుల ఆకాంక్షలు ఎక్కడ ముగుస్తాయో అక్కడే మోదీ కీ గ్యారంటీ మొదలవుతుంది' అని ప్రధాని మోదీ అన్నారు.

గడచిన పదేళ్లలో ఆరోగ్య సంరక్షణ వ్యవస్థ, మౌలిక సదుపాయాలు మెరుగుపడటం వల్ల మహమ్మారిని విశ్వసనీయంగా ఎదుర్కోగలిగామని ప్రధాన మంత్రి అన్నారు. ఎయిమ్స్, మెడికల్ కాలేజీలు, క్రిటికల్ కేర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్  అనూహ్యంగా విస్తరిస్తున్న విషయాన్ని ఆయన ప్రస్తావించారు. గ్రామాల్లో చిన్న చిన్న జబ్బులకు 1.5 లక్షలకు పైగా ఆయుష్మాన్ ఆరోగ్య కేంద్రాలు మందిరాలు ఉన్నాయి. 2014లో 387గా ఉన్న వైద్యకళాశాలల సంఖ్య నేడు 706కు చేరుకుందని, ఎంబీబీఎస్ సీట్లు పదేళ్ల క్రితం ఉన్న 50 వేల నుంచి లక్షకు పైగా పెరిగాయని, ఎంబీబీఎస్ సీట్లు, పోస్టు గ్రాడ్యుయేట్ సీట్లు 2014లో 30 వేల నుంచి 70 వేలకు పెరిగాయని ప్రధాని చెప్పారు. స్వాతంత్య్రం వచ్చినప్పటి నుంచి మొత్తం 70 ఏళ్లలో ఉన్న వైద్యుల సంఖ్య కంటే రాబోయే కొన్నేళ్లలో ఎక్కువ మంది వైద్యులు కళాశాలల నుంచి బయటకు వస్తారని చెప్పారు. దేశంలో రూ.64 వేల కోట్ల విలువైన ఆయుష్మాన్ భారత్ హెల్త్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ మిషన్ కొనసాగుతోంది. నేటి ప్రారంభ, శంకుస్థాపన లో మెడికల్ కాలేజీలు, టీబీ హాస్పిటల్ అండ్ రీసెర్చ్ సెంటర్, పీజీఐ శాటిలైట్ సెంటర్, క్రిటికల్ కేర్ బ్లాక్స్, డజన్ల కొద్దీ ఈఎస్ఐసి ఆస్పత్రులు కూడా ఉన్నాయి. "వ్యాధి నివారణతో పాటు దానితో పోరాడే సామర్థ్యానికి ప్రభుత్వం ప్రాధాన్యత ఇస్తుంది" అని ప్రధాన మంత్రి అన్నారు, పోషకాహారం, యోగా, ఆయుష్ , పరిశుభ్రతకు ప్రాధాన్యత ఇస్తున్నట్టు చెప్పారు. సాంప్రదాయ భారతీయ వైద్యం , ఆధునిక వైద్యం రెండింటినీ ప్రోత్సహించడానికి నిబద్ధతను నొక్కిచెప్పిన ఆయన యోగా , ప్రకృతి వైద్యానికి సంబంధించిన రెండు పెద్ద ఆసుపత్రులు పరిశోధనా కేంద్రాలను రోజు మహారాష్ట్ర హర్యానాలో ప్రారంభిస్తున్న ఉదాహరణలను ఇచ్చారు. సంప్రదాయ వైద్య విధానానికి సంబంధించిన డబ్ల్యూహెచ్ గ్లోబల్ సెంటర్ ను కూడా గుజరాత్ లో నిర్మిస్తున్నట్లు ఆయన పేర్కొన్నారు.

 

పేద, మధ్యతరగతి ప్రజలు మెరుగైన వైద్య సేవలు పొందడంతో పాటు డబ్బు ఆదా చేయడంలో సహాయపడటానికి, లక్ష కోట్ల రూపాయలను ఆదా చేయడానికి సహాయపడిన ఆయుష్మాన్ భారత్ యోజన, 80% తగ్గింపుతో మందులు అందించే జన ఔషధి కేంద్రాలపై ప్రధాన మంత్రి దృష్టి సారించారు, తద్వారా రూ .30 వేల కోట్లు ఆదా అయ్యాయి. ఉజ్వల యోజన కింద పేదలు రూ.70,000 కోట్లకు పైగా ఆదా చేశారని, మొబైల్ డేటా తక్కువ ఖర్చుతో పౌరులు ప్రతి నెలా రూ.4,000 ఆదా చేశారని, పన్ను సంబంధిత సంస్కరణల వల్ల పన్ను చెల్లింపుదారులు సుమారు రూ.2.5 లక్షల కోట్లు ఆదా చేశారని తెలిపారు.

