ప్రధాన మంత్రి కార్యాలయం
‘వికసిత్ భారత్, వికసిత్ రాజస్థాన్’ కార్యక్రమం లో ప్రసంగించిన ప్రధాన మంత్రి
రాజస్థాన్ లో 17,000 కోట్ల రూపాయల కు పైగా విలువైన అనేక అభివృద్ధిప్రాజెక్టుల ను ప్రారంభించడం, దేశ ప్రజల కు అంకితం చేయడం లతో పాటు శంకుస్థాపన చేసిన ప్రధాన మంత్రి
రాజస్థాన్ లో 5,000 కోట్ల రూపాయల కు పైగా విలువ కలిగిన వివిధ జాతీయ రాజమార్గ పథకాల ను ఆయనప్రారంభించారు
సుమారు 2300 కోట్ల రూపాయల విలువ కలిగిన ఎనిమిది ముఖ్యమైన రైల్ వే ప్రాజెక్టుల ను దేశప్రజల కు అంకితం చేయడం తో పాటు శంకుస్థాపన చేశారు
‘ఖాతీపురా రైల్ వే స్టేశన్’ ను దేశ ప్రజల కు అంకితం చేశారు
దాదాపు గా 5300 కోట్ల రూపాయల విలువైన ముఖ్యమైన సోలర్ ప్రాజెక్టుల కు శంకుస్థాపన తో పాటు వాటిని దేశ ప్రజలకు అంకితం చేశారు
దేశ ప్రజల కు 2100 కోట్ల రూపాయల కు పైగా విలువైన విద్యుత్తు ప్రసార రంగ సంబంధి ప్రాజెక్టుల ను అంకితంచేశారు
జల్ జీవన్ మిశన్ లో భాగం గా ఉన్న ప్రాజెక్టులు సహా రమారమి 2400 కోట్ల రూపాయల విలువ కలిగిన అనేక ప్రాజెక్టుల కుశంకుస్థాపన చేశారు
జోధ్‌పుర్ లో ఇండియన్ ఆయిల్ యొక్క ఎల్‌పిజి బాట్లింగ్ ప్లాంటు ను దేశ ప్రజల కు అంకితం చేశారు
‘‘ఒక వికసిత్ భారత్ను నిర్మించడం లో వికసిత్ రాజస్థాన్ ది కీలకమైన పాత్ర’’
‘‘గతం తాలూకు నిరాశ ను వదలిపెట్టి విశ్వాసం తో ముందంజ వేసేందుకు భారతదేశాని కి ఒక అవకాశం ఉన్నది’’
‘‘వికసిత్ భారత్ నుగురించి నేను మాట్లాడుతూ ఉన్నానంటే, అది కేవలం ఒక పదం కాని, అది ఒక భావోద్వేగం కాని కాదు; అది ప్రతి ఒక్క కుటుంబ జీవనాన్ని సమృద్ధం చేసేందుకు ఉద్దేశించిన ఒక ప్రచార ఉద్యమం. వికసిత్ భారత్ ఎటువంటి ప్రచార కార్యక్రమం అంటే అది పేదరికాన్నితొలగించి, నాణ్యత కలిగిన ఉద్యోగాల ను కల్పించడం తో పాటుగా దేశం లో ఆధునికసదుపాయాల ను కూడా ఏర్పరచేటటువంటిది’’
‘‘సౌర శక్తి నుండివిద్యుత్తు ను ఉత్పత్తి చేసే విషయం లో ప్రపంచం లో అగ్రగాములు గా ఉన్న దేశాల లో ఒకదేశం గా ప్రస్తుతం భారతదేశం నిలచింది’’
‘‘యువత, మహిళలు, రైతులు మరియు పేదలు.. ఇవే మా దృష్టి లో నాలుగు అతి పెద్ద కులాలు గా ఉన్నాయి; ఈ వర్గాల కు సాధికారిత ను కల్పించడాని కి మోదీఇచ్చినటువంటి హామీల ను డబల్ ఇంజన్ ప్రభుత్వం నెరవేర్చుతూ ఉండడం వల్ల నేనుసంతోషిస్తున్నాను’
‘‘ప్రస్తుతంమొదటిసారి గా వోటు హక్కును వినియోగించుకొనే వారి లో వికసిత్ భారత్ తాలూకు దృష్టి కోణం ఇమిడి ఉంది’’
Posted On:
16 FEB 2024 12:15PM by PIB Hyderabad
‘వికసిత్ భారత్, వికసిత్ రాజస్థాన్’ కార్యక్రమం ఈ రోజు న జరగగా, ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ వీడియో కాన్ఫరెన్సింగ్ మాధ్యం ద్వారా ఆ కార్యక్రమం లో పాల్గొని సభ ను ఉద్దేశించి ప్రసంగించారు. 17,000 కోట్ల రూపాయల కు పైగా విలువ కలిగిన అనేక అభివృద్ధి ప్రాజెక్టుల ను ప్రధాన మంత్రి ప్రారంభించారు; వాటి ని దేశ ప్రజల కు అంకితమిచ్చి, కొన్ని ప్రాజెక్టుల కు శంకుస్థాపన కూడా చేశారు. ఈ ప్రాజెక్టు లు.. రహదారులు, రైలు మార్గాలు, సౌర శక్తి, విద్యుత్తు ప్రసారం, త్రాగునీరు మరియు పెట్రోలియమ్, ఇంకా ప్రాకృతిక వాయువు లు సహా అనేక ముఖ్యమైన రంగాల కు చెందినవి.
