ఆర్థిక మంత్రిత్వ శాఖ

ఇండియా-మిడిల్ ఈస్ట్-యూరప్ ఎకనామిక్ కారిడార్ భారత దేశానికి, ఇతరులకు వ్యూహాత్మకంగా, ఆర్ధికంగా కూడా ఎంతో ప్రాధాన్యం (గేమ్ ఛేంజర్) కలిగివుంది


2005-14లో కంటే 2014-23లో రెట్టింపు పెరుగుదల తో 596 బిలియన్ డాలర్లకు చేరిన విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులు (ఎఫ్ డి ఐ)

‘ మొదట భారత్ అభివృద్ధి‘ స్ఫూర్తి తోనే ద్వైపాక్షిక పెట్టుబడుల ఒప్పందాలు

Posted On: 01 FEB 2024 12:44PM by PIB Hyderabad

ఇటీవల ప్రకటించిన ఇండియా-మిడిల్ ఈస్ట్-యూరప్ ఎకనామిక్ కారిడార్ భారత దేశానికి, ఇతరులకు వ్యూహాత్మక , ఆర్థిక పరంగా ఎంతో కీలకమని, ఆటను మారుస్తుందని కేంద్ర ఆర్థిక, కార్పొరేట్ వ్యవహారాల మంత్రి శ్రీమతి నిర్మలా సీతారామన్ అన్నారు. రోజు పార్లమెంటులో 2024-25 మధ్యంతర బడ్జెట్ ను ప్రవేశపెడుతూ, కారిడార్ "రాబోయే వందల సంవత్సరాల పాటు ప్రపంచ వాణిజ్యానికి పునాది అవుతుంది, కారిడార్ భారత గడ్డపై ప్రారంభించబడిందని చరిత్ర గుర్తుంచుకుంటుందిఅన్న ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ మాటలను గుర్తు చేశారు. భౌగోళికంగా, యుద్ధాలు, సంఘర్షణలతో ప్రపంచ వ్యవహారాలు మరింత సంక్లిష్టంగా, సవాలుగా మారుతున్నాయని శ్రీమతి నిర్మలా సీతారామన్ అన్నారు. గ్లోబలైజేషన్ ఇప్పుడు పునరుద్ధరణ, మైత్రి ఆధారితం, సరఫరా గొలుసుల అంతరాయం, విచ్ఛిన్నం, కీలకమైన ఖనిజాలు, సాంకేతిక పరిజ్ఞానాల కోసం పోటీతో పునర్నిర్వచించబడుతోందని ఆమె పేర్కొన్నారు. కోవిడ్-19 మహమ్మారి తర్వాత కొత్త ప్రపంచ వ్యవస్థ ఆవిర్భవిస్తోందని ఆమె అన్నారు. ప్రపంచానికి అత్యంత క్లిష్ట సమయంలో భారత్ జీ20 అధ్యక్ష పదవిని చేపట్టిందని మంత్రి పేర్కొన్నారు. ప్రపంచ ఆర్థిక వ్యవస్థ అధిక ద్రవ్యోల్బణం, అధిక వడ్డీ రేట్లు, తక్కువ వృద్ధి, అధిక ప్రభుత్వ రుణం, తక్కువ వాణిజ్య వృద్ధి, వాతావరణ సవాళ్లను ఎదుర్కొంటోందని ఆమె పేర్కొన్నారు. మహమ్మారి ప్రపంచానికి ఆహారం, ఎరువులు, ఇంధనం , ఆర్థిక సంక్షోభానికి దారితీసిందని, అయినా భారతదేశం విజయవంతంగా తన మార్గంలో ప్రయాణించిందని ఆమె అన్నారు. ప్రపంచ సమస్యలకు పరిష్కారాలపై దేశం ముందడుగు వేసిందని, ఏకాభిప్రాయాన్ని సాధించిందని నిర్మలా సీతారామన్ అన్నారు.

 

పెట్టుబడులను ప్రోత్సహించడం

2014-23లో విదేశీ ప్రత్యక్ష పెట్టుబడుల ప్రవాహం 596 బిలియన్ డాలర్లుగా ఉందని, ఇది స్వర్ణయుగానికి సంకేతమని మంత్రి అన్నారు. 2005-14లో వచ్చిన ఇన్ ఫ్లో కంటే ఇది రెట్టింపు అని ఆమె వివరించారు.

2024-25 మధ్యంతర బడ్జెట్ ను ప్రవేశపెట్టిన సందర్భంగా మంత్రి మాట్లాడుతూ, "స్థిరమైన విదేశీ పెట్టుబడులను ప్రోత్సహించడానికి, 'మొదట  భారతదేశ అభివృద్ధి‘  అనే స్ఫూర్తితో మన విదేశీ భాగస్వాములతో ద్వైపాక్షిక పెట్టుబడి ఒప్పందాలపై చర్చలు జరుపుతున్నా మని చెప్పారు.

***



(Release ID: 2001338) Visitor Counter : 156