ప్రధాన మంత్రి కార్యాలయం
తమిళ నాడు లోని విరుధునగర్ జిల్లా లో గల ఒక బాణసంచా తయారీకర్మాగారం లో దుర్ఘటన కారణం గా అనేక మంది చనిపోవడం పట్ల సంతాపాన్ని తెలిపిన ప్రధానమంత్రి
పిఎమ్ఎన్ఆర్ఎఫ్ నుండి పరిహారాన్ని ఇవ్వడం జరుగుతుంది అనిఆయన ప్రకటించారు
प्रविष्टि तिथि:
17 FEB 2024 7:20PM by PIB Hyderabad
తమిళ నాడు లోని విరుధునగర్ జిల్లా లో ఉన్న ఓ బాణసంచా తయారీ కర్మాగారం లో దుర్ఘటన కారణం గా అనేక మంది చనిపోయినట్లు తెలిసి ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ సంతాపాన్ని వ్యక్తం చేశారు. ఈ దుర్ఘటన లో గాయపడ్డ వ్యక్తులు త్వరగా కోలుకోవాలి అని కూడా శ్రీ నరేంద్ర మోదీ ఆకాంక్షించారు.
ఈ దుర్ఘటన లో ప్రాణాల ను కోల్పోయిన ప్రతి ఒక్క వ్యక్కి తాలూకు దగ్గరి సంబంధికుల కు 2 లక్షల రూపాయల వంతున మరియు ఈ దుర్ఘటన లో గాయపడ్డ వ్యక్తుల కు 50,000 రూపాయల వంతున పిఎమ్ఎన్ఆర్ఎఫ్ నుండి పరిహారాన్ని ఇవ్వడం జరుగుతుంది అని ప్రధాన మంత్రి ప్రకటించారు.
ప్రధాన మంత్రి కార్యాలయం ఎక్స్ మాధ్యం లో నమోదు చేసిన ఒక సందేశం లో -
‘‘విరుధునగర్ జిల్లా లో గల ఓ బాణసంచా తయారీ కర్మాగారం లో జరిగిన దుర్ఘటన ను గురించి తెలిసింది. అది చాలా దు:ఖదాయకమైనటువంటి సమాచారం. ఈ కఠిన సమయం లో విషాదభరితం గా ప్రాణాల ను కోల్పోయిన వ్యక్తుల యొక్క ప్రియతముల కు కలిగినటువంటి శోకం లో నేను సైతం పాలుపంచుకొంటున్నాను. ఈ దుర్ఘటన లో గాయపడ్డ వ్యక్తులు త్వరగాను మరియు పూర్తిగాను కోలుకోవాలి అని నేను కోరుకొంటున్నాను.
మృతి చెందిన ప్రతి ఒక్క వ్యక్తి యొక్క దగ్గరి సంబంధికుల కు పిఎమ్ఎన్ఆర్ఎఫ్ నుండి 2 లక్షల రూపాయల వంతున పరిహారాన్ని ఇవ్వడం జరుగుతుంది. ఇదే దుర్ఘటన లో గాయపడ్డ వ్యక్తుల కు 50,000 రూపాయల వంతున ఇవ్వడం జరుగుతుంది: ప్రధాన మంత్రి @narendramodi’’ అని తెలిపింది.
********
DS/ST
(रिलीज़ आईडी: 2007050)
आगंतुक पटल : 137
इस विज्ञप्ति को इन भाषाओं में पढ़ें:
English
,
Urdu
,
Marathi
,
हिन्दी
,
Manipuri
,
Bengali
,
Assamese
,
Punjabi
,
Gujarati
,
Odia
,
Tamil
,
Kannada
,
Malayalam