ప్రధాన మంత్రి కార్యాలయం
దివ్య కుమార్ ఆలపించిన ‘‘హర్ ఘర్ మందిర్.. హర్ ఘర్ ఉత్సవ్’’ భక్తి గీతాన్ని ప్రజలతో పంచుకున్న ప్రధానమంత్రి
Posted On:
13 JAN 2024 11:12AM by PIB Hyderabad
ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఇవాళ దివ్య కుమార్ ఆలపించిన ‘‘హర్ ఘర్ మందిర్.. హర్ ఘర్ ఉత్సవ్’’ భక్తిగీతాన్ని ప్రజలతో పంచుకున్నారు. ఈ గీతానికి సిద్ధార్థ్ అమిత్ భావ్‌సర్ సంగీతం సమకూర్చారు. శతాబ్దాల నిరీక్షణ తర్వాత అయోధ్య క్షేత్రంలో శుభ ముహూర్తం ఆసన్నమైందని శ్రీ మోదీ ఈ సందర్భంగా వ్యాఖ్యానించారు. ఈ నేపథ్యంలో శ్రీరాముని కీర్తిగానం దేశం నలుదిశలా మూలమూలనా ప్రతిధ్వనిస్తున్నదని ఆయన అన్నారు. ఇందులో భాగంగా పైన పేర్కొన్న భక్తి గీతాన్ని ప్రజలతో పంచుకుంటూ- దీన్ని ఆలకిస్తున్నపుడు మనమంతా భక్తివిశ్వాసాలతో తన్మయత్వంలోకి వెళ్తామని అభివర్ణించారు.
ఈ మేరకు ‘ఎక్స్’ ద్వారా పంపిన ఒక సందేశంలో:
‘‘శతాబ్దాల నిరీక్షణ అనంతరం అయోధ్య క్షేత్రంలో శుభ ముహూర్తం సమీపిస్తోంది. ఈ శుభ సందర్భంలో శ్రీరాముని కీర్తిగానం ఉత్తరం నుంచి దక్షిణందాకా.. తూర్పు నుంచి పడమర వరకూ నలుదిశలా ప్రతిధ్వనిస్తోంది. ఈ భక్తిగీతం#ShriRamBhajan ఆలకించడం ద్వారా ఆ తన్మయత్వం మీరూ అనుభవించగలరు’’ అని ప్రధానమంత్రి పేర్కొన్నారు.
*********
DS/ST
(Release ID: 1996421)
Visitor Counter : 87
Read this release in:
English
,
Urdu
,
Marathi
,
Hindi
,
Bengali
,
Assamese
,
Manipuri
,
Punjabi
,
Gujarati
,
Odia
,
Tamil
,
Kannada
,
Malayalam
,
Malayalam