సమాచార, ప్రసార మంత్రిత్వ శాఖ
azadi ka amrit mahotsav

రెండు నెలలు 15 కోట్ల మంది ప్రజలు


వికసిత భారత్ సంకల్ప యాత్రలో పెద్ద సంఖ్యలో పాల్గొంటున్న ప్రజలు

Posted On: 17 JAN 2024 2:42PM by PIB Hyderabad

వికసిత భారత్ సంకల్ప యాత్రలో ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొంటున్నారు. కేవలం రెండు నెలల కాలంలో వికసిత భారత సంకల్ప యాత్ర దేశ ప్రజల దృష్టిని ఆకర్షించింది. రెండు నెలల కాలంలో వికసిత భారత్ సంకల్ప యాత్రలో 15 కోట్ల మంది పాల్గొన్నారు. కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ, అభివృద్ధి పథకాల వివరాలు ప్రజలకు వివరించి,  అర్హులైన వారందరికీ పథకాల ప్రయోజనాలు అందించేందుకు ప్రారంభమైన వికసిత భారత్ సంకల్ప యాత్రలో ప్రజలు పాల్గొంటూ సమ్మిళిత అభివృద్ధి కోసం ప్రభుత్వం చేస్తున్న ప్రయత్నాలకు సహకారం అందిస్తూ కార్యక్రమాన్ని విజయవంతం చేస్తున్నారు. 

 ప్రారంభించిన నాటి నుంచి  రాజస్థాన్, మధ్యప్రదేశ్, చత్తీస్ గఢ్, తెలంగాణ రాష్ట్రాల్లో ప్రజలు పెద్ద సంఖ్యలో    కార్యక్రమంలో స్వచ్చందంగా పాల్గొంటున్నారు.  2023 డిసెంబర్ 13న నాలుగో వారం ముగిసే సమయానికి యాత్ర లో  2.06 కోట్ల మంది పాల్గొన్నారు.  2023 డిసెంబర్ 22 నాటికి 5వ వారం ముగిసేసరికి ఈ సంఖ్య 5 కోట్లకు పెరిగింది. ఆ తర్వాత నాలుగు వారాల్లో 15 కోట్ల మైలురాయి దాటిన ఈ యాత్రకు 10 కోట్ల మంది హాజరయ్యారు. జనవరి 17 నాటికి వికసిత భారత్ సంకల్ప  యాత్ర డాష్ బోర్డు లో పొందిపరిచిన వివరాల ప్రకారం  2.21 లక్షల గ్రామ పంచాయతీలు, 9,541 పట్టణ ప్రాంతాల్లో సాగింది, యాత్రలో  15.34 కోట్ల మంది పాల్గొన్నారు.

 

 

ప్రజల భాగస్వామ్యంతో కలిసి ముందుకు:

ఈ యాత్ర "జన్ భాగీ దారి" (ప్రజల భాగస్వామ్యం) స్ఫూర్తిని ప్రతిబింబిస్తుంది. నగరాలు, గ్రామాల్లో పర్యటిస్తున్న   ఐఈసీ వ్యాన్ల ద్వారా అర్హులైన ప్రతి ఒక్కరికీ సంక్షేమ పథకాలు చేరవేయాలని ప్రధానమంత్రి శ్రీ  నరేంద్ర మోదీ లక్ష్యంగా పెట్టుకున్నారు. ఈ వ్యాన్ ల ద్వారా ప్రభుత్వ పథకాలు, సుస్థిర వ్యవసాయం, అందుబాటు ధరలో ఆరోగ్య సంరక్షణ, పారిశుధ్యం, ఆర్థిక స్వావలంబన వంటి అంశాలపై అవగాహన కల్పిస్తున్నారు.

ఆరోగ్య శిబిరాల సేవలు పొందిన 4 కోట్ల మంది

దేశవ్యాప్తంగా 2023 జనవరి 17 నాటికి నిర్వహించిన ఆరోగ్య శిబిరాలలో  4 కోట్ల మందికి పైగా స్క్రీనింగ్ పరీక్షలు నిర్వహించారు.  మై భారత్ లో 38 లక్షలకు పైగా రిజిస్ట్రేషన్లు జరిగాయి.  అందరికీ అందుబాటులో ఉండేలా 2 కోట్లకు పైగా ఆయుష్మాన్ భారత్ హెల్త్ కార్డులు జారీ అయ్యాయి.  ఈ యాత్ర రెండు లక్షలకు పైగా గ్రామ పంచాయతీల పరిధిలో జరిగింది. . 2047 నాటికి అభివృద్ధి చెందిన భారతదేశాన్ని నిర్మించడానికి కృషి చేస్తామని 11 కోట్లకు పైగా ప్రజలు ప్రతిజ్ఞ తీసుకున్నారు.

ప్రతి గ్రామంపై స్పష్టమైన ప్రభావం :

ప్రతి గ్రామంపై వికసిత భారత్ సంకల్ప యాత్ర సానుకూల ప్రభావాన్ని చూపించింది.  లక్షకు పైగా గ్రామ పంచాయతీల పరిధిలో ప్రజలందరికీ  ఆయుష్మాన్ కార్డులు జారీ అయ్యాయి.  లక్షలాది మందికి ఆరోగ్య సంరక్షణ సేవలు అందుబాటులోకి వచ్చాయి.  'హర్ ఘర్ జల్' పథకం ద్వారా స్వచ్ఛమైన నీరు ఇప్పుడు 79,000 గ్రామ పంచాయతీలకు సరఫరా అవుతోంది. , 1.38 లక్షలకు పైగా గ్రామ పంచాయతీల్లో 100% భూ రికార్డుల డిజిటలైజేషన్ పూర్తయింది.  17,000 కంటే ఎక్కువ గ్రామ పంచాయతీలు ఓడిఎఫ్ ప్లస్ స్థాయి  సాధించాయి, ఇది పరిశుభ్రమైన జీవనానికి నిదర్శనం.

కలలు  సాకారం చేసిన సంకల్ప యాత్ర: 

ప్రజల ఆకాంక్షలు, కలలు సాకారం అయ్యేందుకు సంకలప యాత్ర దోహద పడింది.   ప్రతి ఇంటి ముంగిటకు పురోగతి ఫలితాలు చేరడం,   సమృద్ధిని అందరూ పంచుకోవడం, అభివృద్ధి సాధికార జీవితాలను అందించడం లక్ష్యంగా సంకలప యాత్ర సాగింది. ప్రతి గ్రామ పంచాయతీ, నమోదు చేయబడిన ప్రతి లబ్ధిదారుడు, తీసుకున్న ప్రతి ప్రతిజ్ఞతో వికసిత భారత్  కలను సాకారం చేయడానికి యాత్ర భారతదేశాన్ని ఒక అడుగు ముందుకు వేసేలా సహకరించింది.  

***


(Release ID: 1996993) Visitor Counter : 189