ప్రధాన మంత్రి కార్యాలయం
azadi ka amrit mahotsav

జాతీయ క్రీడలు.. సాహస అవార్డులు-2023 విజేతలకు ప్రధానమంత్రి అభినందన

Posted On: 09 JAN 2024 7:14PM by PIB Hyderabad

   ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ జాతీయ క్రీడలు.. సాహస అవార్డులు-2023 విజేతలను అభినందించారు. క్రీడాకారుల అద్భుత విజయాలను, వారి పోరాట పటిమను ఈ సందర్భంగా ప్రశంసించారు. వారు తమతమ రంగాల్లో రాణించడమేగాక ప్రపంచ వేదికపై భారత జాతీయ పతాక గౌరవాన్ని ఇనుమడింపజేశారని ప్రధాని కొనియాడారు.

ఈ మేరకు రాష్ట్రపతి భవన్‌లో ఈ పురస్కార ప్రదానంపై రాష్ట్రపతి ‘ఎక్స్’ ద్వారా పంపిన సందేశంపై ప్రతిస్పందనగా పోస్ట్ చేసిన సందేశంలో:

‘‘నేషనల్ స్పోర్ట్స్ అండ్ అడ్వెంచర్ అవార్డ్స్-2023 విజేతలకు అభినందనలు. వారి అద్భుత విజయాలు, మొక్కవోని అంకితభావం మన దేశానికి స్ఫూర్తి. వారు తమతమ రంగాల్లో రాణించడమేగాక ప్రపంచ వేదికపై భారత జాతీయ పతాక గౌరవాన్ని సమున్నతంగా నిలిపారు’’ అని ప్రధానమంత్రి పేర్కొన్నారు.

*********

DS/ST


(Release ID: 1994720) Visitor Counter : 186