ఆర్ధిక వ్యవహారాల మంత్రివర్గ సంఘం
azadi ka amrit mahotsav

సిఐఎల్ & గెయిల్ (జిఎఐఎల్‌) ఉమ్మ‌డి వెంచ‌ర్ ద్వారా బొగ్గు నుంచి ఎస్ఎన్‌జి (సింథ‌టిక్ స‌హ‌జ వాయువు) సిఐఎల్ ఏర్పాటు చేసేందుకు, 2) ఎంసిఎల్ క‌మాండ్ ఏరియాలో సిఐఎల్‌& బిహెచ్ఇఎల్ ద్వారా బొగ్గు నుంచి అమ్మోనియం ప్రాజెక్టును ఏర్పాటు చేసేందుకు స‌మాన (ఈక్విటీ) పెట్టుబ‌డి ప్ర‌తిపాద‌న‌కు ప్ర‌ధాన‌మంత్రి న‌రేంద్ర మోదీ అధ్య‌క్ష‌త‌న బుధ‌వారం జ‌రిగిన ఆర్ధిక వ్య‌వ‌హారాల‌పై కేబినెట్ క‌మిటీ (సిసిఇఎ) ఆమోదం

Posted On: 24 JAN 2024 6:10PM by PIB Hyderabad

ఇసిఎల్ క‌మాండ్ ప్రాంతంలో సిఐఎల్ & గెయిల్ (జిఎఐఎల్‌) ఉమ్మ‌డి వెంచ‌ర్ ద్వారా  బొగ్గు నుంచి ఎస్ఎన్‌జి (సింథ‌టిక్ స‌హ‌జ వాయువు) సిఐఎల్ ఏర్పాటు చేసేందుకు, 2) ఎంసిఎల్ క‌మాండ్ ఏరియాలో సిఐఎల్‌& బిహెచ్ఇఎల్ ద్వారా బొగ్గు నుంచి అమ్మోనియం ప్రాజెక్టును ఏర్పాటు చేసేందుకు  స‌మాన (ఈక్విటీ) పెట్టుబ‌డి ప్ర‌తిపాద‌న‌కు ప్ర‌ధాన‌మంత్రి న‌రేంద్ర మోదీ అధ్య‌క్ష‌త‌న బుధ‌వారం జ‌రిగిన ఆర్ధిక వ్య‌వ‌హారాల‌పై కేబినెట్ క‌మిటీ (సిసిఇఎ) ఆమోదించింది. 
దిగువ‌న పేర్కొన్న ఈక్విటీ (స‌మాన‌)పెట్టుబ‌డుల‌కు కూడా సిసిఇఎ ఆమోదం తెలిపిందిః 
సిఐఎల్ & గెయిల్ ఉమ్మ‌డి వెంచ‌ర్ ద్వారా ప‌శ్చిమ బెంగాల్‌లోని బుర్ద్వాన్ జిల్లాలో సోనేపూర్ బ‌జారీ ప్రాంతంలోని ఈస్ట‌ర్న్ కోల్‌ఫీల్డ్స్ లిమిటెడ్ (ఇసిఎల్‌) లో ప్ర‌తిపాదిత‌ బొగ్గు నుంచి సింథ‌టిక్ నాచుర‌ల్ గ్యాస్ (ఎస్ఎన్‌జి) ప్రాజెక్టుకు అంచ‌నా వ్య‌యం రూ. 13,052.81 కోట్లు ( +25% నిర్ధిష్ట‌త‌)తో ఉమ్మ‌డి వెంచ‌ర్ కంపెనీలో 51% స‌మాన పెట్టుబ‌డితో, 70ః30  స‌మాన రుణ నిష్ప‌త్తిని ప‌రిగ‌ణ‌న‌లోకి తీసుకుని సిఐఎల్ రూ.1,997.08 కోట్ల (+25%) స‌మాన పెట్టుబ‌డి. 
