ప్రధాన మంత్రి కార్యాలయం
azadi ka amrit mahotsav

హిందీ మరియు ఒడియా చలనచిత్ర రంగాల లో ప్రముఖుడు శ్రీ సాధు మెహెర్ కన్నుమూత పట్ల సంతాపాన్ని వ్యక్తం చేసిన ప్రధాన మంత్రి

प्रविष्टि तिथि: 03 FEB 2024 2:17PM by PIB Hyderabad

హిందీ మరియు ఒడియా చలనచిత్ర రంగాల లో ప్రముఖుడు అయినటువంటి శ్రీ సాధు మెహెర్ కన్నుమూత పట్ల ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ సంతాపాన్ని వ్యక్తం చేశారు.

 

ప్రధాన మంత్రి ఎక్స్ మాధ్యం లో పోస్ట్ చేసిన ఒక సందేశం లో -

‘‘శ్రీ సాధు మెహెర్ గారి మరణం చలనచిత్ర జగతి కి మరియు మన సాంస్కృతిక వారసత్వానికి తీరని నష్టాన్ని కలుగజేసింది.  హిందీ మరియు ఒడియా భాషా చలనచిత్ర సీమ లలో ప్రముఖుడు అయినటువంటి ఆయన సినిమాల లో పోషించిన పాత్రలు మరియు ఆయనలోని సమర్పణ భావం ఇతరులకు మార్గదర్శకమైన టువంటివి అని చెప్పాలి.  ఆయన కుటుంబాని కి, ఆయన తో కలసి పనిచేసినటువంటి  తోటి కళాకారులకు మరియు భర్తీ చేయలేనటువంటి ఈ యొక్క నష్టాని కి శోకసంతప్తులు అయిన అనేక మంది ప్రశంసకుల కు కలిగిన బాధ లో నేను సైతం పాలుపంచుకొంటున్నాను.  ఆయన ను స్మరించుకొంటూ, ఆయన మనకు మిగిల్చి పోయినటువంటి సమృద్ధమైన కళాత్మక వారసత్వాన్ని మనం మన మదిలో పదిల పరచుకొందాం. ఓమ్ శాంతి.’’ అని పేర్కొన్నారు.


(रिलीज़ आईडी: 2002463) आगंतुक पटल : 122
इस विज्ञप्ति को इन भाषाओं में पढ़ें: Kannada , English , Urdu , हिन्दी , Marathi , Bengali , Manipuri , Assamese , Punjabi , Gujarati , Odia , Tamil , Malayalam