ప్రధాన మంత్రి కార్యాలయం
ఐఐటి ఢిల్లీ-అబుధాబి ప్రాంగణం తొలి బ్యాచ్ విద్యార్థులతో ప్రధాని సంభాషణ
Posted On:
13 FEB 2024 7:35PM by PIB Hyderabad
ఐఐటి ఢిల్లీ-అబుధాబి ప్రాంగణంలో చదువుతున్న తొలి బ్యాచ్ విద్యార్థులతో ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ సంభాషించారు. భారత్-యుఎఇ మధ్య ద్వైపాక్షిక సహకారంలో ఇది ఓ కొత్త అధ్యాయానికి శ్రీకారం చుట్టడమేగాక రెండు దేశాల యువతను ఏకతాటిపైకి తెస్తుందని ప్రధాని ఈ సందర్భంగా పేర్కొన్నారు.
ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ-ఢిల్లీ (ఐఐటి-డి) ప్రాంగణాన్ని ‘యుఎఇ’లో ఏర్పాటు చేయడంపై 2022 ఫిబ్రవరిలో ఉభయదేశాల నాయకత్వం అంగీకారానికి వచ్చింది. ఈ మేరకు ఐఐటి-డి, అబుధాబి విద్యా-వైజ్ఞానికి శాఖ (ఎడిఇకె)ల మధ్య సంయుక్త సహకారంతో దీనికి శ్రీకారం చుట్టారు. ప్రపంచవ్యాప్తంగా విద్యార్థులకు నాణ్యమైన ఉన్నత విద్యావకాశం కల్పించడం దీని లక్ష్యం. భవిష్యత్తరం సాంకేతికత, పరిశోధన-ఆవిష్కరణ రంగాలలో రెండు దేశాల మధ్య భాగస్వామ్యాన్ని కూడా ఇది ప్రోత్సహిస్తుంది. తదనుగుణంగా ‘ఎనర్జీ ట్రాన్సిషన్ అండ్ సస్టైనబిలిటీ’లో మాస్టర్స్ కోర్సుతో ఈ ఏడాది జనవరిలోనే తొలి విద్యా సంవత్సరం ప్రారంభమైంది.
(Release ID: 2005982)
Visitor Counter : 93
Read this release in:
English
,
Urdu
,
Marathi
,
Hindi
,
Bengali
,
Manipuri
,
Assamese
,
Punjabi
,
Gujarati
,
Odia
,
Tamil
,
Kannada
,
Malayalam