మంత్రిమండలి
వైద్య చికిత్స ఉత్పాదనల క్రమబద్ధీకరణ రంగం లో సహకారం గురించి భారతదేశాని కి మరియు నెదర్‌లాండ్స్ కు మధ్యకుదిరిన మెమొరాండమ్ ఆఫ్ ఇన్ టెంట్ (ఎమ్ఒఐ) కి ఆమోదం తెలిపిన మంత్రిమండలి
Posted On:
18 JAN 2024 1:02PM by PIB Hyderabad
"వైద్య చికిత్స ఉత్పాదన ల క్రమబద్ధీకరణ సంబంధి రంగం లో సహకారం’’ అనే అంశం లో సంతకాలు జరిగిన ఒక మెమొరాండమ్ ఆఫ్ ఇన్ టెంట్ (ఎమ్ఒఐ) వివరాల ను ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ అధ్యక్షత న సమావేశమైన కేంద్ర మంత్రి వర్గాని కి తెలియ జేయడమైంది. ఈ ఎమ్ఒఐ పైన భారత ప్రభుత్వ ఆరోగ్యం మరియు కుటుంబ సంక్షేమం మంత్రిత్వ శాఖ, సెంట్రల్ డ్రగ్స్ స్టాండర్డ్ కంట్రోల్ ఆర్గనైజేశన్ (సిడిఎస్‌సిఒ) లకు మరియు మెడిసిన్స్ ఇవేల్యుయేశన్ బోర్డ్, హెల్థ్ ఎండ్ యూథ్ కేర్ ఇన్స్ పెక్టరేట్, సెంట్రల్ కమిటీ ఆన్ రిసర్చ్ ఇన్ వాల్వింగ్ హ్యూమన్ సబ్జెక్ట్ స్ తరఫున నెదర్‌లాండ్స్ కు చెందిన ఆరోగ్యం, సంక్షేమం మరియు క్రీడల మంత్రిత్వ శాఖ కు మధ్య 2023 నవంబరు 7 వ తేదీ నాడు సంతకాలు అయ్యాయి.
ఈ ఎమ్ఒఐ సెంట్రల్ డ్రగ్స్ స్టాండర్డ్ కంట్రోల్ ఆర్గనైజేశన్ (సిడిఎస్‌సిఒ) కు మరియు కింగ్ డమ్ ఆఫ్ నెదర్లాండ్స్ యొక్క ఆరోగ్యం, సంక్షేమం మరియు క్రీడల మంత్రిత్వ శాఖ కు మధ్య అంతర్జాతీయ బాధ్యతల కు అనుగుణం గా వైద్య చికిత్స ఉత్పాదనల నియంత్రణ కు సంబంధించిన అంశాల లో మానవ విషయాలతో ముడిపడ్డ పరిశోధన తాలూకు సెంట్రల్ కమిటీ తరఫున నెదర్లాండ్స్ యొక్క ఆరోగ్యం, సంక్షేమం మరియు క్రీడల మంత్రిత్వ శాఖ మధ్య సార్థక సహకారం, ఇంకా సమాచార ఆదాన ప్రదానం కోసం ఒక ఫ్రేమ్ వర్క్ ను రూపొందించడానికి ఉద్దేశించింది.
రెండు దేశాల నియంత్రణాధికార సంస్థల మధ్య కుదిరిన ఈ ఎమ్ఒఐ ఔషధ నిర్మాణ సంబంధి రంగం లో ఉపయోగం కోసం ముడి సరకులు, బయొలాజికల్ ప్రోడక్ట్ స్, వైద్య చికిత్స పరికరాలు, ఇంకా సౌందర్య వర్థక ఉత్పాదన లు సహా ఔషధాల కు సంబంధించి వైద్య చికిత్స ఉత్పాదన ల నియంత్రణ లో మెరుగైన అవగాహన ను ఏర్పరచేందుకు మార్గాన్ని సుగమం చేస్తుంది.
ఇది నియంత్రణ సంబంధి అభ్యాసాల మేళనం ద్వారా భారతదేశం నుండి మందుల ఎగుమతి వృద్ధి చెందడం లో తోడ్పాటు లభిస్తుంది; తద్ద్వారా ఔషధ నిర్మాణ సంబంధి రంగం లో విద్యావంతులైన వృత్తి నిపుణుల కు మెరుగైన ఉద్యోగ అవకాశాలు లభించేందుకు ఆస్కారం ఉంటుంది.
ఈ ఎమ్ఒఐ వైద్య చికిత్స ఉత్పాదన ల ఎగుమతి కి బాట ను పరచగలదు. ఫలితం గా విదేశీ మారక ద్రవ్యం ఆర్జన మెరుగు పడుతుంది. ఇది ఆత్మనిర్భర్ భారత్ ఆవిష్కారం దిశ లో పడే ఒక అడుగు అని చెప్పవచ్చును.
***
(Release ID: 1997454)
Visitor Counter : 127
Read this release in:
English
,
Urdu
,
Hindi
,
Marathi
,
Nepali
,
Bengali
,
Assamese
,
Manipuri
,
Punjabi
,
Gujarati
,
Odia
,
Tamil
,
Kannada
,
Malayalam