ఆరోగ్య, కుటుంబ సంక్షేమ‌ మంత్రిత్వ శాఖ
azadi ka amrit mahotsav

విక్షిత్ భారత్ సంకల్ప్ యాత్ర


65,300 విక్షిత్ భారత్ ఆరోగ్య శిబిరాల్లో మొత్తం 1 కోటికి పైగా సందర్శనలు

శిబిరాల వద్ద 84 లక్షలకు పైగా ఆయుష్మాన్ కార్డుల జారీ

36.4 లక్షల మందికి పైగా టీబీ పరీక్షలు మరియు 2.6 లక్షల మందికి పైగా ప్రజలకు ఉన్నత ప్రజారోగ్య సౌకర్యాల కోసం సూచనలు

3.8 లక్షల మందికి పైగా ప్రజలకు సికిల్ సెల్ డిసీజ్ పరీక్షలు వారిలో 18,000 కంటే ఎక్కువ మందికి ఉన్నత ప్రజారోగ్య సౌకర్యాలకు సూచనలు

Posted On: 19 DEC 2023 1:28PM by PIB Hyderabad

ప్రస్తుతం కొనసాగుతున్న విక్షిత్ భారత్ సంకల్ప్ యాత్రలో భాగంగా  ఇప్పటి వరకు 3,156 గ్రామ పంచాయతీలు మరియు పట్టణ స్థానిక సంస్థలలో నిర్వహించిన 65,348 ఆరోగ్య శిబిరాలకు వచ్చిన సందర్శకుల సంఖ్య 1,03,55,555కి చేరుకుంది.

 

image.png


ఆరోగ్య శిబిరాల్లో కింది కార్యకలాపాలు నిర్వహించబడుతున్నాయి:

ఆయుష్మాన్ భారత్ - ప్రధాన్ మంత్రి జన్ ఆరోగ్య యోజన (ఎబి-పిఎంజెఎవై):  విక్షిత్ భారత్ సంకల్ప్ యాత్రలో భాగంగా ఎంఒహెచ్‌ఎఫ్‌డబ్ల్యూ ఫ్లాగ్‌షిప్ పథకం కింద ఆయుష్మాన్ యాప్‌ని ఉపయోగించి ఆయుష్మాన్ కార్డ్‌లు జారీ చేయబడుతున్నాయి. లబ్ధిదారులకు ఆ భౌతిక కార్డులు పంపిణీ చేయబడుతున్నాయి. ఇప్పటి వరకు 19,03,200కి పైగా ఫిజికల్ కార్డులు పంపిణీ చేయబడ్డాయి.

నిన్న జరిగిన ఆరోగ్య శిబిరాల్లో మొత్తం 5,31,025 ఆయుష్మాన్ కార్డులు సృష్టించబడ్డాయి. మొత్తంగా ఇప్పటి వరకు 84,27,500 కార్డులు సృష్టించబడ్డాయి.

క్షయవ్యాధి (టిబి): లక్షణాల కోసం పరీక్షించడం, కఫం పరీక్ష మరియు అందుబాటులో ఉన్న చోట ఎన్‌ఎఎటి యంత్రాలను ఉపయోగించడం ద్వారా రోగులకు టిబి స్క్రీనింగ్ నిర్వహించబడుతుంది.టిబి ఉన్నట్లు అనుమానించబడిన కేసులను ఉన్నత సౌకర్యాలకు సూచిస్తారు. 34వ రోజు ముగిసే సమయానికి 36,48,700 కంటే ఎక్కువ మంది వ్యక్తులు పరీక్షించబడ్డారు. వీరిలో 2,63,000 కంటే ఎక్కువ మంది ఉన్నత ప్రజారోగ్య సౌకర్యాలకు సూచించబడ్డారు.

ప్రధాన్ మంత్రి టిబి ముక్త్ భారత్ అభియాన్ (పిఎంటిబిఎంఎ) కింద టిబితో బాధపడుతున్న రోగులనుండి నిక్షయ్ మిత్రల నుండి సహాయం పొందడం కోసం సమ్మతి తీసుకోబడింది. నిక్షయ్ మిత్రలుగా ఉండటానికి సిద్ధంగా ఉన్న హాజరైన వారికి ఆన్-స్పాట్ రిజిస్ట్రేషన్ కూడా అందించబడుతుంది.పిఎంటిబిఎంఎ కింద ఇప్పటివరకూ 1,19,500 కంటే ఎక్కువ మంది రోగులు సమ్మతి ఇచ్చారు మరియు 46,700 కంటే ఎక్కువ మంది కొత్త నిక్షయ్ మిత్రలు నమోదు చేయబడ్డారు.

