యువజన వ్యవహారాలు, క్రీడల మంత్రిత్వ శాఖ
azadi ka amrit mahotsav

ఖేలో ఇండియా పారా గేమ్స్ 2023లో పారా అథ్లెట్లకు మరింత మెరుగైన సహకారాన్ని అందించడానికి ఖేలో ఇండియా, స్వయం కలిసి పనిచేశాయి.

Posted On: 19 DEC 2023 2:39PM by PIB Hyderabad

ఖేలో ఇండియా పారా గేమ్స్ సందర్భంగా న్యూఢిల్లీలో రవాణా మరియు మౌలిక సదుపాయాలను అందుబాటులోకి తీసుకురావడానికి యువజన వ్యవహారాలు మరియు క్రీడల మంత్రిత్వ శాఖ యొక్క ఫ్లాగ్‌షిప్ ప్రోగ్రామ్ ఖేలో ఇండియా, భారతదేశం యొక్క అగ్రగామి యాక్సెసిబిలిటీ ఆర్గనైజేషన్ అయిన స్వయం కలిసి పనిచేయడానికి  చేతులు కలిపాయి.

ఖేలో ఇండియా పారా గేమ్స్ పాల్గొనే1400 కంటే ఎక్కువ మంది పారా- అథ్లెట్లకు అందుబాటులో ఉండే రవాణా సేవలు అందించబడ్డాయి. 8 రోజుల పాటు జరిగే ఈ ఈవెంట్ ప్రారంభంలో 300 కంటే ఎక్కువ మంది వలంటీర్లు మరియు ఆటలకు సంబంధించిన అధికారులు అవగాహన కల్పించారు. అన్ని పారా-అథ్లెట్లు, పారా -అఫీషియల్స్ మరియు పారా-కోచ్‌ల కోసం రైల్వే స్టేషన్‌లు, బస్ స్టేషన్‌లు మరియు ఎయిర్‌పోర్ట్‌తో సహా నగరానికి చేరుకోవడం నుండి బయలుదేరే వరకు అందుబాటులో ఉండే బస్సులు మరియు మినీవ్యాన్‌లు సిద్ధంగా ఉంచబడ్డాయి. ఇంకా, ఏర్పాట్లు చేసేటప్పుడు వసతి (హోటల్‌లు/హాస్టల్‌లు) మరియు సంబంధిత స్టేడియంల మధ్య కూడా రవాణా  సదుపాయం కలువబడుతుంది.

ఖేలో ఇండియా పారా గేమ్స్ 2023లో  500 కంటే ఎక్కువ మంది వీల్‌చైర్ ఉపయోగించే క్రీడాకారులు పాల్గొన్నారు. అందువల్ల, వారికి అందుబాటులో ఉండే మౌలిక సదుపాయాలను అందించడం అత్యంత ప్రాధాన్యత అంశంగా మారింది.  ఇది కేవలం హ్యాండ్‌రైల్‌లతో కూడిన ర్యాంప్‌లు మాత్రమే కాకుండా అందుబాటులో ఉండే టాయిలెట్‌లు, యాక్సెస్ చేయగల సీటింగ్ మరియు పారా ప్లేయర్‌లు మరియు ప్రేక్షకుల కోసం యాక్సెస్ చేయగల పార్కింగ్‌లు కూడా అందుబాటులో ఉంచారు. ఒక క్రీడాకారుడు వీల్‌చైర్‌ని ఉపయోగిస్తున్నా, దృష్టి లోపం కలిగి ఉన్నా లేదా ఇతర సవాళ్లను ఎదుర్కొంటున్నా, అందుబాటులో ఉన్న యాక్సెసిబిలిటీతో, వారు అందరిలాగే క్రీడలను ఆస్వాదించగలుగుతారు. ఈ సదుపాయాల ద్వారా  ఖేలో ఇండియా ప్రతి ఒక్కరూ తమ నైపుణ్యాలను ప్రదర్శించడానికి అనుమతించింది.