సభ ను ఉద్దేశించి ప్రధాన మంత్రి ప్రసంగిస్తూ, ‘వికసిత్ భారత్, వికసిత్ రాజస్థాన్’ కార్యక్రమం తో రాజస్థాన్ లో అన్ని నియోజకవర్గాల నుండి లక్షల సంఖ్య లో ప్రజలు పాలుపంచుకోవడాన్ని గమనించి, ఈ కార్యక్రమం లో వారు పాలుపంచుకొంటున్నందుకు గాను వారి కి ధన్యవాదాల ను తెలియ జేశారు. లబ్ధిదారులు అందరినీ ఒక చోటు కు తీసుకొని రావడం కోసం సాంకేతిక విజ్ఞానాన్ని ఎంతో చక్కగా వినియోగించుకొన్నందుకు రాజస్థాన్ ముఖ్యమంత్రి కి కూడా ప్రధాన మంత్రి అభినందనల ను తెలియ జేశారు. రాజస్థాన్ యొక్క ప్రజల లోని సద్గుణాల ను ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ ప్రముఖం గా ప్రస్తావిస్తూ, ఫ్రాన్స్ అధ్యక్షుడు శ్రీ ఇమ్మేన్యుయెల్ మేక్రోన్ రాజస్థాన్ కు కొన్ని రోజుల క్రితం విచ్చేసినప్పుడు ప్రజలు ఆయన కు స్వాగతం పలికిన తీరు ను గుర్తు కు తీసుకు వచ్చారు. ఆనాటి సాదర ఆహ్వానం భారతదేశం లో పలు ప్రాంతాల లో మారుమ్రోగుతుండడం ఒక్కటే కాకుండా దాని ప్రతిధ్వనులు ఫ్రాన్స్ లో కూడా వినిపించాయన్నారు. రాజస్థాన్ లో విధాన సభ కు ఎన్నికలు జరిగిన కాలం లో ఈ రాష్ట్రాన్ని తాను సందర్శించిన సందర్భం లో ప్రజలు ఇచ్చిన ఆశీర్వాదాల ను కూడా ప్రధాన మంత్రి గుర్తు కు తెచ్చుకున్నారు. ‘మోదీ కీ గ్యారంటీ’ (‘మోదీ హామీ’) పట్ల నమ్మకాన్ని పునరుద్ధరించడం తో డబల్ ఇంజన్ ప్రభుత్వం ఏర్పడింది అని ఆయన అన్నారు. రహదారులు, రైలు మార్గాలు, సౌర శక్తి, విద్యుత్తు ప్రసారం, త్రాగునీరు మరియు పెట్రోలియమ్, ఇంకా ప్రాకృతిక వాయువు రంగాల లో 17,000 కోట్ల రూపాయల విలువైన అభివృద్ధి ప్రాజెక్టు లు ఈ రోజు న కార్యరూపం దాలుస్తున్నందుకు రాజస్థాన్ ప్రజల కు అభినందనల ను ప్రధాన మంత్రి తెలియ జేశారు. ఈ ప్రాజెక్టు లు రాష్ట్రం లో లెక్కలేనన్ని ఉద్యోగ అవకాశాల ను అందిస్తాయన్నారు.