సిఐఎల్ & బిహెచ్ఇఎల్ ఉమ్మ‌డి వెంచ‌ర్ ద్వారా ఒడిషాలోని ఝ‌ర్సాగుడ‌లో   మ‌హాన‌ది కోల్‌ఫీల్డ్స్ లిమిటెడ్ (ఎంసిఎల్‌) వ‌ద్ద ల‌ఖ‌న్‌పూర్ ప్రాంతంలో ప్ర‌తిపాదిత బొగ్గు నుంచి అమ్మోనియం నైట్రేట్ (ఎఎన్‌) ప్రాజెక్టు కోసం ప్రాజెక్టు అంచ‌నా వ్య‌యం రూ. 11,782.05 కోట్లు ( +25% నిర్ధిష్ట‌త‌)తో ఉమ్మ‌డి వెంచ‌ర్ కంపెనీలో 51% స‌మాన పెట్టుబ‌డితో, 70ః30  స‌మాన రుణ నిష్ప‌త్తిని ప‌రిగ‌ణ‌న‌లోకి తీసుకుని సిఐఎల్ రూ.1,802.56 కోట్ల (+25%) స‌మాన పెట్టుబ‌డి. 
పైన పేర్కొన్నమొద‌టి ప్రాజెక్టు సిఐఎల్‌- గెయిల్ ల నిక‌ర‌విలువ‌లో 30% స‌మాన పెట్టుబ‌డిని,  పైన పేర్కొన్న రెండ‌వ ప్రాజెక్టులో సిఐఎల్‌- బిహెచ్ఇఎల్‌ నిక‌ర‌విలువ‌లో 30% స‌మాన పెట్టుబ‌డి పెట్టేందుకు ఆమోదం. 
స్వ‌యం స‌మృద్ధి, ఇంధ‌న స్వాతంత్రాన్ని సాధించాల‌న్న భార‌త్ రెండు ల‌క్ష్యాల‌ను నెర‌వేర్చేందుకు 2030నాటికి 100 ఎంటిల బొగ్గును వాయు రూపంలోకి మార్చాల‌న్న (కోల్ గ్యాసిఫికేష‌న్‌) ల‌క్ష్యాన్ని సాధించాల‌న్న దృక్ప‌ధంతో కోల్‌ ఇండియా లిమిటెడ్ (సిఐఎల్‌) దిగువ పేర్కొన్న రెండు కోల్ గ్యాసిఫికేష‌న్ కేంద్రాల‌ను ఏర్పాటు చేయ‌నుంది. 
ప‌శ్చిమ బెంగాల్‌లోని బుర్ద్వాన్ జిల్లాలో ఈస్ట‌ర్న్ కోల్‌ఫీల్డ్స్ లిమిటెడ్ (ఇసిఎల్‌) సోనేపూర్ బ‌జారీ ప్రాంతంలో బొగ్గు నుంచి ఎస్ఎన్‌జి ప్రాజెక్టును సిఐఎల్ & గెయిల్  ఉమ్మ‌డి వెంచ‌ర్ ద్వారా 70ః30 స‌మాన రుణ నిష్ప‌త్తి వ‌ర‌కు ప‌రిగ‌ణ‌లోకి తీసుకుని రూ. 13,052.81 కోట్లు (+25%) అంచ‌నా వ్య‌యంతో ఏర్పాటు చేసేందుకు గెయిల్‌తో అవ‌గాహ‌న ప‌త్రంపై సిఐఎల్ సంత‌కాలు చేసింది. 
ఒడిషాలోని ఝ‌ర్సుగూడ  జిల్లాలో మ‌హాన‌ది కోల్ ఫీల్డ్స్ లిమిటెడ్ (ఎంసిఎల్‌) వ‌ద్ద ల‌ఖ‌న్‌పూర్‌ ప్రాంతంలో బొగ్గు నుంచి అమ్మోనియం నైట్రేట్‌ప్రాజెక్టును సిఐఎల్ & బిహెచ్ఇఎల్‌  ఉమ్మ‌డి వెంచ‌ర్ ద్వారా 70ః30 స‌మాన రుణ నిష్ప‌త్తి వ‌ర‌కు ప‌రిగ‌ణ‌లోకి తీసుకుని రూ. 11,782.05 కోట్లు (+25%) అంచ‌నా వ్య‌యంతో ఏర్పాటు చేసేందుకు బిహెచ్ ఇఎల్‌తో అవ‌గాహ‌న ప‌త్రంపై సిఐఎల్ సంత‌కాలు చేసింది. 

 

***


(Release ID: 1999401) Visitor Counter : 156