పారాలింపిక్ రజత పతక విజేత భావినా పటేల్ మాట్లాడుతూ.. సమగ్ర మౌలిక సదుపాయాలు మరియు అందుబాటులో ఉండే రవాణా వ్యవస్థ.. అంటే ఒక పారా-ప్లేయర్ కోసం ర్యాంప్‌లు మరియు నిర్దేశిత స్థలాల కంటే ఎక్కువ.  ఇది మాకు సమాన అవకాశాల స్థలాన్ని అందిస్తుంది. చాలా మంది ప్రజలు యాక్సెస్ చేయగల రవాణా యొక్క ప్రాముఖ్యతను అర్థం చేసుకోలేరు. కానీ పారా-ప్లేయర్‌లుగా  ఈ క్రీడా ఈవెంట్‌ల సమయంలో యాక్సెస్ చేయగల వ్యాన్ లేదా బస్సును అందించినప్పుడు మనం ఎంత గౌరవంగా మరియు సురక్షితంగా ఉంటామో ప్రత్యక్షంగా అనుభవించాము. అదేవిధంగా, ఆటల వద్ద అనువైన టాయిలెట్లను అందుబాటులోకి తెచ్చే విధంగా, వాటిని అన్ని సౌకర్యాలలో అంతర్భాగంగా చేయాలి. ఖేలో ఇండియా మరియు స్వయం ఈ బాధ్యతను చేపట్టి మైదానంలో అందుబాటులోకి తెచ్చినందుకు నేను నిజంగా అభినందిస్తున్నాన’న్నారు.

సురక్షితమైన మరియు గౌరవప్రదమైన అనుభవాన్ని నిర్ధారించడానికి అందుబాటులో ఉండే వాతావరణం యొక్క ఆవశ్యకతను గుర్తిస్తూ, పారా-అథ్లెట్లు, అధికారులు మరియు కోచ్‌ల రాకపోకలకు- అది రైల్వే స్టేషన్‌లు, బస్ స్టేషన్‌లు కావచ్చు లేదా విమానాశ్రయం అందుబాటులో ఉండే బస్సులు మరియు మినీవ్యాన్‌ల సముదాయాన్ని అందుబాటులో ఉంచారు. వీటికి అదనంగా క్రీడాపోటీలు జరిగే అన్ని ప్రాంతాల్లో  ప్రతి పారా- అథ్లెట్‌కు సహకారం అందించడంపై అధికారులు మరియు వలంటీర్‌లకు అవగాహన కల్పించడానికి ఆటలకు ముందు బహుళ వర్క్‌షాప్‌లు నిర్వహించబడ్డాయి. స్వయం నిర్వహించే చలనశీలత తగ్గిన వ్యక్తులతో సరైన ప్రవర్తన మరియు సంభాషణలో శిక్షణ వల్ల పారా అథ్లెట్లు ఆటలో భాగస్వాములను చేయడమే కాకుండా  వారి గౌరవాన్ని పెంపొందించింది. ఇది వారి శారీరక సామర్థ్యాలతో సంబంధం లేకుండా ప్రతి ఒక్కరికీ సహాయక, స్వాగతించే వాతావరణాన్ని నిర్ధారిస్తుంది.  అందరిలో తాదాత్మ్యం మరియు అవగాహనను ప్రోత్సహిస్తుంది.

ఖేలో ఇండియా,  స్వయం మధ్య సహకారం  వల్ల భారతదేశంలో అందుబాటులో ఉండే క్రీడా వాతావరణాన్ని సృష్టించేందుకు ఒక ముఖ్యమైన అడుగుగా మారింది. శారీరక సామర్థ్యాలతో సంబంధం లేకుండా ప్రతి ఒక్కరూ దేశాన్ని ఏకం చేసే క్రీడల్లో పాల్గొనడం, పోటీపడడం మరియు ఉత్సాహంగా ఉండేలా చూడాలనే అంకితభావాన్ని  ఈ రెండింటి కలయిక ప్రతిబింబిస్తుంది.

***


(Release ID: 1988524) Visitor Counter : 83