విద్యుత్ బిల్లును సున్నాకు తీసుకువచ్చి కుటుంబాలకు ఆదాయాన్ని కల్పించే పీఎం సూర్యఘర్ పథకం గురించి కూడా ప్రధాని వివరించారు. లబ్ధిదారులకు 300 యూనిట్ల ఉచిత విద్యుత్ పోగా మిగిలిన విద్యుత్ ను ప్రభుత్వమే కొనుగోలు చేస్తుంది. కచ్ లో రెండు ప్లాంట్లు వంటి భారీ పవన విద్యుత్, సోలార్ ప్రాజెక్టులకు నేడు శంకుస్థాపనలు జరిగాయని ఆయన పేర్కొన్నారు.

రాజ్ కోట్ కార్మికులు, ఔత్సాహిక పారిశ్రామికవేత్తలు, చేతివృత్తుల నగరమని పేర్కొన్న ప్రధాన మంత్రి, లక్షలాది మంది విశ్వకర్మలకు లబ్ధి చేకూర్చే రూ.13,000 కోట్ల విలువైన పీఎం విశ్వకర్మ యోజన గురించి ప్రస్తావించారు. గుజరాత్ లో ఇప్పటికే 20 వేల మంది విశ్వకర్మలకు శిక్షణ ఇచ్చామని, ప్రతి విశ్వకర్మకు రూ.15 వేల సాయం అందిందని తెలిపారు. పీఎం స్వనిధి పథకంలో వీధి వ్యాపారులకు రూ.10,000 కోట్ల సాయం అందించామని తెలిపారు. గుజరాత్ లోని వీధి వ్యాపారులకు సుమారు రూ.800 కోట్ల మేర సాయం అందింది. ఒక్క రాజ్ కోట్ లోనే 30వేలకు పైగా రుణాలు ఇచ్చామని తెలిపారు.

భారత దేశ ప్రజలకు సాధికారత లభించినప్పుడు వికసిత్ భారత్ కార్యక్రమం బలోపేత మవుతుందని ప్రధాన మంత్రి నొక్కి చెప్పారు. "భారతదేశాన్ని ప్రపంచంలో మూడవ అతిపెద్ద ఆర్థిక సూపర్ పవర్ గా మారుస్తామని మోదీ హామీ ఇచ్చినప్పుడు, అందరికీ ఆరోగ్యం ,  అందరికీ శ్రేయస్సు లక్ష్యంగా ఉంది" అని ప్రధాన మంత్రి ముగించారు.

గుజరాత్ ముఖ్య మంత్రి శ్రీ భూపేంద్ర పటేల్ , కేంద్ర ఆరోగ్య , కుటుంబ సంక్షేమ శాఖ మంత్రి డా.మన్సుఖ్ మాండవీయ, పార్లమెంటు సభ్యుడు శ్రీ సి.ఆర్ .పాటిల్ తదితరులు ఈ కార్య lక్రమంలో పాల్గొన్నారు.

 నేపథ్యం

 దేశంలో తృతీయ ఆరోగ్య సంరక్షణను పటిష్ఠం చేసే దిశలో ఒక ముఖ్యమైన అడుగుగా, రాజ్ కోట్ (గుజరాత్), బతిండా (పంజాబ్), రాయ్ బరేలి, (ఉత్తర ప్రదేశ్), కళ్యాణి (పశ్చిమ బెంగాల్), మంగళగిరి (ఆంధ్రప్రదేశ్) లలో ఐదు ఆల్ ఇండియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ (ఎయిమ్స్)లను ప్రధాన మంత్రి జాతికి అంకితం చేశారు.

ప్రధాన మంత్రి 23 రాష్ట్రాలు/ కేంద్రపాలిత ప్రాంతాల్లో రూ.11,500 కోట్ల కంటే ఎక్కువ విలువ చేసే 200 కి పైగా హెల్త్ కేర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్రాజెక్టులకు శంఖుస్థాపన చేసి జాతికి అంకితం చేశారు.

