ప్రధాన మంత్రి కార్యాలయం
‘వికసిత్ భారత్ @ 2047: వాయిస్ ఆఫ్ యూథ్’ ను ప్రారంభించిన ప్రధాన మంత్రి
‘‘భారతదేశం యొక్క చరిత్ర లో ఇది ఎటువంటి కాలం అంటే ఈ కాలం లో దేశం ఒక పెద్ద అంగ ను వేయబోతోంది’’
‘‘భారతదేశాని కి ఇదే అదును, సరి అయినటువంటి అదును’’
‘‘మన స్వాతంత్య్రపోరాటం మనకు ఒక అతి పెద్ద ప్రేరణ గా ఉంది; అప్పట్లో దేశవ్యాప్త ప్రయాస ల ఏకైక లక్ష్యం స్వాతంత్ర్యం సాధన పైన కేంద్రీకృతంఅయింది’’
‘‘ప్రస్తుతం, మీ యొక్క లక్ష్యాలు, మీ యొక్క సంకల్పాలు ఒక్కటే కావాలి - అదే అభివృద్ధి చెందిన భారతదేశం’’
‘‘ ‘ఐడియా’ అనేది ‘ఐ’ అనే అక్షరం తోమొదలవుతుంది; ఎలాగైతే ‘ఇండియా’ అనే మాట ‘ఐ’ అనే అక్షరం తో మొదలవుతుందో, అభివృద్ధి ప్రయాస లు స్వయం నుండి మొదలవుతాయి’’
‘‘పౌరులు ఎప్పుడైతే వారి భూమిక లో వారి యొక్కకర్తవ్యాన్ని ఆచరించడం మొదలు పెడతారో, అప్పుడు దేశం మునుముందుకు సాగిపోతుంటుంది’’
‘‘దేశ పౌరులు గామనకు ఒక పరీక్ష తేదీ ని ప్రకటించడం అనేది జరిగిపోయింది. మన ముందు 25 సంవత్సరాల అమృత కాలం ఉన్నది. మనం రోజు లో 24 గంటల సేపు పని చేస్తూ ఉండాలి సుమా’’
‘‘యువ శక్తి అనేదిమార్పున కు వాహకం, అలాగే పరివర్తన యొక్క లబ్ధిదారు కూడాను’’
‘‘ప్రగతి యొక్క మార్గసూచీ ని ప్రభుత్వం ఒక్కటే కాక దేశ ప్రజలు సైతంనిర్ణయిం
Posted On:
11 DEC 2023 11:40AM by PIB Hyderabad
ప్రధాన మంత్రి శ్రీ నరంద్ర మోదీ ఈ రోజు న వీడియో కాన్ఫరెన్సింగ్ మాధ్యం ద్వారా ‘వికసిత్ భారత్ @ 2047: వాయిస్ ఆఫ్ యూథ్’ ను ప్రారంభించారు. కార్యక్రమం లో భాగం గా ప్రధాన మంత్రి ఈ కార్యక్రమం యొక్క ఆరంభం లో రాజ్ భవన్ లలో ఏర్పాటు చేసిన కార్యశాలల్లో విశ్వవిద్యాలయాల వైస్ చాన్స్ లర్ లు, సంస్థల ప్రముఖులు మరియు ఫేకల్టీ మెంబర్స్ ను ఉద్దేశించి ప్రసంగించారు.
వికసిత్ భారత్ కార్యక్రమాన్ని ముందుకు తీసుకు పోవాలన్న ఉద్దేశ్యం తో ఈ రోజు న వర్క్ శాపుల ను ఏర్పాటు చేసినందుకు గాను గవర్నరు లు అందరి కి అనేకానేక ధన్యవాదాల ను ప్రధాన మంత్రి తెలియజేస్తూ, తన ప్రసంగాన్ని మొదలు పెట్టారు. ఈ సంకల్పం విషయం లో ఈ రోజు ఒక ప్రత్యేకమైన సందర్భం అని ఆయన అన్నారు. వికసిత్ భారత్ 2047 యొక్క లక్ష్యాన్ని నెరవేర్చడం లో దేశం లోని యువత కు మార్గనిర్దేశం చేసే బాధ్యత ను సంబాళించేటటువంటి స్టేక్ హోల్డర్స్ అందరిని ఒక చోటు కు తీసుకు వచ్చిన వ్యక్తుల తోడ్పాటుల ను ఆయన ప్రశంసించారు. ఏ వ్యక్తి యొక్క వ్యక్తిత్వ వికాసం లో విద్య బోధన సంస్థ ల పాత్ర చాలా ముఖ్యం అని ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ అన్నారు. ఏ దేశం అయినా ఆ దేశం లోని ప్రజలు అభివృద్ధి చెందినప్పుడే అభివృద్ధి చెందగలుగుతుంది అని ఆయన పేర్కొన్నారు. వర్తమాన కాలం లో వ్యక్తిత్వ వికాసాని కి ఉన్నటువంటి ప్రాముఖ్యాన్ని ప్రధాన మంత్రి స్పష్టం చేస్తూ, వాయస్ ఆఫ్ యూథ్ (యువ వాణి) వర్క్ శాప్ సఫలం అవ్వాలని శుభాకాంక్షల ను వ్యక్తం చేశారు.
