ప్రధాన మంత్రి కార్యాలయం
డిసెంబరు 8 వ తేదీ న దెహ్‌రాదూన్ ను సందర్శించనున్న ప్రధాన మంత్రి; ‘ఉత్తరాఖండ్ గ్లోబల్ ఇన్‌వెస్టర్స్ సమిట్ 2023’ ను ఆయన ప్రారంభిస్తారు
ఈ శిఖర సమ్మేళనం యొక్క ఇతివృత్తం ‘‘శాంతి నుండి సమృద్ధి’’ అనేదే
ఉత్తరాఖండ్ ను ఒక క్రొత్త పెట్టుబడి గమ్యస్థానం గా తీర్చిదిద్దడం ఈ శిఖర సమ్మేళనం ధ్యేయం
Posted On:
06 DEC 2023 2:21PM by PIB Hyderabad
ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ 2023 డిసెంబరు 8 వ తేదీ న ఉత్తరాఖండ్ లోని దెహ్‌రాదూన్ ను సందర్శించనున్నారు. ‘ఉత్తరాఖండ్ గ్లోబల్ ఇన్‌వెస్టర్స్ సమిట్ 2023’ ను ఆయన ఉదయం సుమారు 10:30 గంటల వేళ కు దెహ్‌రాదూన్ లోని ఫారెస్ట్ రిసర్చ్ ఇన్‌స్టిట్యూట్ లో ప్రారంభిస్తారు. ఈ సందర్భం లో జన సమూహాన్ని ఉద్దేశించి ప్రధాన మంత్రి ప్రసంగించనున్నారు.
ఉత్తరాఖండ్ ను ఒక క్రొత్త పెట్టుబడి గమ్యస్థానం గా తీర్చిదిద్దే దిశ లో ‘ఉత్తరాఖండ్ గ్లోబల్ ఇన్‌వెస్టర్స్ సమిట్ 2023’ ఒక ముందడుగు గా ఉండబోతోంది. ‘‘శాంతి నుండి సమృద్ధి’’ అనే ఇతివృత్తం తో శిఖర సమ్మేళనం 2023 డిసెంబరు 8 వ మరియు 9 వ తేదీల లో రెండు రోజుల పాటు జరుగుతుంది.
ప్రపంచం లో వివిధ ప్రాంతాల నుండి వేల కొద్దీ పెట్టుబడిదారులు మరియు ప్రతినిధులు ఈ శిఖర సమ్మేళనాని కి హాజరు కానున్నారు. కేంద్ర మంత్రులు, వేరు వేరు దేశాల కు చెందిన రాయబారుల తో పాటు ప్రముఖ పారిశ్రామికవేత్త లు తదితరులు కూడా ఈ కార్యక్రమం లో పాలుపంచుకొంటారు.
***
(Release ID: 1983160)
Visitor Counter : 121
Read this release in:
Urdu
,
Kannada
,
Assamese
,
English
,
Marathi
,
Hindi
,
Manipuri
,
Bengali
,
Punjabi
,
Gujarati
,
Odia
,
Tamil
,
Malayalam