ఆర్థిక మంత్రిత్వ శాఖ
ప్రభుత్వం మరింత సమగ్రమైన ‘జిడిపి’పై దృష్టి సారించింది -
ప్రజా-కేంద్రీకృత సమగ్ర అభివృద్ధి కోసం పాలన, అభివృద్ధి, పనితీరు అని స్పష్టం చేసిన కేంద్ర ఆర్థిక మంత్రి
అన్ని రంగాలలో సర్వతోముఖాభివృద్ధి ప్రభావవంతంగా ఉండటంతో ఆర్థిక వ్యవస్థ బాగానే ఉంది: శ్రీమతి సీతారామన్
ప్రభుత్వం పారదర్శకంగా, జవాబుదారీగా, ప్రజ-కేంద్రీకృతమైన మరియు సత్వర విశ్వాస-ఆధారిత పరిపాలనను ‘సిటిజెన్-ఫస్ట్’ మరియు ‘కనీస ప్రభుత్వం, గరిష్ట పాలన’తో అందించింది:
Posted On:
01 FEB 2024 12:35PM by PIB Hyderabad
"స్థూల దేశీయోత్పత్తి పరంగా అధిక వృద్ధిని అందించడమే కాకుండా, ప్రభుత్వం మరింత సమగ్రమైన 'జీడీపీ' అంటే 'పరిపాలన, అభివృద్ధి, పనితీరుపై సమానంగా దృష్టి సారించింది" అని కేంద్ర ఆర్థిక, కార్పొరేట్ వ్యవహారాల మంత్రి శ్రీమతి నిర్మలా సీతారామన్ తెలిపారు. పార్లమెంట్‌లో ఆమె మధ్యంతర కేంద్ర బడ్జెట్ 2024ను ప్రవేశపెట్టారు.
ప్రభుత్వం పారదర్శకంగా, జవాబుదారీగా, ప్రజాకేంద్రంగా, సత్వర విశ్వాస ఆధారిత పరిపాలనను ‘పౌరుడే ప్రథమం’ మరియు ‘కనీస ప్రభుత్వం, గరిష్ట పాలన’ విధానంతో అందించిందని కేంద్ర ఆర్థిక మంత్రి తెలిపారు. పెట్టుబడులు బలంగా ఉండటం వల్ల ఆర్థిక వ్యవస్థ బాగానే ఉందని, బాహ్య రంగంతో సహా స్థూల ఆర్థిక స్థిరత్వంతో పాటు, అన్ని రంగాల్లోనూ సర్వతోముఖాభివృద్ధి ప్రభావం స్పష్టంగా కనిపిస్తోందని సీతారామన్ అన్నారు.
ప్రజలు తమ ఆకాంక్షలను కొనసాగించడానికి సాధికారత పొందుతున్నారని, సన్నద్ధమవుతున్నారని అన్నారు. భవిష్యత్తులో మరింత గొప్ప ఆకాంక్షలతో ప్రజలు మెరుగ్గా జీవిస్తున్నట్లు, సంపాదన పెరుగడం ద్వారా ఇది కనిపిస్తుంది; ప్రజల సగటు నిజ ఆదాయం 50 శాతం పెరిగింది; ద్రవ్యోల్బణం మితంగా ఉంటుంది; కార్యక్రమాలు, పెద్ద ప్రాజెక్టుల సమర్థవంతంగా, సకాలంలో అమలులోకి వస్తున్నాయి.... అని నిర్మల సీతారామన్ తెలిపారు.
ఆర్థిక నిర్వహణ
గత 10 సంవత్సరాలలో బహుళస్థాయి ఆర్థిక నిర్వహణ ప్రజల-కేంద్రీకృత సమ్మిళిత అభివృద్ధిని పూర్తి చేసిందని నిర్మల సీతారామన్ అన్నారు. దానిలోని కొన్ని ప్రధాన అంశాలుగా చుస్తే...
- భౌతిక, డిజిటల్ లేదా సామాజిక అన్ని రకాల మౌలిక సదుపాయాలు రికార్డు సమయంలో సిద్ధం అవుతున్నాయి.
- దేశంలోని అన్ని ప్రాంతాలు ఆర్థిక వృద్ధిలో చురుకైన భాగస్వాములుగా మారుతున్నాయి.
- డిజిటల్ పబ్లిక్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్, 21వ శతాబ్దంలో కొత్త 'ఉత్పత్తి కారకం', ఆర్థిక వ్యవస్థ అధికారికీకరణలో కీలకపాత్ర పోషిస్తుంది.
- వస్తువులు మరియు సేవల పన్ను ‘ఒక దేశం, ఒక మార్కెట్, ఒకే పన్ను’ని ప్రారంభించింది. పన్ను సంస్కరణలు పన్ను పునాదిని మరింత లోతుగా మరియు విస్తృతం చేయడానికి దారితీశాయి.
- ఆర్థిక రంగాన్ని బలోపేతం చేయడం వల్ల పొదుపులు, క్రెడిట్ మరియు పెట్టుబడులు మరింత సమర్థవంతంగా చేయడంలో దోహదపడింది.
- జిఐఎఫ్టి-ఐఎఫ్ఎస్సి, యూనిఫైడ్ రెగ్యులేటరీ అథారిటీ, ఐఎఫ్సిఏ (ఇంటర్నేషనల్ ఫైనాన్షియల్ సర్వీసెస్ సెంటర్స్ అథారిటీ) గ్లోబల్ క్యాపిటల్, ఆర్థిక వ్యవస్థకు ఆర్థిక సేవల కోసం ఒక బలమైన గేట్‌వేని సృష్టిస్తున్నాయి.
- చురుకైన ద్రవ్యోల్బణం నిర్వహణ... ద్రవ్యోల్బణాన్ని పాలసీ బ్యాండ్‌లో ఉంచడంలో సహాయపడింది.
****
(Release ID: 2001741)
Visitor Counter : 213
Read this release in:
Bengali
,
English
,
Urdu
,
Hindi
,
Marathi
,
Assamese
,
Punjabi
,
Gujarati
,
Tamil
,
Kannada
,
Malayalam