ప్రధాన మంత్రి కార్యాలయం
azadi ka amrit mahotsav

సుమారు రూ. 41,000 కోట్ల విలువైన 2000 పైగా రైల్వే మౌలిక సదుపాయాల ప్రాజెక్టులకు ఫిబ్రవరి 26న శంకుస్థాపన, ప్రారంభోత్సవం, జాతికి అంకితం చేయనున్న ప్రధానమంత్రి.


అమృత్‌ భారత్‌ స్టేషన్‌ పథకం కింద రూ. 19,000 కోట్ల వ్యయంతో 553 రైల్వే స్టేషన్‌ల పునరాభివృద్ధికి శంకుస్థాపన చేయనున్న ప్రధాన మంత్రి.

తిరిగి అభివృద్ధి చేసిన గోమతి నగర్ రైల్వే స్టేషన్‌ను కూడా ప్రారంభించనున్న ప్రధాన మంత్రి

రూ..21.520 కోట్ల వ్యయంతో కూడిన
తిరిగి అభివృద్ధి చేసిన గోమతి నగర్ రైల్వే స్టేషన్‌ను కూడా ప్రారంభించనున్న ప్రధాన మంత్రి

రూ..21.520 కోట్ల వ్యయంతో కూడిన 1500 రోడ్ ఓవర్ బ్రిడ్జ్ లు, అండర్ పాస్ లకు కూడా ప్రధానమంత్రి శంకుస్థాపన, ప్రారంభోత్సవం

Posted On: 25 FEB 2024 3:29PM by PIB Hyderabad

ప్ర‌ధాన మంత్రి శ్రీ న‌రేంద్ర మోదీ ఫిబ్రవరి 26న మధ్యాహ్నం 12:30 గంటలకు వీడియో కాన్ఫరెన్సింగ్ ద్వారా రూ.41 వేల‌కు పైగా  విలువైన 2000 రైల్వే అవ‌స్థాప‌న ప్రాజెక్టుల‌కు శంకుస్థాప‌న, ప్రారంభోత్సవం కార్యక్రమంలో పాల్గొనున్నారు. రైల్వే స్టేషన్లలో ప్రపంచ స్థాయి సౌకర్యాలు కల్పించడం అత్యంత ప్రాముఖ్యత అని ప్రధాని తరచుగా నొక్కి చెప్పారు. ఈ ప్ర‌య‌త్నంలో ఒక ప్ర‌ధాన అడుగులో అమృత్ భార‌త్ స్టేష‌న్ ప‌థ‌కం కింద 553 రైల్వే స్టేష‌న్ల పున‌రాభివృద్ధికి ప్ర‌ధాన మంత్రి శంకుస్థాప‌న చేయ‌నున్నారు. 27 రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలలో విస్తరించి ఉన్న ఈ స్టేషన్లను రూ.19,000 కోట్లు ఖర్చుతో అభివృద్ధి చేస్తున్నారు. ఈ స్టేషన్లు నగరం రెండు వైపులా ఏకీకృతం చేస్తూ 'సిటీ సెంటర్స్'గా పనిచేస్తాయి. రూఫ్ ప్లాజా, అందమైన ల్యాండ్‌స్కేపింగ్, ఇంటర్ మోడల్ కనెక్టివిటీ, మెరుగైన ఆధునిక ముఖభాగం, పిల్లల ఆట స్థలం, కియోస్క్‌లు, ఫుడ్ కోర్ట్‌లు మొదలైన ఆధునిక ప్రయాణీకుల సౌకర్యాలను కలిగి ఉంటాయి. అవి పర్యావరణ అనుకూలమైనవి మరియు దివ్యాంగులకు అనుకూలమైనవిగా పునరాభివృద్ధి చేయబడతాయి. ఈ స్టేషన్ భవనాల రూపకల్పన స్థానిక సంస్కృతి, వారసత్వం, వాస్తుశిల్పం నుండి ప్రేరణ పొందింది. ఇంకా, ప్రధాన మంత్రి ఉత్తరప్రదేశ్‌లోని గోమతి నగర్ స్టేషన్‌ను ప్రారంభిస్తారు. ఇది మొత్తం రూ. 385 కోట్లతో పునర్నిర్మించారు. భవిష్యత్తులో పెరిగే ప్రయాణీకుల రద్దీని తీర్చడానికి, ఈ స్టేషన్‌లో రాక మరియు బయలుదేరే సౌకర్యాలు వేరు చేయబడ్డాయి. ఇది నగరం యొక్క రెండు వైపులా కలుపుతుంది. ఈ కేంద్రీయ ఎయిర్ కండిషన్డ్ స్టేషన్‌లో ఎయిర్‌కోర్స్, రద్దీ లేని సర్క్యులేషన్, ఫుడ్ కోర్ట్‌లు, ఎగువ, దిగువ బేస్‌మెంట్‌లో విస్తారమైన పార్కింగ్ స్థలం వంటి ఆధునిక ప్రయాణీకుల సౌకర్యాలు ఉన్నాయి.

ప్రధాన మంత్రి 1500 రోడ్ ఓవర్ బ్రిడ్జిలు, అండర్‌పాస్‌లకు శంకుస్థాపన, ప్రారంభోత్సవం మరియు జాతికి అంకితం చేస్తారు. 24 రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలలో విస్తరించి ఉన్న ఈ రోడ్ ఓవర్ బ్రిడ్జిలు, అండర్‌పాస్‌లు, మొత్తం వ్యయం దాదాపు రూ. 21,520 కోట్లు. ఈ ప్రాజెక్టులు రద్దీని తగ్గిస్తాయి, భద్రత మరియు కనెక్టివిటీని మెరుగుపరుస్తాయి, రైలు ప్రయాణ సామర్థ్యాన్ని మెరుగుపరుస్తాయి.

 

***


(Release ID: 2009001) Visitor Counter : 91