ఆర్థిక మంత్రిత్వ శాఖ
డా.అర్వింద్ పనగరియా అధ్యక్షతన న్యూఢిల్లీలో తన తొలి సమావేశాన్ని నిర్వహించిన 16వ ఆర్థిక సంఘం
Posted On:
14 FEB 2024 3:03PM by PIB Hyderabad
16వ ఆర్ధిక సంఘం (XVI-FC) డా. అర్వింద్ పనగరియా అధ్యక్షతన న్యూఢిల్లీ, జన్‌పధ్‌లోని జవహర్ వ్యాపార భవన్‌లో తన తొలి సమావేశాన్ని నిర్వహించింది. చైర్మన్‌కు, సభ్యులకు 16వ ఆర్ధిక సంఘం కార్యదర్శి శ్రీ రిత్విక్ రంజనమ్ పాండే చైర్మన్, ఆర్ధిక సంఘం ఇతర అధికారులు ఆహ్వానం పలికారు.
భారత రాష్ట్రపతి ఉత్తర్వుల మేరకు ఆర్ధిక మంత్రిత్వ శాఖ 31 డిసెంబర్, 2023న నోటిఫై చేసిన నోటిఫికేషన్ ఎస్. ఒ. 5533 (ఇ) ఉల్లేఖన నిబంధనలను 16వ ఆర్థిక సంఘం చర్చించింది.
నిపుణులు, కేంద్ర మంత్రిత్వ శాఖలు, రాష్ట్ర ప్రభుత్వాలు, స్థానిక సంస్థలు సహా వివిధ భాగస్వాములతో విస్త్రతమైన సంప్రదింపులు, చర్చలు నిర్వహించవలసిన అవసరాన్ని 16వ ఆర్థిక సంఘం గుర్తించి, అంగీకరించింది.
ఆర్ధిక సమాఖ్య సంబంధాల ప్రాంతంలో పని చేస్తున్న ఇతర సంస్థలు సహా అగ్ర పరిశోధనా సంస్థలు, ప్రముఖ థింక్ ట్యాంక్‌లతో పాటు నైపుణ్యాలను కూడా వివరణాత్మక విశ్లేషణ పని తాము నిర్వహించేందుకు అవసరమని 16వ ఆర్తిక సంఘం గుర్తించింది.
న్యూఢిల్లీలోని జన్‌పథ్‌లో గల జవహర్ వ్యాపార్ భవన్‌లో తమ కార్యాలయాన్ని ఏర్పటు చేయడాన్ని 16వ ఆర్ధిక సంఘం ఆమోదించింది.
ఏప్రిల్ 1, 2026 నుంచి ప్రారంభమయ్యే ఐదు సంవత్సరాల కాలాన్ని ఆవరిస్తూ 31 అక్టోబర్ 2025నాటికి 16వ ఆర్థిక సంఘం అందుబాటులో ఉంచనుంది.
***
(Release ID: 2006181)
Visitor Counter : 1241