పుదుచ్చేరిలోని కరైకల్ లో జిప్మర్ వైద్య కళాశాలను, పంజాబ్ లోని సంగ్రూర్ లో పోస్ట్ గ్రాడ్యుయేట్ ఇన్ స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ అండ్ ఎడ్యుకేషనల్ రీసెర్చ్ (పీజీఐఎంఈఆర్ ) కు చెందిన 300 పడకల శాటిలైట్ సెంటర్ ను ప్రధాని అంకితం చేశారు.

పుదుచ్చేరిలోని యానాంలో జిప్మర్ కు చెందిన 90 పడకల మల్టీ స్పెషాలిటీ కన్సల్టింగ్ యూనిట్;   చెన్నైలోని నేషనల్ సెంటర్ ఫర్ ఏజింగ్; బీహార్ లోని పూర్ణియాలో కొత్త ప్రభుత్వ వైద్య కళాశాల; ఐసీఎంఆర్ కు చెందిన రెండు ఫీల్డ్ యూనిట్లు;  కేరళ అలప్పుజలోని నేషనల్ ఇన్ స్టిట్యూట్ ఆఫ్ వైరాలజీ కేరళ యూనిట్;  నేషనల్ ఇన్ స్టిట్యూట్ ఆఫ్ రీసెర్చ్ ఇన్ ట్యూబర్ క్యులోసిస్ (ఎన్ ఐఆర్ టీ): న్యూ కాంపోజిట్ టీబీ రీసెర్చ్ ఫెసిలిటీ, తిరువళ్లూరు, తమిళనాడు ను న ఆయన ప్రారంభించారు. పంజాబ్ లోని ఫిరోజ్ పూర్ లో పిజిఐఎంఇఆర్ కు చెందిన 100 పడకల శాటిలైట్ సెంటర్;  ఢిల్లీలోని ఆర్ఎంఎల్ ఆసుపత్రిలో కొత్త మెడికల్ కాలేజీ భవనం; ఇంఫాల్ లోని రిమ్స్ లో క్రిటికల్ కేర్ బ్లాక్; జార్ఖండ్లోని కొడెర్మా, దుమ్కాలోని నర్సింగ్ కాలేజీలతో సహా వివిధ ఆరోగ్య ప్రాజెక్టులకు ప్రధాన మంత్రి శంకుస్థాపన చేశారు. వీటితో పాటు నేషనల్ హెల్త్ మిషన్, ప్రైమ్ మినిస్టర్-ఆయుష్మాన్ భారత్ హెల్త్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ మిషన్ (పీఎం-ఏబీఎం) కింద 115 ప్రాజెక్టులను ప్రధాని ప్రారంభించి, జాతికి అంకితం చేసి, శంకుస్థాపన చేశారు. వీటిలో పీఎం-ఏబీఐఎం కింద 78 ప్రాజెక్టులు (క్రిటికల్ కేర్ బ్లాక్స్ 50 యూనిట్లు, ఇంటిగ్రేటెడ్ పబ్లిక్ హెల్త్ ల్యాబ్స్ 15 యూనిట్లు, బ్లాక్ పబ్లిక్ హెల్త్ యూనిట్ల 13 యూనిట్లు);  నేషనల్ హెల్త్ మిషన్ కింద కమ్యూనిటీ హెల్త్ సెంటర్, ప్రైమరీ హెల్త్ కేర్ సెంటర్, మోడల్ హాస్పిటల్, ట్రాన్సిట్ హాస్టల్ వంటి వివిధ ప్రాజెక్టులకు చెందిన 30 యూనిట్లు ఉన్నాయి.

 

పుణెలో 'నిసర్గ్ గ్రామ్' పేరుతో ఏర్పాటు చేసిన నేషనల్ ఇన్ స్టిట్యూట్ ఆఫ్ నేచురోపతిని కూడా ప్రధాని ప్రారంభించారు. ఇందులో నేచురోపతి మెడికల్ కాలేజీతో పాటు మల్టీ డిసిప్లినరీ రీసెర్చ్ అండ్ ఎక్స్టెన్షన్ సెంటర్ తో కూడిన 250 పడకల ఆసుపత్రి ఉంది. హర్యానాలోని ఝజ్జర్ లో సెంట్రల్ రీసెర్చ్ ఇన్ స్టిట్యూట్ ఆఫ్ యోగా అండ్ నేచురోపతిని ప్రారంభించారు. ఇందులో అత్యున్నత స్థాయి యోగా, నేచురోపతి రీసెర్చ్ సౌకర్యాలు ఉంటాయి.