ఏ దేశం యొక్క మనుగడ లో అయినా, చరిత్ర ఒక అవకాశాన్ని అనుగ్రహిస్తుంది, ఆ కాలం లో సదరు దేశం తన అభివృద్ధి యాత్ర లో పెద్ద పెద్ద అడుగుల ను వేసేందుకు వీలు ఉంటుంది అని ప్రధాన మంత్రి అన్నారు. భారతదేశాని కి వచ్చే సరికి ‘‘ప్రస్తుతం ఈ తరహా అమృత కాలం కొనసాగుతున్నది’’, మరి ‘‘ఇది భారతదేశ చరిత్ర లో ఎటువంటి కాలఖండం అంటే ఈ తరుణం లో దేశం భారీ ముందంజ ను వేయబోతున్నది’’ అని ప్రధాన మంత్రి అన్నారు. చుట్టుప్రక్కల గల అనేక దేశాల ను గురించి ఆయన ఉదాహరిస్తూ, ఆ దేశాలు ఒక నిర్దిష్ట కాలం లో ఎంతటి పెద్ద పెద్దవైన అంగలను వేశాయి అంటే అవి అభివృద్ధి చెందిన దేశాలు గా మారిపోయాయి అన్నారు. ‘‘భారతదేశం విషయాని కి వస్తే, ఈ కాలం సరి అయినటువంటి కాలం గా ఉంది’’ అని ఆయన అన్నారు. ఈ అమృత కాలం లో ప్రతి ఒక్క క్షణాన్ని ఉపయోగించుకోవాలి అని ఆయన చెప్పారు.
స్వేచ్ఛ కోసం సాగిన గౌరవశాలి సంఘర్షణ ప్రేరణ ను ఇచ్చింది అని ప్రధాన మంత్రి పునరుద్ఘాటించారు. ఆ కాలం లో జరిగిన ప్రతి ఒక్క ప్రయాస ఉదాహరణ కు సత్యాగ్రహం, క్రాంతికారి పథం, సహాయ నిరాకరణ, స్వదేశీ ఉద్యమం, సామాజిక సంస్కరణ లు, విద్య బోధన రంగ సంబంధి సంస్కరణ లు.. ఇవి అన్నీ స్వాతంత్య్రం సాధన దిశ లో మహత్వపూర్ణమైనటువంటి అడుగులు గా పరిణమించాయి అని ఆయన వివరించారు. ఆ కాలం లో కాశీ, లక్నో, విశ్వ భారతి, గుజరాత్ విద్యాపీఠ్, నాగ్ పుర్ విశ్వవిద్యాలయం, అన్నామలై, ఆంధ్ర , ఇంకా యూనివర్సిటీ ఆఫ్ కేరళ వంటి విశ్వవిద్యాలయాలు దేశ ప్రజల అంతరాత్మ ను బలపరచాయి అని ఆయన వివరించారు. దేశాని కి స్వాతంత్య్రం కోసం అంకితం చేసుకొన్న యువత తాలూకు ఒక తరం యావత్తు ముందుకు వచ్చింది, ఆ తరం ప్రతి ప్రయత్నం స్వాతంత్య్రం సాధన లక్ష్యం మీదే కేంద్రితం అయింది అని శ్రీ నరేంద్ర మోదీ అన్నారు. ‘‘ప్రస్తుతం ప్రతి ఒక్క సంస్థ, ప్రతి వ్యక్తి కూడా వారి ప్రతి కార్యం వికసిత్ భారత్ ఆవిష్కరణ కోసమే లి అనే సంకల్పం తో సాగాలి. మీ యొక్క ధ్యేయాలు, మీ యొక్క సంకల్పాలు అన్నీ ఒకే ఒక్క లక్ష్యాన్ని కలిగివుండాలి, అది ఏమిటి అంటే అభివృద్ధి చెందిన భారతదేశాన్ని ఆవిష్కరించాలి అనేదే’’ అని శ్రీ నరేంద్ర మోదీ అన్నారు. భారతదేశాన్ని త్వరిత గతి న ఒక అభివృద్ధి చెందిన దేశం గా తీర్చిదిద్దడం కోసం ఏయే మార్గాల లో పయనించాలి అనేది గురువు లు మరియు విశ్వవిద్యాలయాలు ఆలోచనలను చేయాలి. అంతేకాదు, అభివృద్ధి చెందిన దేశం గా మారేందుకు మెరుగుదల అనేది ఏయే నిర్దిష్ట రంగాల లో జరగాలో అనేది కూడా గుర్తించాలి అని ప్రధాన మంత్రి నొక్కి పలికారు.