‘యహీ సమయ్ హై - సహీ సమయ్ హై’ (‘ఇదే సమయం - సరైన సమయం’) అంటూ ఎర్ర కోట యొక్క బురుజుల మీది నుండి ప్రధాన మంత్రి తాను ఇచ్చిన పిలుపు ను మళ్ళీ ప్రస్తావిస్తూ, ప్రస్తుత కాలం ఒక బంగారు కాలం గా ఉంది అన్నారు. ఇప్పుడు భారతదేశం మునుపటి దశాబ్దాల యొక్క నిరుత్సాహాన్ని వీడి, పూర్ణ విశ్వాసం తో ముందుకు సాగిపోవచ్చు అని పేర్కొన్నారు. 2014 వ సంవత్సరాని కంటే పూర్వం కుంభకోణాలు, అభద్రత మరియు ఉగ్రవాదం తాలూకు చర్చ జరిగేదని, దీనికి భిన్నం గా ప్రస్తుతం ‘వికసిత్ భారత్ మరియు వికసిత్ రాజస్థాన్’ తాలూకు లక్ష్యం పై మేం శ్రద్ధ తీసుకొంటున్నాం అని ఆయన అన్నారు. ‘‘ఈ రోజు న మనం పెద్ద సంకల్పాల ను తీసుకొంటున్నాం, పెద్ద కలల ను కంటున్నాం, మరి మనం వాటిని నెరవేర్చుకోవడం కోసం మనల ను మనం అంకితం చేసుకొంటున్నాం’’ అని ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ అన్నారు. ‘‘నేను వికసిత్ భారత్ ను గురించి ఎప్పుడైతే మాట్లాడానో అది కేవలం ఒక మాటో, ఒక ఉద్వేగమో కాదు, అది ప్రతి ఒక్క కుటుంబం యొక్క జీవనాన్ని సమృద్ధం చేయడం కోసం చేపట్టినటువంటి ఒక ప్రచార ఉద్యమం’’ అని ఆయన అన్నారు. వికసిత్ భారత్ అనేది పేదరికాన్ని నిర్మూలించి, నాణ్యమైన ఉద్యోగాల ను కల్పించి మరి అలాగే దేశం లో ఆధునాతన సదుపాయాల ను నిర్మించడం కోసం చేపట్టిన ప్రచార ఉద్యమం అని ఆయన వివరించారు. ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ నిన్నటి రోజు న తాను విదేశీ సందర్శన నుండి తిరిగి వచ్చినట్లు చెప్తూ, ఆ సందర్భం లో ప్రపంచ నాయకుల తో తాను జరిపిన సమావేశాల ను గురించి ప్రస్తావించారు. భారతదేశం పెద్దవైన కలల ను కనే స్థితి లో ఉందని, మరి ఆయా కలల ను పండించుకోగలదని ప్రపంచ నేత లు అంగీకరిస్తున్నారని ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ అన్నారు.
‘‘వికసిత్ భారత్ యొక్క అభివృద్ధి కి ఒక వికసిత్ రాజస్థాన్ ను ఆవిష్కరించడం తప్పనిసరి’’ అని ప్రధాన మంత్రి వ్యాఖ్యానించారు. రైలు మార్గాలు, రహదారి మార్గాలు, విద్యుత్తు మరియు నీరు ల వంటి అత్యవసర రంగాల లో శరవేగం గా అభివృద్ధి చోటుచేసుకోవలసిన అవసరం ఎంతైనా ఉంది అని ప్రధాన మంత్రి అన్నారు. ఆ తరహా రంగాల అభివృద్ధి వల్ల రైతుల కు, పశు సంరక్షుల కు, పరిశ్రమల కు మరియు పర్యటన రంగాని కి తదితర రంగాల కు భారీ గా లబ్ధి కలుగుతుంది; అంతేకాకుండా, అదే జరిగిన నాడు రాష్ట్రాని కి క్రొత్త పెట్టుబడులు మరియు ఉద్యోగ అవకాశాలు అందివస్తాయి అని ఆయన అన్నారు. ఈ సంవత్సరం లో యూనియన్ బడ్జెటు లో మౌలిక సదుపాయాల అభివృద్ధి కి గాను రికార్డు స్థాయిలో 11 లక్షల కోట్ల రూపాయల ను కేటాయించడమైందని, అది ఏ మునుపటి ప్రభుత్వం కేటాయించిన దానితో పోల్చి చూసినప్పటికీ ఆరు రెట్లు అధికం గా ఉంది అని ప్రధాన మంత్రి అన్నారు. ఈ వ్యయం సిమెంటు పరిశ్రమల కు, పింగాణి వస్తువుల పరిశ్రమల కు, ఇంకా రాళ్ళ పరిశ్రమల కు ఎంతో ప్రయోజనాన్ని చేకూర్చుతుంది అని ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ నొక్కిచెప్పారు.