ఈ సందర్భంగా ప్రధాన మంత్రి సుమారు రూ.2280 కోట్ల విలువైన ఎంప్లాయీస్ స్టేట్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ (ఇఎస్ఐసి)కి చెందిన 21 ప్రాజెక్టుల ను ప్రారంభించి జాతికి అంకితం చేశారు. పాట్నా (బీహార్), అల్వార్ (రాజస్థాన్)లలో 2 వైద్య కళాశాలలు , ఆసుపత్రులు; కోర్బా (ఛత్తీస్ గఢ్), ఉదయ్ పూర్ (రాజస్థాన్), ఆదిత్యపూర్ (జార్ఖండ్), ఫుల్వారీ షరీఫ్ (బీహార్), తిరుప్పూర్ (తమిళనాడు), కాకినాడ (ఆంధ్రప్రదేశ్), ఛత్తీస్ గఢ్ లోని రాయ్ గఢ్, భిలాయ్ లలో 8 ఆసుపత్రులు; రాజస్థాన్ లోని నీమ్రానా, అబూ రోడ్ , భిల్వారా వద్ద మూడు డిస్పెన్సరీలు,  రాజస్థాన్ లోని అల్వార్, బెహ్రోర్, సీతాపుర, ఉత్తరాఖండ్ లోని సెలాకి, ఉత్తరప్రదేశ్ లోని గోరఖ్ పూర్, కేరళలోని కొరట్టి, నవాయికుళం, ఆంధ్రప్రదేశ్ లోని పైడిభీమవరంలో 8 చోట్ల ఇఎస్ఐ డిస్పెన్సరీలను ప్రధాని ప్రారంభించారు.

 

ఈ ప్రాంతంలో పునరుత్పాదక ఇంధన ఉత్పత్తిని పెంచే చర్యల్లో భాగంగా, 300 మెగావాట్ల భుజ్-2 సోలార్ పవర్ ప్రాజెక్టుతో సహా వివిధ పునరుత్పాదక ఇంధన ప్రాజెక్టులకు ప్రధాన మంత్రి శంకుస్థాపన చేశారు. గ్రిడ్ కనెక్టెడ్ 600 మెగావాట్ల సోలార్ పీవీ పవర్ ప్రాజెక్టు; ఖావ్డా సోలార్ పవర్ ప్రాజెక్ట్; 200 మెగావాట్ల దయాపూర్-2 పవన విద్యుత్ ప్రాజెక్టు ఇందులో ఉన్నాయి.

రూ.9 వేల కోట్లకు పైగా విలువ చేసే ముంద్రా-పానిపట్ పైప్ లైన్ ప్రాజెక్టుకు ప్రధాని శంకుస్థాపన చేశారు. 8.4 ఎంఎంటిపిఎ స్థాపిత సామర్థ్యంతో 1194 కిలోమీటర్ల పొడవైన ముంద్రా - పానిపట్ పైప్ లైన్ ను గుజరాత్ తీరంలోని ముంద్రా నుంచి హర్యానాలోని పానిపట్ వద్ద ఉన్న ఇండియన్ ఆయిల్ రిఫైనరీకి ముడి చమురును తరలించడానికి ఉద్దేశించారు.

ప్రాంతంలో రోడ్డు, రైలు మౌలిక సదుపాయాలను బలోపేతం చేస్తూ, సురేంద్రనగర్ - రాజ్ కోట్ రైలు మార్గం డబ్లింగ్ కుపాత ఎన్ హెచ్ -8 లోని భావ్ నగర్- తలాజా (ప్యాకేజీ-1) నాలుగు లేన్లు; ఎన్ హెచ్ -751లోని పిప్లి-భావ్ నగర్ (ప్యాకేజీ-1) లను అంకితం చేశారు. ఎన్ హెచ్ -27లో సంతాల్ పూర్ సెక్షన్ వరకు సమాఖియాలీ ఆరు లేన్ల రహదారి నిర్మాణానికి శంకుస్థాపన చేశారు.


(Release ID: 2009117) Visitor Counter : 135