దేశం లోని అన్ని విశ్వవిద్యాలయాల విద్యార్థులతో పాటు యువతరం శక్తి సామర్థ్యాలను కూడా సమష్టి లక్ష్యమైన వికసిత భారతం వైపు మళ్లించవలసిన ఆవశ్యకత ను ప్రధాన మంత్రి మోదీ నొక్కిచెప్పారు. వైవిధ్యంతో నిండిన ఆలోచనల గురించి ప్రస్తావిస్తూ- వికసిత భారతం నిర్మాణ కృషిలో వాటన్నిటినీ సమన్వయం చేసుకుంటూ ప్రధాన స్రవంతితో అనుసంధానించాలని ఆయన సూచించారు. వికసిత భారతం@2047 కల సాకారాని కి సహకరించడం లో ప్రతి ఒక్క వ్యక్తి శక్తివంచన లేకుండా ముందడుగు వేయాలి అని శ్రీ మోదీ కోరారు. ఈ కార్యక్రమంలో మరింత ఎక్కువ సంఖ్యలో యువతను అనుసంధానించేలా దేశంలోని ప్రతి కళాశాల, విశ్వవిద్యాలయం ప్రత్యేక ప్రచార కార్యక్రమాలు చేపట్టాలని సూచించారు. వికిసిత భారతం సంబంధిత ఆలోచనలను ఆహ్వానిస్తూ ఒక పోర్టల్ ను ప్రారంభించినట్లు ప్రధాన మంత్రి ప్రస్తావించారు. దీని ద్వారా 5 విభిన్న ఇతివృత్తాల పై సూచనల ను, సలహాల ను ఎవరైనా ఇవ్వవచ్చును. “వీటి నుండి 10 ఉత్తమ సూచనల కు బహుమతి కూడా ఉంటుంది. కాబట్టి, మీరు మీ సలహాల ను, సూచనల ను ‘మై గవ్’ (My Gov) ద్వారా పంపవచ్చు’’ అని ప్రధాన మంత్రి చెప్పారు. అలాగే ‘‘ఇండియా, ఐడియా అనే పదాలు ఆంగ్ల అక్షరం ‘ఐ’తో మొదలవుతాయి. అదే విధంగా అభివృద్ధి కూడా ‘ఐ’ (నా)తోనే ప్రారంభం కావాలని ప్రతి ఒక్కరూ సంకల్పించాలి’’ అని ప్రధాన మంత్రి ఉద్బోధించారు.
