మంత్రిమండలి
azadi ka amrit mahotsav

డిజిటల్ రంగంలోని పాపులేషన్ స్కేల్‌లో అమలు చేయబడిన విజయవంతమైన డిజిటల్ సోల్యూషన్స్‌ను పంచుకునే రంగంలో సహకారంపై భారతదేశం మరియు టాంజానియా మధ్య సంతకం చేసిన అవగాహన ఒప్పందాన్ని (ఎంఓయూ) ఆమోదించిన కేంద్ర మంత్రివర్గం

Posted On: 15 DEC 2023 7:38PM by PIB Hyderabad

రిపబ్లిక్ ఆఫ్ ఇండియా ఎలక్ట్రానిక్స్ మరియు ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ మంత్రిత్వ శాఖ మరియు యునైటెడ్ రిపబ్లిక్ ఆఫ్ టాంజానియాకు చెందిన  ఇన్ఫర్మేషన్, కమ్యూనికేషన్ మరియు ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ మంత్రిత్వ శాఖ మధ్య 2023 అక్టోబర్ 09న సంతకం చేసిన అవగాహన ఒప్పందాన్ని గౌరవనీయ ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ అధ్యక్షతన జరిగిన కేంద్ర మంత్రివర్గం ఆమోదం తెలిపింది. ఈ ఒప్పందం డిజిటల్ పరివర్తన కోసం పాపులేషన్ స్కేల్‌లో అమలు చేయబడిన విజయవంతమైన డిజిటల్ సొల్యూషన్‌లను పంచుకునే రంగంలో సహకారానికి సంబంధించినది.

రెండు దేశాల డిజిటల్ పరివర్తన చొరవను అమలు చేయడంలో సన్నిహిత సహకారం మరియు అనుభవాల మార్పిడి, డిజిటల్ టెక్నాలజీ ఆధారిత పరిష్కారాలను ప్రోత్సహించాలని ఎమ్ఒయు ఉద్దేశించింది.

డిజిటల్ పబ్లిక్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ (డిపిఐ) రంగంలో జీ2జీ మరియు బి2బి ద్వైపాక్షిక సహకారం రెండూ మెరుగుపరచబడతాయి. ఈ అవగాహన ఒప్పందానికి సంబంధించిన కార్యకలాపాలు వారి పరిపాలన యొక్క సాధారణ నిర్వహణ కేటాయింపుల ద్వారా నిధులు సమకూరుస్తాయి.

ఐటీ రంగంలో ఉపాధి అవకాశాలకు దారితీసే మెరుగైన సహకారానికి ఈ ఎమ్ఒయు ఉపయోగపడుతుంది.

నేపథ్యం:

ఐసీటీ డొమైన్‌లో ద్వైపాక్షిక మరియు బహుపాక్షిక సహకారాన్ని పెంపొందించడం కోసం ఎంఇఐటివై పలు దేశాలు మరియు  ఏజెన్సీలతో సహకరిస్తోంది. ఈ నేపథ్యంలో ఎంఇఐటివై ఐసీటీ  డొమైన్‌లో సహకారాన్ని మరియు సమాచార మార్పిడిని ప్రోత్సహించడానికి వివిధ దేశాలకు చెందిన  సంస్థలు/ఏజెన్సీలతో అవగాహన ఒప్పందాలు/ఎంఒసీలు/ఒప్పందాలను కుదుర్చుకుంది. ఇది డిజిటల్ ఇండియా, ఆత్మనిర్భర్ భారత్, మేక్ ఇన్ ఇండియా మొదలైన భారత ప్రభుత్వం చేపట్టిన వివిధ కార్యక్రమాలకు అనుగుణంగా దేశాన్ని డిజిటల్ సాధికారత కలిగిన సమాజంగా మరియు విజ్ఞాన ఆర్థిక వ్యవస్థగా మార్చడానికి సహకరిస్తుంది. నిరంతరం అభివృద్ధి చెందుతున్న ఈ రంగంలో పరస్పర సహకారాన్ని పెంపొందించే లక్ష్యంతో వ్యాపార అవకాశాలను అన్వేషించడం, ఉత్తమ పద్ధతులను పంచుకోవడం మరియు డిజిటల్ రంగంలో పెట్టుబడులను ఆకర్షించడం  అవసరం.

గత కొన్ని సంవత్సరాలుగా డిజిటల్ పబ్లిక్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ (డిపిఐ) అమలులో భారతదేశం తన నాయకత్వాన్ని ప్రదర్శిస్తోంది. కొవిడ్‌ మహమ్మారి సమయంలో కూడా ప్రజలకు సేవలను విజయవంతంగా అందించింది. ఫలితంగా అనేక దేశాలు భారతదేశ అనుభవాల నుండి నేర్చుకోవడానికి భారతదేశంతో అవగాహన ఒప్పందాలను కుదుర్చుకోవడానికి ఆసక్తిని కనబరుస్తున్నాయి.

ఇండియా స్టాక్ సొల్యూషన్స్ అనేది పబ్లిక్ సర్వీసెస్ యాక్సెస్ & డెలివరీని అందించడానికి జనాభా స్థాయిలో భారతదేశం అభివృద్ధి చేసిన మరియు అమలు చేసిన డిపీలు. ఇది అర్థవంతమైన కనెక్టివిటీని అందించడం, డిజిటల్ చేరికను ప్రోత్సహించడం మరియు ప్రజా సేవలకు అవాంతరాలు లేని యాక్సెస్‌ను ప్రారంభించడం లక్ష్యంగా పెట్టుకుంది. ఇవి ఓపెన్ టెక్నాలజీలపై నిర్మించబడ్డాయి, పరస్పరం పనిచేయగలవు మరియు ఆవిష్కరణలను ప్రోత్సహించే పరిశ్రమ మరియు సమాజ భాగస్వామ్యాన్ని ఉపయోగించుకునేలా రూపొందించబడ్డాయి. అలాగే డిపీఐని నిర్మించడంలో ప్రతి దేశానికి ప్రత్యేక అవసరాలు మరియు సవాళ్లు ఉంటాయి. అయినప్పటికీ ప్రాథమిక కార్యాచరణ సారూప్యంగా ఉంటుంది ఇది ప్రపంచ సహకారాన్ని అనుమతిస్తుంది.

 

****


(Release ID: 1987049) Visitor Counter : 97