ప్రధాన మంత్రి కార్యాలయం
azadi ka amrit mahotsav

పదో వైబ్రాన్ట్ గుజరాత్ గ్లోబల్ సమిట్ 2024 సందర్భం లో మొజాంబిక్  గణతంత్రం యొక్క అధ్యక్షుని తో సమావేశమైన ప్రధానమంత్రి

Posted On: 09 JAN 2024 2:03PM by PIB Hyderabad

ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ మొజాంబిక్ గణతంత్రం యొక్క అధ్యక్షుడు శ్రీ ఫిలిప్ జైసింటో న్యూసీ తో గాంధీనగర్ లో 2024 జనవరి 9 వ తేదీ న సమావేశమయ్యారు.


మొజాంబిక్ యొక్క అభివృద్ధి ప్రాధాన్యాల కు అండ గా నిలచేందుకు బలమైన నిబద్ధత ను ప్రధాన మంత్రి శ్రీ నరంద్ర మోదీ ఈ సందర్భం లో వ్యక్తం చేశారు. రక్షణ, ఉగ్రవాదాన్ని ఎదుర్కోవడం, శక్తి, ఆరోగ్యం, వ్యాపారం , ఇంకా పెట్టుబడి, వ్యవసాయం, జల సురక్ష , గనుల త్రవ్వకం, సామర్థ్యాల పెంపుదల మరియు సముద్ర సంబంధి సహకారం వంటి రంగాలు సహా ద్వైపాక్షిక సంబంధాల ను వృద్ధి పరచుకొనే పద్ధతుల పై నేత లు ఇద్దరు సార్ధక చర్చల ను జరిపారు. వ్యాపారాన్ని, సంస్కృతి ని, ఉభయ దేశాల ప్రజల మధ్య పరస్పర సంబంధాల ను ప్రోత్సహించడం కోసం వాయు సంధానాన్ని వృద్ధి పరచుకొనే విషయం లో ఇరు దేశాలు కృషి చేయవచ్చంటూ ప్రధాన మంత్రి సూచన ను చేశారు.


జి-20 లో ఆఫ్రికన్ యూనియన్ (ఎయు) ను చేర్చుకొన్నందుకు గాను ప్రధాన మంత్రి కి అధ్యక్షుడు శ్రీ న్యూసీ ధన్యవాదాల ను వ్యక్తం చేరు. ఐక్య రాజ్య సమితి సహా బహుళ పక్ష వేదికల లో సహకారాని కి సంబంధించిన అంశాల ను గురించి నేత లు చర్చించారు.


వాయస్ ఆఫ్ ద గ్లోబల్ సౌథ్ సమిట్ 2023 వ సంవత్సరం జనవరి లోను మరియు నవంబరు లోను జరగగా ఆ కార్యక్రమాల లో అధ్యక్షుడు శ్రీ న్యూసీ పాలుపంచుకోవడాన్ని ప్రధాన మంత్రి ప్రశంసించారు.


వివిధ అభివృద్ధి ప్రాజెక్టుల లో మరియు సామర్థ్య పెంపుదల సంబంధి కార్యక్రమాల లో, అలాగే సముద్ర సంబంధి భద్రత రంగం లో భారతదేశం అందిస్తున్నటువంటి సమర్థన కు గాను అధ్యక్షుడు శ్రీ న్యూసీ ధన్యవాదాల ను తెలిపారు.


సంప్రదింపుల ను కొనసాగించాలని మరియు రెండు దేశాల మధ్య ఉన్నత స్థాయి రాజకీయ సంపర్కాన్ని ముందుకు తీసుకుపోతుండాలనే అంశాల పై ఇరువురు నేత లు అంగీకారాన్ని తెలియ జేశారు.

 

***

 


(Release ID: 1994546) Visitor Counter : 146