రాజస్థాన్ లో గడచిన 10 సంవత్సరాల లో గ్రామీణ ప్రాంతాల రహదారులు, హైవేస్, ఇంకా ఎక్స్‌ప్రెస్ వేస్ లలో ఇదివరకు ఎన్నడూ ఎరుగనంతటి పెట్టుబడి ని పెట్టడం జరిగింది అని ప్రధాన మంత్రి అన్నారు. ప్రస్తుతం రాజస్థాను ను విశాలమైన హైవే స్ మాధ్యం ద్వారా గుజరాత్, మహారాష్ట్ర ల లోని కోస్తా తీర ప్రాంతాల మొదలుకొని పంజాబ్ వరకు సంధానించడం జరుగుతున్నది అని ఆయన అన్నారు. ఈ రోజు న చేపట్టుకొంటున్న ప్రాజెక్టు లు కోటా, ఉదయ్‌పుర్, టోంక్, సవాయీ మాధోపుర్, బూందీ, అజ్ మేర్, భీల్‌వాడా, మరియు చిత్తౌడ్ గఢ్ లలో కనెక్టివిటీ ని మెరుగు పరుస్తాయి. ఈ రహదారులు దిల్లీ కి, హరియాణా కు, గుజరాత్ కు మరియు మహారాష్ట్ర కు మెరుగైన కనెక్టివిటీ కి సైతం పూచీ పడతాయి.
నేటి కార్యక్రమాల లోని మరికొన్ని అంశాలు అయిన విద్యుతీకరణ ను గురించి రైలు మార్గాల కు కొత్త రూపు రేఖల ను సంతరించడం మరియు మరమ్మతు పనుల ను చేపట్టడం వంటి గురించి ప్రధాన మంత్రి మాట్లాడుతూ, బాందీకుయీ-ఆగ్ రా ఫోర్ట్ రైలు మార్గం డబ్లింగు తో మెహందీపుర్ బాలాజీ మరియు ఆగ్ రా లను చేరుకోవడం సులభతరం అవుతుంది అని వివరించారు. అదే విధం గా మరిన్ని రైళ్ళు నడిపేందుకు వీలు ను ఖాతీపురా (జయ్ పుర్) స్టేశన్ కల్పిస్తుంది అని ఆయన అన్నారు.
పౌరులు వారి సొంత ఇళ్ళ లో సౌర విద్యుత్తు ను ఉత్పత్తి చేయడాని కి అనువుగా ప్రభుత్వం ప్రయత్నాలు చేస్తుంది అని స్పష్టం చేస్తూ, అదే కాలం లో అదనపు విద్యుత్తును విక్రయించడం ద్వారా ఆదాయార్జన కు కూడా అవకాశం ఉంటుంది అని ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ స్పష్టం చేశారు. పిఎమ్ సూర్య ఘర్ యోజన ( ఉచిత విద్యుత్తు పథకం) ను ప్రారంభించడాన్ని గురించి శ్రీ నరేంద్ర మోదీ ప్రముఖం గా ప్రకటిస్తూ, దీని ద్వారా ప్రభుత్వం 300 యూనిట్ ల విద్యుత్తు ను ఉచితం గా అందించే ఏర్పాటు చేసింది అన్నారు. మొదటి దశ లో ఒక కోటి ఇళ్ళ మిద్దెల మీద సౌర ఫలకాల ను ఏర్పాటు చేయడం కోసం ఆర్థిక సహాయాన్ని కేంద్ర ప్రభుత్వం సమకూర్చుతుందని, ఈ ప్రాజెక్టు కు దాదాపు గా 75,000 కోట్ల రూపాయలు వ్యయం అవుతుందని ఆయన తెలియ జేశారు. దీని ద్వారా సమాజం లో మధ్య తరగతి ప్రజలు మరియు దిగువ మధ్య తరగతి ప్రజలు అత్యధిక ప్రయోజనాన్ని పొందనున్నారని ఆయన వివరించారు. బ్యాంకు లు సైతం సులభతర రుణ వితరణ కు ముందుకు వస్తాయి అని ఆయన చెప్పారు. ‘‘రాజస్థాన్ లో అయిదు లక్షల గృహాల లో సౌర ఫలకాల ను నెలకొల్పడాని కి ప్రభుత్వం ప్రణాళిక సిద్ధం చేసింది’’ అని శ్రీ నరేంద్ర మోదీ అన్నారు. పేదవారు మరియు మధ్య తరగతి కుటుంబాల కు అయ్యే ఖర్చు ను తగ్గించడం లో డబల్ ఇంజన్ ప్రభుత్వం యొక్క ప్రయాసల ను గురించి ఆయన నొక్కిచెప్పారు.
