ఆర్థిక మంత్రిత్వ శాఖ
azadi ka amrit mahotsav

అమృత్ పీఢి  - యువత సాధికారతకు ప్రభుత్వం కట్టుబడి ఉంది : కేంద్ర ఆర్థిక మంత్రి


జాతీయ విద్యావిధానం 2020 పరివర్తనాత్మక సంస్కరణలకు నాంది పలుకుతోంది - శ్రీమతి నిర్మలా సీతారామన్

పిఎం శ్రీ పాఠశాలలు నాణ్యమైన బోధనను అందజేస్తున్నాయి మరియు సమగ్రమైన, చక్కని వ్యక్తులను ప్రోత్సహిస్తున్నాయి– శ్రీమతి నిర్మలా సీతారామన్

ప్రధాన మంత్రి విశ్వకర్మ యోజన 18 వర్తకాలలో నిమగ్నమైన చేతివృత్తుల వారికి ఎండ్ టు ఎండ్ సపోర్ట్ అందిస్తుంది - శ్రీమతి నిర్మలా సీతారామన్

Posted On: 01 FEB 2024 12:39PM by PIB Hyderabad

కేంద్ర ఆర్థిక మంత్రి శ్రీమతి నిర్మలా సీతారామన్ రోజు పార్లమెంటులో 2024-25 మధ్యంతర బడ్జెట్ ను ప్రవేశపెట్టిన సందర్భంగా అమృత్ పీఢి, యువశక్తిని శక్తివంతం చేయడానికి ప్రభుత్వం కట్టుబడి ఉందని చెప్పారు.

యువతను తగిన విధంగా సన్నద్ధం చేయడం, సాధికారత కల్పించడంపైనే మన శ్రేయస్సు ఆధారపడి ఉందని మంత్రి ఉద్ఘాటించారు. జాతీయ విద్యావిధానం 2020 పరివర్తనాత్మక సంస్కరణలకు నాంది పలుకుతోందని ఆమె పేర్కొన్నారు. పీఎం స్కూల్స్ ఫర్ రైజింగ్ ఇండియా (పీఎం ఎస్ ఆర్ ) నాణ్యమైన బోధనను అందిస్తోందని, సమగ్రమైన, మంచి వ్యక్తులను ప్రోత్సహిస్తోందని ఆమె అన్నారు.

స్కిల్ ఇండియా మిషన్ విజయాన్ని ప్రస్తావిస్తూ, మిషన్ కింద 1.4 కోట్ల మంది యువతకు శిక్షణ ఇచ్చామని, 54 లక్షల మంది యువతకు నైపుణ్యం కల్పించామని, 3000 కొత్త ఐటిఐలను ఏర్పాటు చేశామని శ్రీమతి సీతారామన్ తెలియజేశారు. ఇటీవల ప్రారంభించిన పీఎం విశ్వకర్మ యోజన ద్వారా 18 రకాల వర్తకాలలో నిమగ్నమైన చేతివృత్తుల వారికి ఎండ్ టు ఎండ్ సపోర్ట్ లభిస్తుందని ఆమె తెలిపారు.

దేశంలో 7 ఐఐటీలు, 16 ఐఐఐటీలు, 7 ఐఐఎంలు, 15 ఎయిమ్స్, 390 యూనివర్శిటీలు వంటి కొత్త ఉన్నత విద్యా సంస్థలను ఏర్పాటు చేసినట్లు ఆర్థిక మంత్రి తెలిపారు.

****


(Release ID: 2001325) Visitor Counter : 187