మహిళా, శిశు అభివృద్ధి మంత్రిత్వ శాఖ
azadi ka amrit mahotsav

వికసిత భారత సంకల్ప యాత్రలో మహిళా శిశు అభివృద్ధి మంత్రిత్వ శాఖ అమలు చేస్తున్న పథకాల కోసం నమోదు చేసుకున్న 63,000 మంది శాఖ నిర్వహించిన ఆరోగ్యకరమైన పిల్లల పోటీలో పాల్గొన్న 57000 మందికి పైగా పిల్లలు

Posted On: 20 DEC 2023 12:17PM by PIB Hyderabad

వికసిత భారత సంకల్ప యాత్రలో  మహిళా శిశు అభివృద్ధి మంత్రిత్వ శాఖ అమలు చేస్తున్న పథకాల కోసం 63,000 మంది తమ పేర్లు  నమోదు చేసుకుని ప్రభుత్వ పథకాల పట్ల నమ్మకాన్ని ప్రదర్శించారు.  

పిల్లలకు ఆరోగ్యకరమైన భవిష్యత్తును అందించడం ఒక లక్ష్యంగా వికసిత భారత సంకల్ప యాత్ర జరుగుతోంది.  పిల్లల ఆరోగ్య సమస్యలపై దృష్టి సారించి రాష్ట్రాలు/కేంద్రపాలిత ప్రాంతాలు ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహిస్తున్నాయి. యాత్రలో భాగంగా నిర్వహించిన  ఆరోగ్యకరమైన పిల్లల పోటీలో   57000 కంటే ఎక్కువ మంది పిల్లలు పాల్గొన్నారు.

వికసిత భారత సంకల్ప యాత్ర లో పాల్గొంటున్న వారిలో  50% మంది మహిళలు ఉంటున్నారు.అభివృద్ధి సాధన, సాధికారత కోసం మహిళలు చేస్తున్న కృషికి ఇది నిదర్శనం గా ఉంటుంది. 

దేశవ్యాప్తంగా జరుగుతున్న వికసిత భారత సంకల్ప యాత్రలో మహిళా, శిశు అభివృద్ధి మంత్రిత్వ శాఖ  చురుకుగా పాల్గొంటోంది. మహిళా, శిశు అభివృద్ధి మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో  "మేరీ కహానీ మేరీ జుబానీ (MKMZ)"కార్యక్రమం ప్రతి యాత్రలో నిర్వహిస్తున్నారు.  ప్రతి గ్రామ పంచాయతీకి చెందిన  లబ్ధిదారులు వారి అనుభవాలు, వారి జీవితాలపై అంగన్‌వాడీ సేవలు  చూపిన ప్రభావం గురించి వివరిస్తున్నారు. 

***

SS/TFK

 

***



(Release ID: 1988955) Visitor Counter : 98