యువత, మహిళలు, రైతులు, పేదలప అభివృద్ధిపై ప్రత్యేక దృష్టిపెట్టినట్టు ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ పునరుద్ఘాటించారు. ‘‘ఇవి మాకు నాలుగు ప్రధానమైన అంశాలు,ఈ వర్గాల సాధికారతకు మోడీ ప్రభుత్వం ఇచ్చిన హామీలను డబుల్ ఇంజిన్ ప్రభుత్వం అమలు చేస్తోంది”అని ఆయన అన్నారు. రాజస్థాన్ లో ఏర్పడిన కొత్త ప్రభుత్వం తొలి ఏడాదిలో 70 వేల ఉద్యోగాలను ప్రతిపాదించిందని ఆయన అన్నారు. పేపర్ లీక్ సంఘటనలపై సిట్ ఏర్పాటుకు రాజస్థాన్ కొత్త ప్రభుత్వం నిర్ణయించడంపట్ల ప్రశంసించారు. పరీక్షాప్రశ్నపత్రాల లీకేజిలను అరికట్టేందుకు కేంద్ర ప్రభుత్వం కఠిన చట్టాన్ని తీసుకువచ్చిందని కూడా ఆయన తెలిపారు.
పేద కుటుంబాలకు రూ 450 లకు గ్యాస్ సిలిండర్లు అందించేందుకు రాష్ట్ర ప్రభుత్వం హామీ ఇవ్వడాన్ని ప్రధానమంత్రి ప్రస్తావించారు. ఇది రాజస్థాన్లోని లక్షలాదిమంది మహిళలకు ప్రయోజనం కలిగిస్తుందని తెలిపారు. గత ప్రభుత్వ హయాంలో జల్ జీవన్ మిషన్లో జరిగిన కుంభకోణాలను ప్రధానమంత్రి ప్రశ్నించారు. ప్రస్తుతం ఈ పనులు శరవేగంతో సాగుతున్నాయన్నారు. రాజస్థాన్ రైతులకు పి.ఎం. కిసాన్ సమ్మాన్ నిధికింద అందిస్తున్న ప్రస్తుత ఆర్ధిక సహాయాన్ని మరో రెండువేలు పెంచినట్టు ప్రధానమంత్రి తెలిపారు. ప్రతిరంగంలోనూ మేము ఇచ్చిన హామీలను ఒక్కొక్కటిగా నెరవేరుస్తుననాం. మేం ఇచ్చిన గ్యారంటీల విషయంలో మేం ఎంతో సీరియస్గా ఉన్నాం. అందువల్లే ప్రజలు, మోడీ గ్యారంటీ అంటే ,గ్యారంటీల అమలుగా చెప్పుకుంటారు’’అని ప్రధానమంత్రి పునరుద్ఘాటించారు.
వికసిత్ భారత్ సంకల్ప్ యాత్ర గురించి మాట్లాడుతూ ప్రధానమంత్రి, ‘‘ప్రతి లబ్ధిదారుడు వారికి అందాల్సిన ప్రయోజనాలను సత్వరం అందేట్టు చేయడమే మోడీ ప్రయత్నం లక్ష్యం. ఈ విషయంలో ఎవరూ తమకు ప్రయోజనాలు అందలేదని భావించే పరిస్థితి ఉండరాదు’’అని ఆయన అన్నారు. రాజస్థాన్ నుంచి ఉచిత ఆరోగ్య క్యాంపులలో కోట్లాదిమంది ప్రజలు పాల్గొన్న విషయాన్ని ప్రధానమంత్రి ప్రస్తావిస్తూ, దాదాపు 3 కోట్ల మంది వైద్య పరీక్షలు చేయించుకున్నట్టు తెలిపారు. కోటి కొత్త ఆయుష్మాన్ కార్డులు జారీ అయ్యాయని, 15 లక్షల మంది రరైతులు కిసాన్ క్రెడిట్ కార్డులకు తమ పేర్లను నమోదు చేసుకున్నారని అన్నారు. సుమారు 6.5 లక్షలమంది రైతులు పి.ఎం. సమ్మాన్ నిధి యోజనకు దరఖాస్తు చేసుకున్నట్టుకూడా ఆయన తెలిపారు.
ఉజ్వల గ్యాస్ కనెక్షన్ కోసం 8 లక్షల మంది మహిళలు తమ పేర్లను నమోదు చేసుకున్నారని, 2.25 లక్సలమ కనెక్షన్లు ఇప్పటికే జారీ అయినట్టు తెలిపారు.రాజస్థాన్ నుంచి 16 లక్షల మంది ప్రజలు ఒక్కొక్కరికి 2 లక్షల రూపాయల బీమా వర్తించే పథకం లో చేరారని తెలిపారు.