జాతీయ ప్రయోజనాలకు అగ్ర ప్రాధాన్యమిచ్చే అమృత తరాన్ని సృష్టించడమే ఈ సూచనల స్వీకరణ కసరత్తు లక్ష్యమని ప్రధాన మంత్రి వెల్లడించారు. విద్య, నైపుణ్యాలతో నిమిత్తం లేకుండా పౌరులందరిలోనూ జాతీయ ప్రయోజనాలు, పౌర విజ్ఞానం విషయంలో అప్రమత్తత అవశ్యమని పిలుపునిచ్చారు. ‘‘పౌరులు ఏ పాత్రలోనైనా కర్తవ్యం నిర్వర్తించగలిగినప్పుడే దేశం ముందంజ వేస్తుంది’’ అని ప్రధాన మంత్రి అన్నారు. జల సంరక్షణ, విద్యుత్తు పొదుపు, వ్యవసాయంలో రసాయనాల వాడకం తగ్గింపు, ప్రజా రవాణా వినియోగం వంటివి సహజ వనరుల సంరక్షణలో కీలకమని ఆయన ఉదాహరించారు. పరిశుభ్రత కార్యక్రమానికి కొత్త శక్తినివ్వడం, జీవనశైలి సమస్యలకు పరిష్కారం, మొబైల్ ఫోన్లకు అతీతంగా బాహ్య ప్రపంచాన్వేషణ మార్గాలను యువతకు సూచించాల్సిందిగా విద్యావేత్తల సమాజానికి ప్రధాన మంత్రి పిలుపునిచ్చారు. ముఖ్యంగా విద్యార్థుల కు వారే ఆదర్శప్రాయులు గా నిలవాలి అని కోరారు. పాలనలోనూ సామాజిక దృక్పథం ప్రతిబింబిస్తోందని, పట్టభద్రులైన యువత కనీసం ఏదో ఒక వృత్తిలో నైపుణ్యం కూడా సాధించాలని సూచించారు. ‘‘ఈ అంశాలపై సమగ్ర మేధామథనం తో కూడిన ప్రక్రియ ను మీరు ప్రతి పాత్ర లో, ప్రతి సంస్థ లో, జాతీయ స్థాయి లో ముందుకు తీసుకుపోవాలి’’ అని పిలుపునిచ్చారు. మన దేశం ‘వికసిత భారతం’గా రూపొందే కాలాన్ని ప్రధాన మంత్రి సంవత్సరాంత పరీక్ష తో పోల్చారు. విద్యార్థుల లో విశ్వాసం, సన్నద్ధత, అంకితభావం ప్రోది చేయడంతోపాటు లక్ష్య సాధనకు అవసరమైన క్రమశిక్షణ దిశగా వారి కుటుంబాలు పోషించే పాత్రను ఆయన గుర్తుచేశారు. అదే తరహా లో దేశ పౌరులు గా మన కోసం మనం ఒక పరీక్ష లో ఉత్తీర్ణత కు గడువు ను నిర్దేశించుకున్నామని ఆయన వ్యాఖ్యానించారు. ‘‘వికసిత భారతం పరీక్ష లో నెగ్గేందుకు మన ముందు 25 ఏళ్ల అమృత కాలం ఉంది. కాబట్టి ఈ గమ్యస్థానాని కి చేరుకోవడానికి మనం 24 గంటలూ శ్రమించాలి. సకుటుంబ సమేతం గా మనం సృష్టించుకోవలసిన వాతావరణం ఇదే’’ అని ప్రధాన మంత్రి ఉద్ఘాటించారు.
వేగం గా పెరుగుతున్న దేశ జనాభాకు యువత సాధికారత కల్పిస్తోందని శ్రీ మోదీ పేర్కొన్నారు. రాబోయే 25-30 సంవత్సరాల లో పని చేయగల వయోజనుల సంఖ్యపరం గా భారతదేశం అగ్రగామి గా ఉంటుంది, ప్రపంచం కూడా ఈ వాస్తవాన్ని గుర్తిస్తుంది అని తెలిపారు. ‘‘మార్పు తేగలిగిందీ, ఆ మార్పు ను అనుభవించేదీ యువ శక్తే’’ అని ప్రధాన మంత్రి మోదీ అన్నారు. ఆ మేరకు నేటి కళాశాల లు, విశ్వవిద్యాలయాల లో యువత భవిష్యత్తు కు రానున్న 25 సంవత్సరాలు నిర్ణయాత్మకం కానున్నాయి అని ఆయన స్పష్టం చేశారు. భవిష్యత్తు లో కొత్త కుటుంబాల ను, సమాజాన్ని సృష్టించబోయేది కూడా యువతరమే అని ఆయన పేర్కొన్నారు. కాబట్టి వికసిత భారతం ఎలా ఉండాలో నిర్ణయించుకునే హక్కు వారికే ఉందన్నారు. ఈ స్ఫూర్తి తో దేశం లో ప్రతి యువ ప్రతినిధి ని వికసిత భారతం కార్యాచరణ ప్రణాళిక తో సంధానించాలని ప్రభుత్వం ఆకాంక్షిస్తోందని ప్రధాన మంత్రి పేర్కొన్నారు. అభివృద్ధి చెందిన భారతదేశ నిర్మాణం పై విధాన వ్యూహం లో పాలుపంచుకొనేటట్టు గా యువత ను మలచాలి అని ఆయన స్పష్టం చేశారు. ఈ దిశ లో కీలక పాత్ర ను పోషించవలసింది యువతరం తో గరిష్ఠ సంబంధాలు గల విద్యా సంస్థలే అని నొక్కిచెప్పారు.
