ఆర్ధిక వ్యవహారాల మంత్రివర్గ సంఘం
azadi ka amrit mahotsav

భారతీయ రైల్వేలు అంతటా 6 బహుళ ట్రాకింగ్ ప్రాజెక్ట్‌లకు క్యాబినెట్ ఆమోదం: ప్రయాణాన్ని సులభతరం చేయడానికి, లాజిస్టిక్స్ ఖర్చును తగ్గించడానికి, చమురు దిగుమతులను తగ్గించడానికి, బొగ్గు పులుసు ఉద్గారాలను తగ్గించడానికి ఉపయోగం


రైల్వే కార్యకలాపాలను సజావుగా చేయడానికి, మెరుగైన సమయపాలనతో పాటు రైళ్ల సమయపాలనకు ప్రాజెక్టు ప్రస్తుత లైన్ సామర్థ్యాన్ని పెంచుతాయి.

రద్దీని తగ్గించడానికి, రైలు ట్రాఫిక్‌ను పెంచడానికి దోహదపడతాయి

ఈ ప్రాజెక్టుల నిర్మాణ సమయంలో దాదాపు 3 కోట్ల పనిదినాలు ప్రత్యక్ష ఉపాధి కల్పిస్తాయి

2029-30 నాటికి పూర్తయ్యే అవకాశం ఉన్న ప్రాజెక్టుల వ్యయం సుమారు రూ. 12,343 కోట్లు

Posted On: 08 FEB 2024 8:07PM by PIB Hyderabad

ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ అధ్యక్షతన జరిగిన ఆర్థిక వ్యవహారాల క్యాబినెట్ కమిటీ రైల్వే మంత్రిత్వ శాఖ ఆరు ప్రాజెక్టులకు ఆమోదం తెలిపింది. కేంద్ర ప్రభుత్వం నుండి 100% నిధులతో మొత్తం అంచనా వ్యయం రూ.12,343 కోట్లు (సుమారు). ఇవి బహుళ-ట్రాకింగ్ కార్యకలాపాలను సులభతరం చేస్తాయి. రద్దీని తగ్గిస్తాయి, భారతీయ రైల్వేలలో అత్యంత రద్దీగా ఉండే విభాగాలలో చాలా అవసరమైన మౌలిక సదుపాయాల అభివృద్ధిని అందిస్తాయి. ఈ ప్రాజెక్టులు వారి ఉపాధి/స్వయం ఉపాధి అవకాశాలను పెంపొందించే ప్రాంతంలో సమగ్ర అభివృద్ధి ద్వారా "ఆత్మనిర్భర్"గా మార్చే నూతన భారతదేశం గురించి గౌరవనీయులైన ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ విజన్‌కు అనుగుణంగా ఉన్నాయి.

6 రాష్ట్రాల్లోని 18 జిల్లాలు అంటే..., రాజస్థాన్, అస్సాం, తెలంగాణ, గుజరాత్, ఆంధ్రప్రదేశ్, నాగాలాండ్‌లను కవర్ చేసే ఆరు ప్రాజెక్టులు భారతీయ రైల్వేల ప్రస్తుత నెట్‌వర్క్‌ను 1020 కిలోమీటర్ల మేర పెంచుతాయి. రాష్ట్రాల ప్రజలకు సుమారు మూడు కోట్ల పనిదినాల ఉపాధిని అందిస్తుంది.

బహుళ-మోడల్ కనెక్టివిటీ కోసం పీఎం-గతి శక్తి నేషనల్ మాస్టర్ ప్లాన్ ఫలితంగా ఈ ప్రాజెక్ట్‌లు సమీకృత ప్రణాళిక ద్వారా సాధ్యమయ్యాయి. ప్రజలు, వస్తువులు మరియు సేవల కదలికలకు నిరంతరాయ కనెక్టివిటీని అందిస్తాయి.

 

క్రమ సంఖ్య 

డబ్లింగ్ నిడివిలో సెక్షన్ 

పొడువు (కిలోమీటర్లల్లో)

అంచనా వ్యయం (కోట్ల రూ.లలో)

రాష్ట్రం 

1

అజ్మీర్-చందేరియా 

178.28

1813.28

రాజస్థాన్ 

2

జైపూర్-సవాయ్ మధోపూర్ 

131.27

1268.57

రాజస్థాన్ 

3.

లూనీ-సందారి-బిల్దీ 

271.97

3530.92

గుజరాత్, రాజస్థాన్ 

4

కొత్త రైల్ కమ్ రోడ్ బ్రిడ్జితో అగ్థోరి-కామాఖ్య

7.062

1650.37

అస్సాం 

5

లమ్డింగ్-ఫుర్కేటింగ్

140

2333.84

అస్సాం, నాగాలాండ్ 

6

మోటుమర్రి-విష్ణుపురం మరియు

మోటుమర్రి వద్ద రైల్ ఓవర్ రైల్

 

88.81

 

10.87

1746.20

తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ 

 

ఇవి ఆహార ధాన్యాలు, ఆహార వస్తువులు, ఎరువులు, బొగ్గు, సిమెంట్, ఇనుము, ఉక్కు, ఫ్లై-యాష్, క్లింకర్, లైమ్‌స్టోన్, పిఓఎల్, కంటైనర్ మొదలైన వస్తువుల రవాణాకు అవసరమైన మార్గాలు. సామర్థ్యం పెంపుదల పనుల వల్ల అదనపు సరుకు రవాణా జరుగుతుంది. పరిమాణం 87 ఎంటిపిఏ (సంవత్సరానికి మిలియన్ టన్నులు). రైల్వేలు పర్యావరణ అనుకూలమైనవి, ఇంధన సమర్థవంతమైన రవాణా విధానం, వాతావరణ లక్ష్యాలను సాధించడంలో, దేశం లాజిస్టిక్స్ వ్యయాన్ని తగ్గించడంలో, చమురు దిగుమతి, తక్కువ బొగ్గు పులుసు ఉద్గారాలను తగ్గించడంలో సహాయపడతాయి.

 

***


(Release ID: 2004381) Visitor Counter : 154