దేశ విజయాలను ఉత్సవాలుగా చేసుకోవడాన్ని అడ్డుకునే శక్తులు ఉంటాయని, ప్రజలలో నిరాశాపూరిత వాతావరణాన్ని కల్పించే శక్తులు ఉంటాయని ప్రధాన మంత్రి హెచ్చరించారు. అలాగే వారసత్వ రాజకీయాల పట్ల అప్రమత్తతతో ఉండాలని ప్రదానమంత్రి సూచించారు. ఇలాంటి తరహా రాజకీయాలు యువతకు ప్రేరణ కల్పించబోవని అన్నారు. తొలి సారి ఓటు వేస్తున్న ప్రజల ఆశలు, ఆకాంక్షలను ప్రస్తావిస్తూ ప్రధానమంత్రి,ఇలాంటి యువత వికసిత్ భారత్ దార్శనికతతో నిలబడి ఉందని అన్నారు. వికసిత్ రాజస్థాన్, వికసిత్ భారత్లు ఇలాంటి తొలిసారి ఓటుహక్కు పొందిన వారికోసమని ఆయన అన్నారు.
రాజస్థాన్ గవర్నర్ శ్రీ కాల్ రాజ్ మిశ్ర, ముఖ్యమంత్రి శ్రీ భజన్ లాల్శర్మ, రాజస్థాన్ ప్రభుత్వానికి చెందిన ఇతర మంత్రిఉలు, ఎంపిలు, ఎమ్మెల్యేలు,స్థానిక ప్రజాప్రతినిధులు, ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.
నేపథ్యం:
ప్రధానమంత్రి ఈ సందర్బంగా రాజస్థాన్ లో 5000 కోట్ల రూపాయలుకు పైగా విలువగల పలు జాతీయరహదారి ప్రాజెక్టులను ప్రారంభించారు. ప్రధానమంత్రి,ఢిల్లీ ముంబాయి గ్రీన్ఫీల్డ్ అలైన్మెంట్ (ఎన్.ఇ.4) అలాగే బవోన్లి జలాయి రోడ్ నుంచి ముయి గ్రామం సెక్షన్, హర్ దియో గంజ్ గ్రామం నుంచి మెజ్ నదివరకు గల సెక్షన్, టక్లినుంచి రాజస్థాన్–మధ్యప్రదేశ్ సరిహద్దువరకు గల సెక్షన్లకు సంబంధించి 8 లైన్ల రహదారి మూడు పాకేజ్లను ప్రధానమంత్రి ప్రారంభించారు. ఈ సెక్షన్లు ఈ ప్రాంతానికి సత్వర ,మెరుగైన అనుసంధానతను కల్పిస్తాయి. ఈ సెక్షన్లలో జంతువులు అండర్ పాస్ నుంచి వెళ్లడానికి , జంతువులు పై వంతెనపైనుంచి వెళ్లడానికి వీలుగా , వన్యప్రాణులు స్వేచ్ఛగా తిరిగడానికి ఎలాంటి ఆటంకం లేకుండా ఏర్పాట్లు జరిగాయి. వన్యప్రాణులపై కనీస ప్రభావం ఉండేందుకు శబ్దకాలుష్యం తగ్గించే ఏర్పాట్లు చేశౄరు. అలాగే ప్రధానమంత్రి ఆరు లైన్ల గ్రీన్ఫీల్డ్ ఉదయ్పూర్ బైపాస్ అనుసంధానతను ప్రారంభించారు.ఇ ది చిత్తోర్ఘడ్–ఉదయ్పూర్ జాతీయర రహదారి ఎన్హెచ్ –48 బైపాస్ తో దేబరి వద్ద ఉదయ్ పూర్– షామ్లాజి సెక్షన్ ఎన్.హెచ్ 48 తో కావ్య గ్రామం వద్ద అనుసంధానమవుతుంది. ఈ బైపాస్ రోడ్డు, ఉదయ్పూర్ నగరంలో రద్దీని తగ్గిస్తుంది. ప్రధానమంత్రి, వివిధ ఇతర ప్రాజెక్టులను కూడా ప్రారంభించారు. ఇవి రాజస్థాన్ లోని జున్జును, అబు రోడ్, టోంక్జిల్లా లో రోడ్డు మౌలికసదుపాయాల ను మెరుగుపరచనున్నాయి. ఈ ప్రాంతంలో రైలు మౌలిక సదుపాయాలను బలోపేతం చేస్తూ ప్రధానమంత్రి రాజస్థాన్లో సుమారు 2300 కోట్ల రూపాయల విలువగల 8 రైల్వే ప్రాజెక్టులకు శంకుస్థాపన చేసి వాటిని జాతికి అంకితం చేశారు. ఈప్రాజెక్టులలో పలు రైలు మార్గాల విద్యుదీకరణ ప్రాజెక్టులు ఉన్నాయి. అవి జోధ్పూర్ –రాయికాబాగ్ – మేర్టా రోడ్– బికనీర్ సెక్షన్ 277 కిలోమీటర్లు, జోధ్పూర్ –ఫలోడి సెక్షన్ 136 కిలోమీటర్లు, బికనీర్ –రత్నఘర్–సదుల్పూర్ –రేవారి సెక్షన్ 375 కిలోమీటర్లు ఉన్నాయి.
