ప్రధాన మంత్రి కార్యాలయం
స్విస్ కాన్ఫెడరేషన్ అధ్యక్షుడితో ప్రధాని సమావేశం
Posted On:
01 DEC 2023 8:01PM by PIB Hyderabad
ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ 2023 డిసెంబరు 1న ‘దుబాయ్’లో కాప్-28 శిఖరాగ్ర సదస్సు నేపథ్యంలో స్విస్ కాన్ఫెడరేషన్ అధ్యక్షుడు గౌరవనీయ అలైన్ బెర్సెట్ తో ద్వైపాక్షిక సమావేశంలో పాల్గొన్నారు.
ఈ సందర్భంగా వాణిజ్యం-పెట్టుబడులు, సాంకేతికత, ఆరోగ్యం, విద్య, ఐటీ, పర్యాటక రంగాలు సహా రెండు దేశాల ప్రజల మధ్య సంబంధాలకు సంబంధించి సహకారంతోపాటు తమ భాగస్వామ్యాన్ని మరింత పటిష్టం చేసుకునే మార్గాలపై వారిద్దరూ చర్చించారు. అలాగే పరస్పర ప్రయోజనం సంబంధిత ప్రాంతీయ, అంతర్జాతీయ అంశాలు కూడా ఈ చర్చల్లో ప్రస్తావనకు వచ్చాయి.
భారత్ జి20 అధ్యక్ష బాధ్యతలతోపాటు శిఖరాగ్ర సదస్సును విజయవంతంగా నిర్వహించడంపై ప్రధానమంత్రిని అధ్యక్షుడు బెర్సెట్ అభినందించారు.
****
(Release ID: 1981804)
Visitor Counter : 121
Read this release in:
English
,
Urdu
,
Hindi
,
Marathi
,
Manipuri
,
Bengali
,
Punjabi
,
Gujarati
,
Odia
,
Tamil
,
Kannada
,
Malayalam