వినియోగదారు వ్యవహారాలు, ఆహార మరియు ప్రజా పంపిణీ మంత్రిత్వ శాఖ
ఓపెన్ నెట్‌వర్క్ డిజిటల్ కామర్స్ (ఓఎన్డీసీ) వేదికపై ఆన్-బోర్డ్‌లలో సరసమైన ధరల దుకాణాలు
- హిమాచల్ ప్రదేశ్‌లోని ఉనా మరియు హమీర్‌పూర్ జిల్లాల్లోని 11 సరసమైన ధరల దుకాణాలు మొదట ఓఎన్డీసీలో ఆన్‌బోర్డ్‌పైకి; భవిష్యత్తులో రాష్ట్రవ్యాప్తంగా మరియు దేశవ్యాప్త అమలుకు ఒక నమూనాగా ఇది పని చేస్తుంది
- ఈ దశ సరసమైన ధరల దుకాణం డీలర్‌లకు ఆదాయ ఉత్పత్తికి అదనపు మార్గం, తద్వారా లబ్ధిదారుల సంతృప్తిని పెంచుతుంది: కార్యదర్శి, ఆహార మరియు ప్రజా పంపిణీ శాఖ
प्रविष्टि तिथि:
07 FEB 2024 10:53AM by PIB Hyderabad
డిజిటల్ ఇండియా దిశగా అడుగులు వేస్తూ.. భారత ప్రభుత్వ ఆహార మరియు ప్రజాపంపిణీ శాఖ కార్యదర్శి శ్రీ సంజీవ్ చోప్రా, హిమాచల్ ప్రదేశ్‌లోని ఉనా మరియు హమీర్‌పూర్ జిల్లాల్లోని సరసమైన ధరల దుకాణాలను (ఎఫ్పీఎస్) ఓపెన్ నెట్‌వర్క్ డిజిటల్ కామర్స్ (ఓఎన్డీసీ) ఆన్-బోర్డ్ చేసే పైలట్ పనులను ప్రారంభించారు. పైలట్లో వర్చువల్‌గా 11 ఎఫ్పీసీ లలో ప్రారంభించబడింది - ఉనాలో 5 ఎఫ్పీఎస్లు మరియు హమీర్‌పూర్ జిల్లాలలో 6 ఎఫ్పీఎస్ లు ప్రారంభించబడ్డాయి. ఓఎన్డీసీలో సరసమైన ధరల దుకాణాలు ప్రారంభించడం ఇదే మొదటిసారి. ఈ సందర్భంగా శ్రీ చోప్రా మాట్లాడుతూ, ఈ ల్యాండ్‌మార్క్ చొరవ సరసమైన ధరల దుకాణాలను మార్చడంలో శాఖ యొక్క నిరంతర ప్రయత్నాలకు తోడ్పడుతుందని అన్నారు. ఈ ప్రయత్నం లబ్ధిదారుల సంతృప్తిని పెంపొందించడంతో పాటు ఎఫ్పీఎస్ డీలర్‌లకు అదనపు ఆదాయ మార్గాలను అందించడం లక్ష్యంగా పెట్టుకుంది. అంతేకాకుండా, ఈ చొరవ ఎఫ్పీఎస్ డీలర్‌లకు డిజిటల్ మార్కెట్ ప్లేస్‌లో దృశ్యమానత, ఎన్ఎఫ్ఎస్ఏ లబ్ధిదారులకు మించిన పెద్ద కస్టమర్ బేస్‌కు అనుసంధానతను అందిస్తుంది. పెద్ద రిటైలర్‌లు మరియు ఇ-కామర్స్ ప్లాట్‌ఫారమ్‌లతో సమాన స్థాయిలో పోటీపడే సామర్థ్యంతో సహా అనేక ప్రయోజనాలను అందిస్తుందని ఆయన నొక్కిచెప్పారు. అదనంగా, ఆన్‌లైన్ కొనుగోలు చేయడంలో ఇబ్బందులు ఎదుర్కొనే లబ్ధిదారులు వారి తరపున ఆన్‌లైన్ ఆర్డర్‌లు చేయడానికి ఎఫ్పీఎస్ డీలర్‌ను సంప్రదించవచ్చు. హిమాచల్ ప్రదేశ్‌లో అమలు చేస్తున్న పైలట్ ప్రాజెక్టు విజయవంతం అయితే.. భవిష్యత్తులో రాష్ట్రవ్యాప్తంగా మరియు దేశవ్యాప్త దత్తతకు ఒక నమూనాగా ఉపయోగపడుతుందని ఆయన ప్రస్తావించారు. ఈ పైలట్ ప్రోగ్రామ్‌ను అమలు చేయడంలో మైక్రోసేవ్ కన్సల్టింగ్ (ఎంఎస్సీ) మద్దతును కూడా ఆయన అభినందించారు. లాంచ్ ఈవెంట్ తర్వాత, ఉనా & హమీర్‌పూర్ జిల్లాల్లోని ఎఫ్పీఎస్ డీలర్‌ల కోసం ఫిజికల్ మోడ్‌లో వర్క్‌షాప్ నిర్వహించబడింది. ఓఎన్డీసీ మొదలైన వాటిపై ఉత్పత్తులు, సర్వీస్ ఆర్డర్‌లు మరియు కమీషన్ నిర్మాణాన్ని ఎలా కేటలాగ్ చేయాలో వర్క్‌షాప్ వివరించింది. శ్రీమతి అనితా కర్న్, జాయింట్ సెక్రటరీ (పీడీ), శ్రీ రవిశంకర్, డైరెక్టర్ (పీడీ), శ్రీ మితుల్ థాప్లియాల్, భాగస్వామి, ఎంఎస్సీ మరియు శ్రీ శరన్ష్ అగర్వాల్, ఓఎన్డీసీ కూడా లాంచ్ ఈవెంట్‌లో పాల్గొన్నారు.
***
(रिलीज़ आईडी: 2003792)
आगंतुक पटल : 158