ఆరోగ్య, కుటుంబ సంక్షేమ‌ మంత్రిత్వ శాఖ
azadi ka amrit mahotsav

వికసిత భారత్ సంకల్ప యాత్ర


వికసిత భారత్ సంకల్ప యాత్రలో నాణ్యమైన ఆరోగ్య సంరక్షణ సేవలు అందరికీ అందుబాటులోకి తీసుకరావడానికి అమలు చేస్తున్న 1 కోటి పైగా ఆయుష్మాన్ కార్డులు పంపిణీ

వికసిత భారత్ సంకల్ప యాత్రలో భాగంగా నిర్వహించిన 79,487 ఆరోగ్య శిబిరాలను సందర్శించి సేవలు పొందిన 1,31,66,365 మంది ప్రజలు

49 లక్షలకు మించి క్షయ వ్యాధి నిర్ధారణ పరీక్షలు, మెరుగైన ఆరోగ్య సౌకర్యాల కోసం 3.4 లక్షల మందికి పైగా ప్రజలు సిఫార్సు

5 లక్షల మందికి పైగా ప్రజలకు రక్తహీనత పరీక్షలు, మెరుగైన ఆరోగ్య సౌకర్యాలు పొందాలని 21,000 మందికి పైగా ప్రజలకు సూచన

Posted On: 22 DEC 2023 12:52PM by PIB Hyderabad

దేశంలో ఆరోగ్య మౌలిక సదుపాయాలను బలోపేతం చేసి నాణ్యమైన ఆరోగ్య సేవలు అందించడానికి జరుగుతున్న ప్రయత్నాల్లో ఒక ముఖ్యమైన ఘట్టం చోటుచేసుకుంది. దేశవ్యాప్తంగా జరుగుతున్న వికసిత భారత్ సంకల్ప యాత్రలో 1,02,23,619 ఆయుష్మాన్ కార్డ్‌లు జారీ అయ్యాయి. వికసిత భారత్ సంకల్ప యాత్రలో భాగంగా ఇంతవరకు  ఇప్పటివరకు 3,462 గ్రామ పంచాయతీలు, పట్టణ స్థానిక సంస్థల పరిధిలో  79,487 ఆరోగ్య శిబిరాలు నిర్వహించారు. ఆరోగ్య శిబిరాల ద్వారా వైద్య సేవలు పొందిన ప్రజల సంఖ్య  1,31,66,365కి చేరుకుంది.

వికసిత భారత్ సంకల్ప యాత్రలో భాగంగా నిర్వహిస్తున్న ఆరోగ్య శిబిరాల్లో కింది కార్యకలాపాలు నిర్వహిస్తున్నారు:- 

ఆయుష్మాన్ భారత్ - ప్రధాన్ మంత్రి జన్ ఆరోగ్య యోజన (AB-PMJAY): కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ అత్యంత ప్రాధాన్యత ఇచ్చి ఆయుష్మాన్ భారత్ - ప్రధాన్ మంత్రి జన్ ఆరోగ్య యోజన కార్యక్రమాన్ని అమలు చేస్తోంది. ఆయుష్మాన్ యాప్‌ని ఉపయోగించి వికసిత భారత్ సంకల్ప యాత్రలోఆయుష్మాన్ కార్డులు జారీ చేస్తున్నారు. లబ్ధిదారులకు కార్డులు  పంపిణీ చేస్తున్నారు. ఇంతవరకు  23,83,473కి పైగా  ఆయుష్మాన్ కార్డులు జారీ అయ్యాయి. నిన్న జరిగిన ఆరోగ్య శిబిరాల్లో మొత్తం 6,34,168 ఆయుష్మాన్ కార్డులు జారీ అయ్యాయి. 

 

క్షయ వ్యాధి నిర్ధారణ కోసం  కఫం పరీక్షలు, అందుబాటులో ఉన్న చోట NAAT మెషీన్‌లను ఉపయోగించడం ద్వారా  రోగులను పరీక్షించడం జరుగుతుంది.  మరిన్ని పరీక్షల కోసం  క్షయ వ్యాధి అనుమానిత  కేసులను సిఫార్సు చేస్తున్నారు.  36వ రోజు ముగిసే సమయానికి, 49, 17,356కి పైగా స్క్రీనింగ్ పరీక్షలు జరిగాయి.  వీరిలో 3,41,499 కంటే ఎక్కువ మందిని మరిన్ని పరీక్షల కోసం పంపారు.

