ఆర్థిక మంత్రిత్వ శాఖ

ప్రత్యక్ష పరోక్ష పన్ను రేట్లు కొనసాగించాలని మధ్యంతర బడ్జెట్ లో ప్రతిపాదించిన ఆర్థిక శాఖ మంత్రి


ఎంతో కాలం పెండింగ్ లో ఉన్న ప్రత్యక్ష పన్నుల వసూలు పై కల్పించిన ఉపశమనం వల్ల దాదాపు 1 కోటి పన్ను చెల్లింపుదారులకు ప్రయోజనం

Posted On: 01 FEB 2024 12:44PM by PIB Hyderabad

' సంప్రదాయాన్ని పాటిస్తూ నేను పన్నులకు సంబంధించి ఎటువంటి మార్పులు ప్రతిపాదించడం లేదు.  దిగుమతి సుంకాలతో సహా ప్రత్యక్ష పన్నులు,పరోక్ష పన్నులకు ప్రస్తుత  పన్ను రేట్లు కొనసాగించాలని ప్రతిపాదిస్తున్నాను" అని కేంద్ర ఆర్థిక,కార్పొరేట్ వ్యవహారాల మంత్రి శ్రీమతి  నిర్మలా సీతారామన్ తెలిపారు. ఈరోజు పార్లమెంట్‌లో 2024-25 మధ్యంతర బడ్జెట్‌ను శ్రీమతి  నిర్మలా సీతారామన్ ప్రవేశ పెట్టారు. 

పన్నుల కొనసాగింపును నిర్ధారించడానికి  కేంద్ర ఆర్థిక మంత్రి  స్టార్టప్‌లు, సార్వభౌమ సంపద లేదా పెన్షన్ ఫండ్‌ల ద్వారా చేసే , పెట్టుబడులకు నిర్దిష్ట పన్ను ప్రయోజనాలు అందించాలని,  కొన్ని ఐఎఫ్ఎస్ సి యూనిట్ల నిర్దిష్ట ఆదాయంపై పన్ను మినహాయింపును 31.03.2025 వరకుకొనసాగించాలని ప్రతిపాదించారు.

జీవన సౌలభ్యం , సులభతర వ్యాపార  నిర్వహణ  సౌలభ్యాన్ని పరచడానికి ప్రభుత్వం చేస్తున్న కృషిలో భాగంగా 1962 నుంచి   పెద్ద సంఖ్యలో పెండింగ్ లో  ఉన్న  చిన్న, ధృవీకరించబడని, రాజీపడని లేదా వివాదాస్పద ప్రత్యక్ష పన్ను డిమాండ్లకు ఉపశమనం కలిగించాలని నిర్ణయించింది. దీనిలో భాగంగా ,  2009-10 ఆర్థిక సంవత్సరం వరకు ఉన్న కాలానికి సంబంధించి పెండింగ్ లో ఉన్న10,000 రూపాయల వరకు,    2010-11 నుంచి  2014-15 ఆర్థిక సంవత్సరాలకు 25,000 రూపాయల  వరకు ఉన్న  బకాయి ఉన్న ప్రత్యక్ష పన్ను డిమాండ్లను ఉపసంహరించుకోవాలని శ్రీమతి  సీతారామన్ ప్రతిపాదించారు. దీని వల్ల దాదాపు కోటి మంది పన్ను చెల్లింపుదారులు ప్రయోజనం పొందుతారు అని  అంచనా

***



(Release ID: 2001642) Visitor Counter : 165