పౌర విమానయాన మంత్రిత్వ శాఖ
azadi ka amrit mahotsav

45.8 లక్షలు దాటిన డిజీ యాత్ర యాప్ వినియోగదార్ల సంఖ్య


1.45 కోట్లకు చేరిన డిజీ యాత్ర ప్రయాణీకుల సంఖ్య

మార్చి 31, 2024 నాటికి చెన్నై విమానాశ్రయంలో డిజీ యాత్ర సేవలు ప్రారంభం

Posted On: 21 FEB 2024 2:53PM by PIB Hyderabad

చరవాణుల్లో డిజీ యాత్ర అప్లికేషన్‌ను ఇన్‌స్టాల్ చేసుకున్న ప్రయాణికుల సంఖ్య ఈ ఏడాది ఫిబ్రవరి నాటికి 45.8 లక్షలకు పెరిగింది. ఈ ఏడాది జనవరి 01 నాటికి ఉన్న 38 లక్షల నుంచి 20.5% పెరిగింది.

2024 ఫిబ్రవరి 20 నాటికి డిజీ యాత్ర అప్లికేషన్ వినియోగదార్ల సంఖ్య:

క్ర.సం.

వేదిక

01/01/2024 నాటికి

10/02/2024 నాటికి

పెరుగుదల %

i

ఆండ్రాయిడ్‌

17.3 Lakhs

21.2 Lakhs

~22.5%

ii

ఐవోఎస్‌

20.7 Lakhs

24.6 Lakhs

~19%

 

మొత్తం

38.0 Lakhs

45.8 Lakhs

~20.5%

 

తొలుత, 2022 డిసెంబర్‌లో న్యూదిల్లీ, బెంగళూరు, వారణాసి విమానాశ్రయాల్లో డిజీ యాత్రను ప్రారంభించారు. ఆ తర్వాత మరో 10 విమానాశ్రయాల్లో ప్రారంభించారు.

డిజీ యాత్ర ప్రారంభం నుంచి విమానాశ్రయాల్లో ప్రయాణీకుల సంఖ్య ఇది:

విమానాశ్రయం

31.12.2023 వరకు డిజీ యాత్ర ప్రయాణీకుల   మొత్తం సంఖ్య

11.02.2024 వరకు డిజీ యాత్ర ప్రయాణీకుల మొత్తం సంఖ్య

దిల్లీ

34,24,937

42,62,167

బెంగళూరు

30,19,149

38,21,829

వారణాసి

7,41,514

8,54,145

హైదరాబాద్

10,61,638

14,92,776

కోల్‌కతా

15,85,350

20,34,544

పుణె

83,42,63

10,68,112

విజయవాడ

2,03,672

2,46,440

కోచి

58,976

1,15,335

ముంబై

1,42,667

2,84,469

అహ్మదాబాద్

1,12,069

1,71,226

లక్‌నవూ

27,421

48,691

గువాహటి

28,655

53,379

జయపుర్‌

20,577

42,178

మొత్తం

1,12,60,888

1,44,95,291

 

ఐటీ ఆధారిత వేలిముద్రల సాంకేతికతను ఉపయోగిస్తూ పౌర విమానయాన మంత్రిత్వ శాఖ తీసుకొచ్చిన డిజీ యాత్ర చొరవ, విమానాశ్రయ ప్రవేశ ద్వారాల వద్ద ప్రయాణీకుల సాఫీగా వెళ్లేందుకు అనుమతిస్తుంది.

***


(Release ID: 2007866) Visitor Counter : 135