మంత్రిమండలి

ప్రసార రంగం లోసహకారం కోసం ప్రసార భారతి మరియు  మలేశియా కు చెందిన రేడియో టెలివిజన్ మలేశియా (ఆర్‌టిఎమ్) కు మధ్య ఒకఎమ్ఒయు పై జరిగిన సంతకాల కు  ఆమోదం తెలిపిన మంత్రిమండలి

Posted On: 27 DEC 2023 3:25PM by PIB Hyderabad

ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ అధ్యక్షత న జరిగిన కేంద్ర మంత్రి వర్గ సమావేశాని కి 2023 నవంబరు 7వ తేదీ న సంతకాలు జరిగినటువంటి ఎమ్ఒయు/ఒప్పందం గురించి న వివరాల ను తెలియజేడమైంది. ఈ ఎమ్ఒయు కు/ఒప్పందాని కి ప్రసార రంగం లో సహకారాన్ని, వార్తాల ఆదాన ప్రదానాన్ని, దృశ్య-శ్రవణ ప్రధాన కార్యక్రమాల ను ఇచ్చి పుచ్చుకోవడాన్ని బలపరచే విషయం లో అపారమైనటువంటి సామర్థ్యం ఉన్నది . అంతేకాకుండా దీనితో మలేశియా తో భారతదేశాని కి ఉన్న స్నేహ పూర్వక సంబంధాల ను చెప్పుకోదగిన స్థాయి లో వృద్ధి చోటు చేసుకొంటుంది కూడా ను. దీనితో పాటు గా వివిధ దేశాల తో ప్రసార భారతి కుదుర్చుకొన్న ఎమ్ఒయు ల సంఖ్య మొత్తం మీద 46 కు పెరిగింది.

 

దేశ నిర్మాణం లో చాలా ముఖ్యమైన పాత్ర ను ప్రసార భారతి పోషిస్తున్నది. అర్థవంతమైన మరియు ఖచ్చితమైన కంటెంటు ను దేశాని కి మరియు విదేశాల కు కూడా అందించడం లో ప్రసార భారతి అదే పని గా శ్రద్ధ వహిస్తున్నది. ఈ ఎమ్ఒయు లు ఇతర దేశాల కు కంటెంటు వితరణ లో కీలకం కానున్నాయి. అంతర్జాతీయ ప్రసార సంస్థల తో భాగస్వామ్యాల ను అభివృద్ధి పరచుకోవడం కోసం మరియు నూతన సాంకేతిక పరిజ్ఞానం సంబంధి అవసరాల ను తీర్చడం కోసం సరిక్రొత్త వ్యూహాల ను అన్వేషించడం లో సైతం ఈ ఎమ్ఒయుల ది ముఖ్య పాత్ర. ఈ తరహా ఎమ్ఒయు లను కుదుర్చుకోవడం లో కలిగే ప్రధానమైన ప్రయోజనం ఏమిటి అంటే అది సంస్కృతి, విద్య, విజ్ఞానశాస్త్రం, సాంకేతిక విజ్ఞానం, క్రీడలు, వార్తలు మరియు ఇతర రంగాల లో రూపొందిన కార్యక్రమాల ను ఉచిత ప్రాతిపదిక న/ ఉచితం కాదు అనే ప్రాతిపదిక న ఇచ్చి పుచ్చుకొనేందుకు వీలు ఏర్పడుతుంది అనేదే.

 

రేడియో మరియు టెలివిజన్ రంగం లో సార్వజనిక ప్రసారం సంబంధి సహకారాన్ని ప్రోత్సహించడం కోసమని మలేశియా కు చెందిన సార్వజనిక సేవా ప్రసార సంస్థ రేడియో టెలివిజన్ మలేశియా తో ఒక అవగాహన పూర్వక ఒప్పంద పత్రం (ఎమ్ఒయు )పై భారతదేశాని కి చెందిన సార్వజనిక ప్రసార సేవల సంస్థ అయినటువంటి ప్రసార భారతి సంతకాలు చేసింది.

 

 

***



(Release ID: 1990952) Visitor Counter : 72