టీబీ సోకిన వారికి  ప్రధాన్ మంత్రి టీబీ ముక్త్ భారత్ అభియాన్ (PMTBMA) కింద ప్రభుత్వం సహకారం అందిస్తోంది. క్షయ వ్యాధితో బాధపడుతున్న రోగుల సమ్మతితో   నిక్షయ్ మిత్ర కింద వారికి సహాయం అందిస్తున్నారు. ప్రధాన్ మంత్రి టీబీ ముక్త్ భారత్ అభియాన్ కింద 1,17,734 కంటే ఎక్కువ మంది రోగులు సమ్మతి ఇచ్చారు .

నిక్షయ్ పోషణ్ యోజన (NPY) కింద, ప్రత్యక్ష ప్రయోజన బదిలీ ద్వారా టీబీ  రోగులకు ప్రభుత్వం ఆర్థిక సహకారం అందిస్తుంది. పెండింగ్‌లో ఉన్న లబ్ధిదారుల బ్యాంకు ఖాతా వివరాలను సేకరించి ఖాతాలకు ఆధార్ సీడింగ్ చేస్తున్నారు. ఇలా 30,093 మంది లబ్ధిదారుల వివరాలను సేకరించారు.

రక్తహీనత  వ్యాధి: గిరిజనలు ఎక్కువగా నివసిస్తున్న ప్రాంతాల్లో అర్హులైన వారికి ( 40 సంవత్సరాల వయస్సు వరకు) రక్తహీనత నిర్ధారణ  పాయింట్ ఆఫ్ కేర్ (PoC) లేదా సాల్యుబిలిటీ పరీక్షలు నిర్వహిస్తున్నారు.పాజిటివ్‌గా వచ్చిన కేసులను నిర్వహణ కోసం ఉన్నత కేంద్రాలకు పంపుతున్నారు. ఇప్పటివరకు 5,08,701 మందికి పైగా స్క్రీనింగ్ చేయబడ్డారు. పాజిటివ్‌గా తేలిన 21,793 మందిని మెరుగైన వైద్య సౌకర్యాల కోసం సిఫార్సు చేశారు. 

సంక్రమించని వ్యాధులు:  (NCDలు): అర్హత ఉన్న ప్రజలను  (30 ఏళ్లు మరియు అంతకంటే ఎక్కువ) హైపర్‌టెన్షన్, డయాబెటిస్ కోసం స్క్రీనింగ్ చేస్తున్నారు. అనుమానిత  పాజిటివ్‌ కేసులను ఉన్నత కేంద్రాలకు సిఫార్సు చేస్తున్నారు. దాదాపు 10,297,809 మందికి  హైపర్‌టెన్షన్, డయాబెటిస్ పరీక్షించారు. . 4,82,667 మందికి పైగా హైపర్‌టెన్షన్‌, 3,45,898 మందికి పైగా మధుమేహం ఉన్నట్లు గుర్తించారు.మెరుగైన వైద్య సేవల కోసం 7,59,451 మందికి పైగా ప్రజలు  ఉన్నత ప్రజారోగ్య సౌకర్యాలకు రెఫర్ చేయబడ్డారు.

నేపథ్యం: 

ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ నవంబర్ 15న జార్ఖండ్‌లోని ఖుంటి జార్ఖండ్‌లోని ఖుంటిలో వికసిత భారత సంకల్ప యాత్రను ప్రారంభించారు. కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాలకు  ప్రచారం కల్పించి, అర్హులైన వారందరికీ ప్రయోజనం కల్పించాలి అనే లక్ష్యంతో జరుగుతున్న వికసిత భారత సంకల్ప యాత్రలో పాల్గొంటున్న  ఐఈసీ  వ్యాన్లు నిలుస్తున్న ప్రాంతాల్లో ఆరోగ్య శిబిరాలు నిర్వహిస్తున్నారు. 

 

***


(Release ID: 1989766) Visitor Counter : 578