ప్రధాన మంత్రి కార్యాలయం

వరల్డ్గవర్నమెంట్స్ సమిట్ దుబయి 2024 లో మెడాగాస్కర్ గణతంత్రం యొక్క అధ్యక్షుని తోసమావేశమైన ప్రధాన మంత్రి

Posted On: 14 FEB 2024 2:55PM by PIB Hyderabad

దుబయి లో ఈ రోజు న వరల్డ్ గవర్నమెంట్స్ సమిట్ జరిగిన నేపథ్యం లో, మెడాగాస్కర్ యొక్క అధ్యక్షుడు శ్రీ ఎండ్రీ రాజోయెలినా తో ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ సమావేశమయ్యారు. ఇది ఇద్దరు నేత ల మధ్య జరిగిన ఒకటో సమావేశం.

 

ఇద్దరు నేత లు భారతదేశం మరియు మెడాగాస్కర్ ల మధ్య దీర్ఘ కాలం గా ఉన్న టువంటి మిత్ర పూర్వకమైన సంబంధాలు మరియు ప్రాచీన భౌగోళిక సంబంధాల ను గుర్తించారు. ద్వైపాక్షిక సంబంధాల ను మరింత దృఢతరం గా మలచే అంశం పై వారు చర్చించారు. ఐక్య రాజ్య సమితి సహా అనేక బహుళ పక్ష వేదికల లో ఇరు దేశాల మధ్య సన్నిహిత సహకారం కొనసాగుతూ ఉండడాన్ని వారు ప్రశంసించారు.

 

 

భారతదేశం-మెడాగాస్కర్ భాగస్వామ్యాన్ని మరింత గా బలపరచడానికి మరియు ‘విజన్ ఎస్ఎజిఎఆర్’ (సెక్యూరిటీ ఎండ్ గ్రోథ్ ఫార్ ఆల్ ఇన్ ద రీజియన్) కు భారతదేశం కట్టుబడి ఉంది అని ప్రధాన మంత్రి స్పష్టం చేశారు. హిందూ మహాసముద్రం ప్రాంతం లో అభివృద్ధి చెందుతున్న సాటి దేశం గా భారతదేశం, మెడాగాస్కర్ యొక్క అభివృద్ధి యుక్త ప్రస్థానం లో నిబద్ధత కలిగిన భాగస్వామ్య దేశం గా ఇక ముందు కూడా తన పాత్ర ను పోషిస్తుంది అని ఆయన వెల్లడించారు.

 

 

 

***



(Release ID: 2005993) Visitor Counter : 87