ప్రధాన మంత్రి కార్యాలయం

కాశీ లోని శివ్‌పుర్-ఫుల్‌వరియా-లహర్‌తారా మార్గాన్ని తనిఖీ చేసిన ప్రధాన మంత్రి

Posted On: 23 FEB 2024 8:39AM by PIB Hyderabad

గుజరాత్ లో పగటి పూట అంతాను అనేక కార్యక్రమాల లో పాలుపంచుకోవలసి వచ్చిన అనంతరం వారాణసీ కి వచ్చి రావడం తోనే ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ గురువారం నాడు రాత్రి పూట సుమారు గా 11 గంటల వేళ లో శివ్‌పుర్-ఫుల్‌వరియా-లహర్‌తారా మార్గాన్ని తనిఖీ చేయడాని కి వెళ్ళారు.

 

ఈ మార్గాన్ని ఇటీవలే ప్రారంభించడమైంది. ఈ మార్గం నగరం లోని దక్షిణ ప్రాంతం, బిహెచ్‌యు, బిఎల్‌డబ్ల్యు మొదలైన చుట్టుప్రక్కల ప్రాంతాల లో నివసిస్తున్న రమారమి అయిదు లక్షల మంది లో విమానాశ్రయం, లఖ్‌నవూ, ఆజమ్‌ గఢ్ మరియు గాజీపుర్ ల వైపు వెళ్ళాలి అనుకొనేటటువంటి వారికి ఎంతో సహాయకారి గా ఉంటోంది.

 

ఈ మార్గాన్ని 360 కోట్ల రూపాయల ఖర్చు తో నిర్మించడమైంది. దీనితో వాహనాల రాక పోకల లో తలెత్తే రద్దీ ని తగ్గించడం లో సాయం లభిస్తోంది. దీనితో బిహెచ్‌యు నుండి విమానాశ్రయం వైపు ప్రయాణించేందుకు పట్టే కాలం 75 నిమిషాల నుండి 45 నిమిషాల కు తగ్గిపోయింది. ఇదే మాదిరి గా, లహర్‌తారా నుండి కచ్‌హరీ మధ్య ప్రయాణాని కి పట్టే కాలం 30 నిమిషాల నుండి 15 నిమిషాల కు తగ్గిపోయింది.

 

వారాణసీ పౌరుల కు జీవన సౌలభ్యాన్ని పెంపొందింప చేసేందుకు ఉద్దేశించినటువంటి ఈ ప్రాజెక్టు ను అమలు పరచడం లో రైల్ వే మంత్రిత్వ శాఖ మరియు రక్షణ మంత్రిత్వ శాఖ లు సహా అనేక మంత్రిత్వ శాఖ లు సమన్వయం తో పని చేశాయి.

 

ప్రధాన మంత్రి ఎక్స్ మాధ్యం లో నమోదు చేసిన ఒక సందేశం లో -

‘‘కాశీ కి చేరుకోగానే, శివ్‌పుర్-ఫుల్‌వరియా-లహర్‌తారా మార్గాన్ని పరిశీలించాను. ఈ ప్రాజెక్టు ను ఇటీవలే ప్రారంభించడమైంది. మరి ఇది నగరం లోని దక్షిణ ప్రాంతం లో ఉంటున్న ప్రజల కు చాలా సహాయకారి గా ఉంటోంది.’’ అని పేర్కొన్నారు.

 

***

DS

 



(Release ID: 2008348) Visitor Counter : 68