మంత్రిమండలి
azadi ka amrit mahotsav

పిడిఎస్ లో భాగం గా ఎఎవై కుటుంబాల కోసం చక్కెరసబ్సిడీ పథకాని కి ఆమోదాన్ని తెలిపిన మంత్రిమండలి

Posted On: 01 FEB 2024 11:34AM by PIB Hyderabad

సార్వజనిక వితరణ పథకం (పిడిఎస్) మాధ్యం ద్వారా అంత్యోదయ అన్న యోజన (ఎఎవై) కుటుంబాల కోసం చక్కెర సబ్సిడీ తాలూకు పథకాన్ని మరో రెండు సంవత్సరాల పాటు, అంటే 2026 వ సంవత్సరం మార్చి నెల 31 వ తేదీ వరకు పొడిగించడాని కి ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ అధ్యక్షత న జరిగిన కేంద్ర మంత్రి వర్గ సమావేశం ఆమోదాన్ని తెలియ జేసింది.

 

దేశం లోని పౌరుల శ్రేయం కోసం మరియు దేశం లో నిరుపేదల కు చక్కెర ను అందుబాటు లో ఉంచడం కోసం కేంద్ర ప్రభుత్వం దృఢం గా కట్టుబడి ఉంది అనడానికి ఒక సూచికయా అన్నట్లుగా ఉన్నటువంటి ఈ పథకం ఆయా నిరుపేదల చెంతకు చక్కెర చేరడానికి పూచీ పడుతున్నది. మరి వారి హారం లో శక్తి ని జత చేస్తున్నది. తద్ద్వరా వారి ఆరోగ్యం మెరుగు పడాలన్నదే దీనిలోని ఉద్దేశ్యం. ఈ పథకం లో భాగం గా, కేంద్ర ప్రభుత్వం ఈ పథకం లో పాలుపంచుకొంటున్నటువంటి రాష్ట్రాల లో ఎఎవై కుటుంబాల కు చక్కెర పై ప్రతి నెల ప్రతి కిలో కు 18 రూపాయల 50 పైసల సబ్సిడీ ని అందిస్తోంది. ఈ ఆమోదం తో 15వ ఆర్థిక సంఘం (2020-21 నుండి 2025-26) కాలావధి లో 1,850 కోట్ల రూపాయల కు పైగా లాభం ఒనగూరవచ్చన్న అంచనా ఉంది. ఈ పథకం తో దేశం లో సుమారు గా 1.89 కోట్ల ఎఎవై కుటుంబాల కు లాభం కలుగుతుందని ఆశించడమైంది.

 

భారతదేశం ప్రభుత్వం ఇప్పటికే ప్రధాన్ మంత్రి గరీబ్ కళ్యాణ్ అన్న యోజన (పిఎమ్-జికెఎవై) లో భాగం గా ఆహార పదార్థాల ను ఉచితం గా సమకూర్చుతున్నది. పిఎమ్-జికెఎవై పరిధి కి వెలుపల కూడా పౌరుల కు చాలినంత ఆహారం అందేటట్లు గా పూచీ పడాలన్న ఉపాయం లో భాగం గా తక్కువ ధరల లో మరియు సమంజసమైనటువంటి ధరల లో భారత్ ఆటా’, ‘భారత్ దాల్’, టొమేటోలు మరియు ఉల్లిపాయల ను అమ్మడం జరుగుతున్నది. ఇంతవరకు సుమారు 3 లక్షల టన్నుల భారత్ దాల్ (సెనగ పప్పు) ను మరియు దాదాపు గా 2.4 లక్షల టన్నుల భారత్ ఆటా ను విక్రయించడం జరిగింది. ఫలితం గా, సామాన్య వినియోగదారుల కు మేలు కలిగింది. ఈ ప్రకారం, సబ్సిడీ పప్పు, పిండి, ఇంకా చక్కెర అందుబాటులోకి రావడం తో భారతదేశం లో సామాన్య పౌరుల కు ఆహారాన్ని సమకూర్చడమైంది. తత్ఫలితం గా అందరికీ ఆహారం, అందరికీ పోషణకు సంబంధించిన మోదీ యొక్క హామీ నెరవేరింది.

 

ఈ ఆమోదం తో, ప్రభుత్వం పిడిఎస్ ద్వారా ఎఎవై కుటుంబాల కు ప్రతి నెల ప్రతి కుటుంబానికి ఒక కిలో వంతున చక్కెర ను పంపిణీ చేయడం కోసం ఈ పథకం లో భాగస్వాములు గా ఉన్న రాష్ట్రాల కు సబ్సిడీ ని ఇవ్వడాన్ని కొనసాగిస్తుంది. చక్కెర ను కొనుగోలు చేసే మరియు పంపిణీ చేసే బాధ్యత రాష్ట్రాల ది.

 

 

***


(Release ID: 2001481) Visitor Counter : 132