నిక్షయ్ పోషణ్ యోజన (ఎన్‌పివై) కింద, ప్రత్యక్ష ప్రయోజన బదిలీ ద్వారా టిబి రోగులకు నగదు సహాయం అందించబడుతుంది. ఇందుకోసం పెండింగ్‌లో ఉన్న లబ్ధిదారుల బ్యాంకు ఖాతా వివరాలను సేకరించి ఖాతాలకు ఆధార్ సీడింగ్ చేస్తున్నారు. ఇలా 31,300 మంది లబ్ధిదారుల వివరాలను సేకరించారు.

సికిల్ సెల్ డిసీజ్: గిరిజన జనాభా ఎక్కువగా ఉన్న ప్రాంతాల్లో ఎస్‌సిడి కోసం పాయింట్ ఆఫ్ కేర్ (పిఒసి) పరీక్షల ద్వారా లేదా సాల్యుబిలిటీ ద్వారా సికిల్ సెల్ డిసీజ్ (ఎస్‌సిడి)ని గుర్తించడం కోసం అర్హులైన జనాభా (40 సంవత్సరాల వరకు) స్క్రీనింగ్ జరుగుతోంది. పరీక్ష పాజిటివ్‌గా వచ్చిన కేసులను నిర్వహణ కోసం ఉన్నత కేంద్రాలకు పంపుతున్నారు. ఇప్పటివరకు 3,83,000 మందికి పైగా స్క్రీనింగ్ చేయబడ్డారు, వారిలో 18,300 మంది పాజిటివ్‌గా ఉన్నట్లు కనుగొనబడింది మరియు ఉన్నత ప్రజారోగ్య సౌకర్యాలకు సూచించబడింది.

నాన్-కమ్యూనికేబుల్ డిసీజెస్ (ఎన్‌సిడిలు): హైపర్‌టెన్షన్ మరియు డయాబెటిస్ పరీక్షలు అవసరమైన వారికి  (30 సంవత్సరాలు మరియు అంతకంటే ఎక్కువ) స్క్రీనింగ్ చేయబడుతోంది మరియు పాజిటివ్‌గా అనుమానించబడిన కేసులను ఉన్నత కేంద్రాలకు సిఫార్సు చేస్తున్నారు. దాదాపు 81,15,000 మందిని హైపర్‌టెన్షన్ మరియు డయాబెటిస్ కోసం పరీక్షించారు. వారిలో 3,74,000 మందికి పైగా హైపర్‌టెన్షన్‌ ఉన్నట్లు అనుమానించబడింది మరియు 2,69,800 మందికి పైగా మధుమేహం ఉన్నట్లు అనుమానించబడింది మరియు 5,99,200 మందికి పైగా ప్రజలు ఉన్నత ప్రజారోగ్య సౌకర్యాలకు రెఫర్ చేయబడ్డారు.

 

image.png

అండమాన్ & నికోబార్ దీవులు

 

image.png

పల్నాడు, ఆంధ్రప్రదేశ్

 

 

image.png

ఎగువ సియాంగ్, అరుణాచల్ ప్రదేశ్

 

 

image.png

ఉదల్గురి, అస్సాం

 

 

image.png

దక్షిణ గోవా, గోవా


 

image.png

రోహ్తక్, హర్యానా


 

నేపథ్యం:
కేంద్ర ప్రభుత్వ పథకాల ప్రయోజనాల పట్ల దేశవ్యాప్తంగా ప్రజల్లో అవగాహన కల్పించేందుకు విక్షిత్ భారత్ సంకల్ప్ యాత్రను గౌరవనీయ  ప్రధానమంత్రి నవంబర్ 15న జార్ఖండ్‌లోని ఖుంటి నుండి ప్రారంభించారు. విక్షిత్ భారత్ సంకల్ప్ యాత్ర కింద ఆన్-స్పాట్ సేవల్లో భాగంగా గ్రామ పంచాయతీలలో ఐఈసీ వ్యాన్‌ను నిలిపి ఆరోగ్య శిబిరాలను నిర్వహిస్తున్నారు.

 

****



(Release ID: 1988523) Visitor Counter : 74