ప్రధాన మంత్రి కార్యాలయం
azadi ka amrit mahotsav

ఐఎఎఫ్ కు చెందిన అనేక విధుల ను నిర్వర్తించే తరహా జెట్పోరాట విమానం తేజస్ లో ప్రయాణించడాన్ని పూర్తి చేసిన ప్రధాన మంత్రి

Posted On: 25 NOV 2023 1:07PM by PIB Hyderabad

భారతీయ వాయుసేన (ఐఎఎఫ్) కు చెందిన అనేక విధుల ను నిర్వర్తించే తరహా జెట్ శ్రేణి పోరాట విమానం తేజస్ లో ప్రయాణించడాన్ని ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ విజయవంతం గా పూర్తి చేశారు.

 

ప్రధాన మంత్రి తనకు కలిగిన అనుభూతి ని ఎక్స్ మాధ్యం లో ఈ క్రింది విధం గా తెలియ జేశారు :

‘‘తేజస్ లో ప్రయాణాన్ని విజయవంతం గా ముగించాను. ఆ అనుభూతి నమ్మశక్యం కానట్లు గా ఉండడంతో పాటు గా ఎంతో బాగుంది; ఇది మన దేశాని కి ఉన్న స్వదేశీ సామర్థ్యాల పట్ల నాలో విశ్వాసాన్ని చెప్పుకోదగినంత గా పెంచి వేసింది; మరి మన దేశాని కి ఉన్న సామర్థ్యం పట్ల నాలో వినూత్నమైనటువంటి గర్వం మరియు ఆశావాదం తాలూకు భావనలు ఇదివరకటి కంటే మరింత గా పెరిగాయి.’’

‘‘నేను ఈ రోజు న తేజస్ లో ప్రయాణిస్తూ అత్యంత గర్వం తో ఈ మాటల ను చెప్పదలచుకొన్నాను.. మన శ్రమ మరియు లగ్నం ల కారణం గా మనం ఆత్మనిర్భరత రంగం లో ప్రపంచం లో మరెవ్వరికీ తీసిపోం. భారతీయ వాయుసేన, డిఆర్ డిఒ మరియు హెచ్ఎఎల్ లతో పాటు గా భారతదేశం లో అందరికి హృద‌యపూర్వకమైన శుభాకాంక్షలు.’’

 


(Release ID: 1980402) Visitor Counter : 105