చివర లో దేశ ప్రగతి ప్రణాళిక ను నిర్ణయించేది ప్రభుత్వం ఒక్కటే కాదు, అందులో తన వంతు పాత్ర ను పోషించవలసిన బాధ్యత యావత్తు జాతి కి ఉంటుంది అని ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ అన్నారు. ఎంత భారీ సంకల్పం అయినప్పటికీ ఉమ్మడి కృషి.. అనగా ప్రజల యొక్క భాగస్వామ్యం తో సులభ సాధ్యం కాగలదు అని ఆయన చెబుతూ ఆ మేరకు ‘‘దేశం లో ప్రతి ఒక్క పౌరురాలు, ప్రతి ఒక్క పౌరుడు వారి ఆలోచన ను వెల్లడి చేయాలి... కార్యాచరణ లో క్రియాశీల భాగస్వామి సైతం కావాలి’’ అంటూ శ్రీ నరేంద్ర మోదీ దిశానిర్దేశం చేశారు. ఈ మేరకు స్వచ్ఛ భారత్, డిజిటల్ భారత్ కార్యక్రమాలతో పాటు కరోనా విధ్వంసం నుండి పునరుత్థానం, ‘స్థానికతే మన నినాదం‘ (వోకల్ ఫార్ లోకల్) వంటివి సమష్టి కృషి శక్తి ని ప్రస్ఫుటం చేస్తున్నాయి అని ఆయన ఉదాహరించారు. కాబట్టి ‘‘వికసిత భారత్ ను నిర్మించడం సమష్టి కృషి తోనే సాధ్యం’’ అని ప్రధాన మంత్రి అన్నారు. ఈ దిశ లో ప్రస్తుత కార్యక్రమాని కి హాజరు అయిన మేధావుల పై ఎన్నో ఆశలు, అంచనాలు ఉన్నాయి అని శ్రీ నరేంద్ర మోదీ పునరుద్ఘాటించారు. వారంతా దేశ ప్రగతి దృష్టికోణం యొక్క రూపకర్తలు, యువశక్తి కి మార్గనిర్దేశం చేసే మేధావులు కావడమే ఈ ఆకాంక్షల కు కారణం అని తెలిపారు. వికసిత భారతం మరింత సుసంపన్నం అయ్యేటట్టు సూచనల ను, సలహాల ను ఇవ్వవలసింది గా వారి ని కోరారు. ‘‘ఉజ్వల దేశ భవిష్యత్తు ను రచించే దిశ లో ఇది ఒక గొప్ప కార్యక్రమం’’ అంటూ ప్రధాన మంత్రి తన ప్రసంగాన్ని ముగించారు.
పూర్వరంగం
దేశ ప్రగతి కోసం జాతీయ ప్రణాళికల రూపకల్పన, ప్రాథమ్యాలు, లక్ష్యాలకు సంబంధించి యువతరానికి చురుకైన పాత్ర కల్పించే దిశగా ప్రధాన మంత్రి దూరదృష్టి కి అనుగుణం గా ‘వికసిత భారతం@2047: యువగళం’ కార్యక్రమం వారికి ఒక వేదికను సమకూరుస్తుంది. ఈ దృష్టికోణాని కి యువతరం తమ ఆలోచనల ను జోడించడం కోసం ఈ వేదిక ను ఉపయోగించడం జరుగుతుంది.
ఈ దిశగా వారికి అవగాహన ను కల్పించేందుకు ఏర్పాటు చేసే కార్యశాలలు వికసిత భారతం@2047 కోసం సూచన ల మరియు సలహా ల స్వీకరణ లో కీలకంగా ఉంటాయి. మనం 2047లో స్వాతంత్ర్య శతాబ్ది వేడుకలు నిర్వహించుకునే నాటికి దేశాన్ని వికసిత భారతం గా రూపుదిద్దడమే ‘వికసిత భారతం@2047’ లక్ష్యం. ఇందులో ఆర్థిక వృద్ధి, సామాజిక ప్రగతి, పర్యావరణ సుస్థిరత, సుపరిపాలన సహా అభివృద్ధి సంబంధిత వివిధ అంశాలు అంతర్భాగం గా ఉంటాయి.
(Release ID: 1985455)
Visitor Counter : 765
Read this release in:
Bengali
,
Assamese
,
Odia
,
Malayalam
,
English
,
Urdu
,
Hindi
,
Marathi
,
Manipuri
,
Punjabi
,
Gujarati
,
Tamil
,
Kannada