ప్రధాన మంత్రి కార్యాలయం
azadi ka amrit mahotsav

రాణి లక్ష్మీబాయి జయంతి సందర్భంగా ప్రధాని నివాళి

నాడు పోస్టు చేయడమైనది: 19 NOV 2023 11:11AM by PIB Hyderabad

భారత నారీశక్తి ధైర్యసాహసాలకు ప్రతీక అయిన రాణీ లక్ష్మీబాయి జయంతి నేపథ్యంలో ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఆమెకు హృదయపూర్వక నివాళి అర్పించారు.

ఈ మేరకు 'ఎక్స్' ద్వారా పంపిన ఒక సందేశంలో:

“భారత మహిళా శక్తి ధైర్యసాహసాలకు ప్రతీక అయిన రాణి లక్ష్మీబాయి జయంతి సందర్భంగా ఆమెకు నా ప్రగాఢ నివాళి. పరాయి పాలకుల దురాగతాలను ఎదుర్కొనడంలో ఆమె ప్రదర్శించిన మొక్కవోని ధైర్యం, అసమాన త్యాగాల గాథ  తరతరాలకూ స్ఫూర్తినిస్తూనే ఉంటుంది" అని ప్రధానమంత్రి పేర్కొన్నారు.

 

 

***

DS/ST


(రిలీజ్ ఐడి: 1977978) సందర్శకుల సూచీ సంఖ్య : : 171