ప్రధానమంత్రి ఈ సందర్భంగగా ఖటిపురా రైల్వేస్టేషన్ను జాతికి అంకితం చేశారు. ఈ రైల్వేస్టేషన్ను జైపూర్ స్టేషన్ కు శాటిలైట్ స్టేషన్గా అభివృద్ధి చేశారు. దీనికి టెర్నినల్ సదుపాయం కల్పించారు. ఇక్కడి నుంచి పలు రైల్లు ప్రారంభం కావడం, అక్కడితో నిలిచిపోయేందుకు సదుపాయాలు కల్పించారు. ప్రధానమంత్రి శంకుస్థాపన చేస్తున్న ప్రాజెక్టులలో జోధ్పూర్లోని భగత్ కి కోఠఙలో వందేభారత్ స్లీపర్ ట్రైన్ల నిర్వహణ సదుపాయం, వందే భారత్ రైలు కు సంబంధించిన అన్ని రకాల బోగీలు, ఎల్.హెచ్.బిల మెయింటినెన్సు కు సంబంధించి ఖటిపురా(జైపర్)లో ప్రాజెక్టు, హనుమాన్ఘడ్లో కోచ్ కేర్ మెయింటినెన్స్ కాంప్లెక్స్ నిర్మాణం బండికుయి నుంచి ఆగ్రా ఫోర్టుకు రైల్వే లైన్ డబ్లింగ్ వంటి వి ఉన్నాయి. ఈ రైల్వే రంగ ప్రాజెక్టులు, రైల్వేల మౌలిక సదుపాయాన్ని, భద్రతను , అనుసంధానతను , సరకు రవాణా, ప్రయాణ సదుపాయాలను మరింత మెరుగు పరచడానికి పనికి వస్తాయి..
పునరుత్పాదక ఇంధన వనరుల ఉత్పత్తిని ఈ ప్రాంతంలో మరింత పెంచేందుకు వీలుగా ప్రధానమంత్రి రాజస్థాన్ లో పలు సౌరవిద్యుత్ ప్రాజెక్టులకు శంకుస్థాపన చేశారు. వీటి విలువ సుమారు రూ 5300 కోట్ల రూపాయల వరకు ఉంటుంది. ప్రధానమంత్రి ఎన్.ఎల్.సి.ఐ.ఎల్ బార్సింగ్సర్ సోలార్ ప్రాజెక్టు, రాజస్థాన్లోని బికనీర్ లో బార్ సింగ్సర్ వద్ద ఏర్పాటు చేసే 300 మెగావాట్ల సోలార్ పవర్ ప్రాజెక్టులకు శంకు స్థాపన చేశారు. ఈ సౌరవిద్యుత్ ప్రాజెక్టును అత్యధునాతన సాంకేతికతతో నిర్మిస్తున్నారు. అలాగే ఆత్మనిర్భర్భారత్ కింద ఇండియాలో అత్యున్నత సమర్ధతతో బైఫేసియల్ మాడ్యూల్స్ సాంకేతిక పరిజ్ఞానంతో దీనిని నిర్మిస్తున్నారు. ప్రధానమంత్రి ఎన్.హెచ్.పి.సి లిమిటెడ్కు చెందిన 300 మెగావాట్ల సౌరవిద్యుత్ ప్రాజెక్టుకు శంకుస్థాపన చేశారు. దీనిని సిపిఎస్యు పథకం రెండో దశ(ట్రెంచ్–3 కింద చేపడుతున్నారు.దీనిని రాజస్థాన్లోని బికనీర్ వద్ద చేపడుతున్నారు. 300 మెగావాట్ల ఎన్.టి.పి.సి గ్రీన్ ఎనర్జీ లిమిటెడ్ నోఖ్రా సోలార్ పివి ప్రాజెక్టును ప్రధానమంత్రి జాతికి అంకితం చేశారు.దీనిని రాజస్థాన్లోని బికనీర్లో అభివృద్ధి చేశారు. ఈ సౌర విద్యుత్ ప్రాజెక్టు హరిత విద్యుత్ను ఉత్పత్తి చేస్తుంది. అలాగే కార్బన్ డయాక్సైడ్ ఉద్గారాలను తగ్గించడానికి, ఈ ప్రాంత ఆర్ధిక అభివృద్ధికి దోహదపడుతుంది. . ప్రధానమంత్రి రాజస్థాన్లో రూ 2100 కోట్ల రూపాయల విలువకాగల పవర్ ట్రాన్స్మిషన్ రంగ ప్రాజెక్టులను జాతికి అంకితం చేశారు. ఈ ప్రాజెక్టులు రాజస్థాన్లోని సౌర విద్యుత్ జోన్లనుంచి