ప్రధాన మంత్రి కార్యాలయం

అసమ్ లో రహదారి దుర్ఘటన లో ప్రాణనష్టం వాటిల్లినందుకు సంతాపాన్ని వ్యక్తం చేసినప్రధాన మంత్రి 

Posted On: 03 JAN 2024 12:01PM by PIB Hyderabad

అసమ్ లోని గోలాఘాట్ లో జరిగిన ఒక రహదారి దుర్ఘటన కారణం గా ప్రాణనష్టం వాటిల్లినందుకు ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ సంతాపాన్ని వ్యక్తం చేశారు.

 

ఈ దుర్ఘటన లో ప్రాణాల ను కోల్పోయిన వ్యక్తుల దగ్గరి సంబంధికుల కు ప్రధాన మంత్రి జాతీయ సహాయ నిధి (పిఎమ్ఎన్ఆర్ఎఫ్) నుండి 2 లక్షల రూపాయల వంతు న పరిహారాన్ని ఇవ్వడం జరుగుతుంది అని ఆయన ప్రకటించారు. ఇదే దుర్ఘటన లో గాయపడ్డ వ్యక్తుల కు ఏభై వేల రూపాయల వంతు న చెల్లించడం జరుగుతుంది.

 

ప్రధాన మంత్రి కార్యాలయం ఎక్స్ మాధ్యం లో నమోదు చేసిన ఒక సందేశం లో -

‘‘అసమ్ లోని గోలాఘాట్ లో జరిగిన ఒక రోడ్డు దుర్ఘటన ప్రాణనష్టాని కి దారితీయడం బాధ ను కలిగించింది. ప్రియతముల ను కోల్పోయిన కుటుంబాల కు ఇదే సంతాపం. ఈ దుర్ఘటన లో గాయపడిన వారు త్వరిత గతిన పునఃస్వస్థులు అగుదురు గాక. ప్రభావిత వ్యక్తుల కు స్థానిక పాలన యంత్రాంగం సాధ్యమైన అన్ని విధాలు గాను సహాయాన్ని అందిస్తున్నది. మృతుల దగ్గరి సంబంధికుల కు పిఎమ్ఎన్ఆర్ఎఫ్ నుండి 2 లక్షల రూపాయల వంతు న పరిహారాన్ని చెల్లించడం జరుగుతుంది. ఈ దుర్ఘటన లో గాయపడ్డ వ్యక్తుల కు ఏభై వేల రూపాయల వంతు న ఇవ్వడం జరుగుతుంది: ప్రధాన మంత్రి’’ అని తెలియ జేసింది.

 

 

***

DS/RT



(Release ID: 1992643) Visitor Counter : 95