ప్రధాన మంత్రి కార్యాలయం

సహకార రంగానికి సంబంధించిన పలు కీలక కార్యక్రమాలలో భాగంగా ఫిబ్రవరి 24న ప్రారంభోత్సవం, శంకుస్థాపన చేయనున్న ప్రధాన మంత్రి


11 రాష్ట్రాలలోని 11 పిఏసిఎస్ లలో 'సహకార రంగంలో ప్రపంచంలోనే అతిపెద్ద ధాన్యం నిల్వ ప్రణాళిక' పైలట్ ప్రాజెక్ట్‌ను ప్రారంభించనున్న ప్రధాన మంత్రి

గోడౌన్లు, ఇతర వ్యవసాయ మౌలిక సదుపాయాల నిర్మాణం కోసం దేశవ్యాప్తంగా అదనంగా 500 పిఎసిఎస్‌లకు శంకుస్థాపన చేయనున్న ప్రధాన మంత్రి

దేశవ్యాప్తంగా 18,000 పీఏసీఎస్‌లలో కంప్యూటరీకరణ ప్రాజెక్ట్‌ను ప్రారంభించనున్న ప్రధాని

Posted On: 22 FEB 2024 4:42PM by PIB Hyderabad

దేశంలోని సహకార రంగాన్ని బలోపేతం చేసే ఒక ప్రధాన అడుగులో  భాగంగా, ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ 24 ఫిబ్రవరి, 2024 న న్యూఢిల్లీలోని భారత్ మండపంలో ఉదయం 10:30 గంటలకు సహకార రంగానికి సంబంధించిన బహుళ కీలక కార్యక్రమాలను ప్రారంభించి, శంకుస్థాపన చేస్తారు. 11 రాష్ట్రాల్లోని 11 ప్రాథమిక వ్యవసాయ పరపతి సొసైటీలలో (PACS) చేస్తున్న 'సహకార రంగంలో ప్రపంచంలోనే అతిపెద్ద ధాన్యం నిల్వ ప్రణాళిక' పైలట్ ప్రాజెక్ట్‌ను ప్రధాన మంత్రి ప్రారంభిస్తారు.

ఈ చొరవ కింద గోడౌన్లు, ఇతర వ్యవసాయ మౌలిక సదుపాయాల నిర్మాణం కోసం దేశవ్యాప్తంగా అదనంగా 500 పిఎసిఎస్‌లకు ప్రధాని శంకుస్థాపన చేస్తారు. ఈ చొరవ పిఏసిఎస్ గోడౌన్‌లను ఆహార ధాన్యాల సరఫరా గొలుసుతో సజావుగా ఏకీకృతం చేయడం, ఆహార భద్రతను పటిష్టం చేయడం, నాబార్డ్ సహకారంతో, నేషనల్ కోఆపరేటివ్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ (ఎన్సిడిసి) నేతృత్వంలోని సహకార ప్రయత్నంతో దేశంలో ఆర్థికాభివృద్ధిని పెంపొందించడం లక్ష్యంగా పెట్టుకుంది. ప్రాజెక్ట్‌లో పాల్గొనే పిఏసిఎస్ మౌలిక సదుపాయాల అభివృద్ధిని చేపట్టడానికి సబ్సిడీలు, వడ్డీ రాయితీ ప్రయోజనాలను పొందేందుకు వీలుగా వ్యవసాయ మౌలిక సదుపాయాల నిధి (ఏఐఎఫ్), అగ్రికల్చర్ మార్కెటింగ్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ (ఏఎంఐ) వంటి వివిధ ప్రస్తుత పథకాల కలయిక ద్వారా ఈ చొరవ అమలు అవుతోంది.

సహకార రంగాన్ని పునరుజ్జీవింపజేయడం, చిన్న,  సన్నకారు రైతులకు సాధికారత కల్పించే లక్ష్యంతో "సహకార్ సే సమృద్ధి" అనే ప్రభుత్వ దార్శనికతకు అనుగుణంగా దేశవ్యాప్తంగా 18,000 పిఎసిఎస్‌లలో కంప్యూటరీకరణ ప్రాజెక్ట్‌ను ప్రధాని ప్రారంభిస్తారు.

2,500 కోట్లకు పైగా ఆర్థిక వ్యయంతో స్మారక ప్రాజెక్టు ఆమోదించబడింది. ఈ చొరవలో అన్ని ప్రక్రియలు  పిఎసిఎస్‌లను ఏకీకృత ఎంటర్‌ప్రైజ్ రిసోర్స్ ప్లానింగ్ (ఈఆర్పి) ఆధారిత జాతీయ సాఫ్ట్‌వేర్‌లోకి మార్చడం, నిరంతరాయమైన ఏకీకరణ, కనెక్టివిటీని నిర్ధారిస్తుంది. రాష్ట్ర సహకార బ్యాంకులు, జిల్లా కేంద్ర సహకార బ్యాంకుల ద్వారా ఈ పిఎసిఎస్‌లను నాబార్డ్తో అనుసంధానం చేయడం ద్వారా,  పిఎసిఎస్‌ల కార్యాచరణ సామర్థ్యం, పాలనను మెరుగుపరచడం, తద్వారా కోట్లాది మంది చిన్న,  సన్నకారు రైతులకు ప్రయోజనం చేకూర్చడం ప్రాజెక్ట్ లక్ష్యం. న నాబార్డ్ ఈ ప్రాజెక్ట్ కోసం జాతీయ స్థాయి సాధారణ సాఫ్ట్‌వేర్‌ను అభివృద్ధి చేసింది, ఇది దేశవ్యాప్తంగా ఉన్న  పిఎసిఎస్‌ల విభిన్న అవసరాలకు అనుగుణంగా రూపొందించారు. ఈఆర్పి సాఫ్ట్‌వేర్‌పై 18,000  పిఎసిఎస్‌ల ఆన్‌బోర్డింగ్ పూర్తయింది, ఇది ప్రాజెక్ట్ అమలులో ఒక ముఖ్యమైన మైలురాయిని సూచిస్తుంది.

                                                                                                                 

***



(Release ID: 2008933) Visitor Counter : 56