విద్యుత్ను తరలించడానికి వీలుకల్పిస్తాయి. దీనవల్ల ఈ జోన్లో తయారైన సౌరవిద్యుత్ లబ్ధిదారులకు బదిలీ చేయడానికి వీలౌతుంది. ఈ ప్రాజెక్టులలో ట్రాన్స్ మిషన్ వ్యవస్థను బలోపేతం చేయడం, రాజస్థాన్లోని సౌర విద్యుత్ జోన్ల నుంచి(8.1 జిడబ్ల్యు) పార్ట్ ఎ, రెండో దశకింద, విద్యుత్ తరలింపు, విద్యుత్ బదిలీ వ్యవస్థను బలోపేతం చేయడం, రాజస్థాన్లోని సౌలార్ ఎనర్జీ జోన్ల నుంచి (8.1 జిడబ్ల్యు) సౌర విద్యుత్ను రెండోదశ, పార్ట్ బి1 కింద బదిలీకి వీలు కల్పించడం, బికనీర్ (పిజి), ఫతేఘడ్ –2, భద్లా –2 వద్ద ఆర్.ఇ. ప్రాజెక్టులకు అనుసంధానత కల్పించడం వంటి వి ఉన్నాయి. ప్రధానమంత్రి జల్ జీవన్ మిషన్ కింద 2400 కోట్ల రూపాయల విలువగల పలు ప్రాజెక్టులకు శంకు స్థాపన చేశారు. ఈ ప్రాజెక్టులు రాజస్థాన్లోని వివిధ ప్రాంతాలకు పరిశుభ్రమైన తాగునీటిని అందించేందుకు మౌలిక సదుపాయాలను మరింత బలోపేతం చేసేవి. ఈ ప్రాజెక్టులు, ప్రతి ఇంటికీ దేశవ్యాప్తంగా సురక్షిత, పరిశుభ్రమైన మంచినీరు అందించాలన్న ప్రధానమంత్రి సంకల్పానికి అనుగుణమైనవిగా చెప్పుకోవచ్చు. జోధ్పూర్ లో ఇండియన్ ఆయిల్ వారి ఎల్.పి.జి బాట్లింగ్ ప్లాంట్ ను ప్రధానమంత్రి జాతికి అంకితం చేశారు. ఈ బాట్లింగ్ ప్లాంట్ అత్యధునాతన సాంకేతిక పరిజ్ఞానంతో నిర్మించారు.దీనినిర్వహణను భద్రంగా ఉంచేలా ఆటోమేషన్ సిస్టం కల్పించారు. ఈ ప్లాంటువల్ల ఉపాధి కల్పడమే కాక,ఈ ప్రాంతంలోని లక్షలాదిమంది వినియోగదారుల ఎల్.పి.జి అవసరాలను ఇది తీరుస్తుంది.
రాజస్థాన్లో ఈ అభివృద్ధి ప్రాజెక్టులను ఆవిష్కరించడం రాజస్థాన్లో మౌలికసదుపాయాల ముఖచిత్రాన్ని పెద్ద ఎత్తున మార్చేందుకు ప్రధానమంత్రి నిరంతరం సాగిస్తున్న కృషికి ఇవి అద్దం పడుతున్నాయి. ఇవి ఈ ప్రాంతంలో ఉపాధి అవకాశాలను కల్పించడంతోపాటు అభివృద్ధికి దోహదపడనున్నాయి. ఈ కార్యక్రమాన్ని రాజస్థాన్లోని అన్ని జిల్లాలలో 200 చోట్ల ఏర్పాటు చేయడం జరిగింది. ప్రధాన కార్యక్రమం మాత్రం జైపూర్ లో జరిగింది. రాష్ట్ర వ్యాప్తంగా జరిగిన కార్యక్రమంలో లక్షలాదిమంది ప్రభుత్వ కార్యక్రమాల లబ్ధిదారులు పాల్గొన్నారు. ఈకార్యక్రమంలో రాజస్థాన్ ముఖ్యమంత్రి, రాజస్థాన్ ప్రభుత్వంలోని ఇతర మంత్రులు, ఎం.పీలు, ఎమ్మెల్యేలు, స్థానిక ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.
***
DS/TS
(Release ID: 2006639)
Visitor Counter : 139
Read this release in:
Kannada
,
English
,
Urdu
,
Marathi
,
Hindi
,
Manipuri
,
Assamese
,
Bengali-TR
,
Punjabi
,
Gujarati
,
Odia
,
Tamil
,
Malayalam